సండ్ర అరెస్టయ్యారా?
తనకు తెలియదన్న దేవాదాయ మంత్రి
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అరెస్టయిన విషయం తనకు తెలియదని దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకవర్గ సభ్యుడిగా వీరయ్యను కొనసాగించ టంపై న్యాయ సలహా తీసుకుంటామని తెలిపారు. మంగళవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడారు.