క్రికెటర్ జయసూర్యపై భార్య కోర్టులో పిటిషన్!
ప్రస్తుత శ్రీలంక క్రికెట్ సెలెక్షన్ ప్యానెల్ చైర్మన్, మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య భార్య సండ్రా జయసూర్య విడాకుల కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని ఆమె తరపు న్యాయవాదుల వెల్లడించారు.
అక్టోబర్ 23 తేదిన జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని.. సాండ్రా తరపు అటార్ని అనోమా గునథిలకే తెలిపారు. త్వరలోనే జయసూర్యకు నోటిసులు జారీ చేస్తారని.. ఆతర్వాత వాదనలు ప్రారంభమవుతాయన్నారు. తన ముగ్గురు పిల్లలతోపాటు తన మెయింటెనెన్స్ కోసం 20 మిలియన్ల ఇప్పించాలని పిటిషన్ లో పేర్కొన్నట్టు అటార్ని తెలిపారు.
శ్రీలంక అధ్యక్షుడు మహింద్ర రాజపక్స ప్రభుత్వంలో జయసూర్య పోస్టల్ శాఖలో డిప్యూటి మినిస్టర్ గా సేవలందిస్తున్నారు. ఏప్రిల్ 2010లో జరిగిన ఎన్నికల్లో జయస్యూర్య పార్లమెంట్ కు ఎన్నికయ్యారు.