ఒబామాకు మేనకాగాంధీ లేఖ
నిషిక్: పర్యావరణ ఉద్యమకారిని, కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు లేఖ రాశారు. వినోదం కోసం స్పెయిన్ లో నిర్వహించే (సాన్ ఫర్మినా ఫెస్టివల్) ఎద్దుల పరుగుపందెం పోటీలకు హాజరు కాకూడదని ఆయనను కోరారు.ఈ నెలలో స్పెయిన్ లో తన పర్యటన సమయంలో పంప్లోనాలోని సాన్ ఫర్మిన్ లో నిర్వహించే ఉత్సవానికి ఒబామా హాజరుకానున్న నేపథ్యంలో ఆమె ఈ లేఖను రాశారు.
ఇలాంటి ఉత్సవాలను వ్యతిరేకించాలని కోరారు. ఈ ఉత్సవంలో 48 ఎద్దులను ఉపయోగిస్తారని గాయాలతో ఇవి మరణిస్తాయని ఆమె లేఖలో పేర్కొన్నారు. జంతువుల పట్ల మానవత్వాన్ని చూపాలని, స్పెయిన్ లోని 100 నగరాల్లో జరుగుతున్న ఈ ఉత్సవాన్ని నిషేధించాలని ఆమె డిమాండ్ చేశారు.