ఎంసీఏ ఎన్నికల్లో సందీప్‌ పాటిల్‌ పరాజయం | Mumbai Cricket Association polls: Sandip Patil loses to Amol Kale | Sakshi
Sakshi News home page

ఎంసీఏ ఎన్నికల్లో సందీప్‌ పాటిల్‌ పరాజయం

Published Fri, Oct 21 2022 10:21 AM | Last Updated on Fri, Oct 21 2022 10:21 AM

Mumbai Cricket Association polls: Sandip Patil loses to Amol Kale - Sakshi

ముంబై: ప్రతిష్టాత్మక ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎంసీఏ) ఎన్నికల్లో భారత మాజీ క్రికెటర్‌ సందీప్‌ పాటిల్‌కు అనూహ్య ఓటమి ఎదురైంది. అమోల్‌ కాలే 25 ఓట్ల తేడాతో పాటిల్‌పై గెలుపొందారు. బీసీసీఐ కోశాధికారి ఆశిష్‌ షెలార్‌ మద్దతుతో బరిలో నిలిచిన కాలేకు 183 ఓట్లు రాగా, పాటిల్‌కు 158 ఓట్లు వచ్చాయి.

భారత జట్టు తరఫున 29 టెస్టులు, 45 వన్డేలు ఆడిన 66 ఏళ్ల పాటిల్‌ జాతీయ క్రికెటర్‌ అకాడమీ డైరెక్టర్‌గా, బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా కూడా వ్యవహరించారు. భారత్, కెన్యా, ఒమన్‌ జట్లకు కోచ్‌గా కూడా పని చేసిన ఆయన కొద్ది రోజుల క్రితమే ఎంసీఏ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు.
చదవండి: T20 World Cup 2022: నమీబియాపై యూఏఈ విజయం.. నెదర్లాండ్స్‌ సెలబ్రేషన్స్‌ అదుర్స్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement