sangamreddy Satyanarayana
-
సునోజి మేరగాన – కహాతా రహే తెలంగాణ..
సంగంరెడ్డి సత్యనారాయణ (Sangam Reddy Satyanarayana) పేరు తెలంగాణ పాత తరానికి బాగా పరిచయం. కొత్త తరానికి ఆయన అంతగా తెలియదు. వరంగల్ జిల్లాలోని ముచ్చర్ల (Mucherla) గ్రామంలో 1933 జనవరి 21న పుట్టిన ఆయన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మూలమైన ‘నాన్–ముల్కి’ ఉద్యమం 1950లో ప్రారంభమైనప్పుడు దానికి సాహిత్య ప్రాణం పోసిన తొలి విద్యార్థి మేధావి. హన్మకొండలోని మల్టీ పర్పస్ హైస్కూల్ అధ్యక్షుడిగా ఆ స్కూల్లోని ఆంధ్ర టీచర్లు, తెలంగాణ భాషను అవమానిస్తుంటే తిరుగుబాటును ఆర్గనైజ్ చేశాడు. అప్పటినుండే పాటలు రాయడం, ఉపన్యాసమివ్వడం, నాటకాలెయ్యడంలో దిట్టగా ఎదిగాడు.‘పచ్చని చెట్ల పైట రెపరెపలాడంగ; పాడిపంటలనిచ్చి కడుపునింపే తల్లి చల్లని మా తల్లి ముచ్చర్ల గ్రామం’ వంటి పాటతో మొదలెట్టి, నాన్ –ముల్కీ పోరాటంలోనే ‘తెలంగాణ సోదర తెలుసుకో నీ బతుకు; మోసపోతివ నీవు గోస పడతావు’ అనే పాట రాసి, పాడి ఉర్రూత లూగించాడు. తన గ్రామంపై పాట రాసినందున ఆయనను ముచ్చెర్ల సత్యనారాయణ (Mucherla Satyanarayana) అనేవారు. ఊరి నుండి బడికి రోజూ 12 మైళ్ళు నడిచొచ్చే, బట్టలు కూడా సరిగా లేని ఆయన 12వ తరగతి ఫెయిల్ అయ్యాడు. సప్లమెంటరీ రాసి పాసై హైదరాబాద్‌కు వచ్చిసంగీత కళాశాలలో చేరాడు. ఉండటానికి చోటు లేక గూటి కోసం వెతగ్గా రవీంద్ర భారతి పక్కన బీసీ హాస్టల్ (BC Hostel) ఉందని తెలిసి సంగం లక్ష్మీబాయమ్మను కలిసి పాట పాడి ఆమెను మెప్పించి అడ్మిషన్ తెచ్చుకున్నాడు.ఒక సంవత్సరంలో హిందూస్థానీ, కర్ణాటక సంగీతం నేర్చుకొని సత్యనారాయణ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో (Osmania Arts College) బీఏ తెలుగు, సంస్కృతం, ఎకనామిక్స్ చదువుకున్నాడు. 1956లో తెలంగాణ స్టేట్ ఆంధ్రలో కలిసి ఆంధ్రప్రదేశ్ కావడంతో సత్యనారాయణ, ఆయన మిత్రులు నాన్– ముల్కీ ఉద్యమాన్ని ఆంధ్ర వ్యతిరేక ఉద్యమంగా మార్చారు. ఆ ఉద్యమ మొదటి పాట ఆయన రాసి పాడిందే. అదీ మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మీద.‘అయ్యయ్యో రామరామ సంజీవరెడ్డి మామ / సునోజి మేరగాన – కహాతా రహే తెలంగాణ /..... / ఛోడోజీ తెలంగాణ – భలే జావో రాయలసీమ’... ఈ పాట ఆ కొత్త ఉద్యమాన్ని ఉర్రూతలూగించింది. 1948 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుండి 1956 మధ్యలో అటు ఆంధ్ర నుండి, ఇటు మహారాష్ట్ర వివిధ ప్రాంతాల నుండి బ్రాహ్మణ మైగ్రేషన్ బాగా జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రమంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లిష్ డిగ్రీలు సంపాదించిన బ్రాహ్మణ మేధావులు ప్రొఫెసర్లు అయ్యారు. దాదాపు 1960 నాటికి ఇక్కడి రెడ్లు, వెలమలు ఎంఏ, ఎమ్మెస్సీ పట్టాలు పొందినవారు లేరు.1953–56 మధ్య సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలనే చర్చల్లో తెలంగాణ ప్రాంతం బ్రాహ్మణ మేధావులు ఉన్నారు. ఇప్పుడు వరంగల్‌లో ఒక హెల్త్ యూనివర్సిటీ పేరు, ఒక కళాక్షేత్రం పేరు పెట్టిన కాళోజీ 1969 వరకు సమైక్యవాదే. సత్యనారాయణ నాన్–ముల్కీ పోరాటం స్కూలు ప్రెసిడెంట్‌గా నడిపినపుడు జయశంకర్ ఆయన క్లాస్మేట్. ఇద్దరు కలిసి నాటకాలు వేశారు. కానీ సత్యనారాయణ లాగా మిలిటెంట్ నాన్– ముల్కీ వ్యతిరేక ఉద్యమంలో ఆయన ఉన్న దాఖలాలు లేవు. సత్యనారాయణ గొల్ల (యాదవ) కులంలో పుట్టినందున ఒక క్రియేటివ్ కవిగా, పాటగాడిగా ఆయనకు రావలసినంత గుర్తింపు రాలేదు. 1950 దశకంలో ఉస్మానియాలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన గ్రామానికి పోయి గ్రామ ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచ్, ఆ తరువాత 1970లో హన్మకొండ సమితి ప్రెసిడెంట్ అయ్యాడు. ఆనాటి మొట్ట మొదటి దళిత్ కలెక్టర్ కాకి మాధవరావుతో దోస్తీ చేసి గ్రామాలకు అభివృద్ధి పథకాలను తీసుకెళ్లాడు.చదవండి: ప్రపంచానికి ఏం రాసి పెట్టి ఉంది?1983 ఎన్టీఆర్ టీడీపీ రాగానే అందులో చేరి ఎమ్మెల్యేగా హయగ్రీవాచారిని చిత్తుగా ఓడించి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అయ్యాడు. అయితే అనతి కాలంలోనే వరంగల్ జిల్లాలో మైగ్రేట్ కమ్మ నాయకుడు శివాజిని, కమ్మ డాక్టర్ కల్పనాదేవిని ఆయనపై అజమాయిషికి పెట్టడంతో ఎన్టీఆర్ మీద ఆయన తిరుగుబాటు మొదలైంది. ఆయన ఎన్టీఆర్ మీద కోపంతో నాదెండ్ల భాస్కర్ రావు క్యాంపులో చేరి చివరికి పదవి కోల్పోయాడు. ఆ తరువాత మళ్ళీ కడవరకు అంటే 2016లో చనిపోయే వరకు ప్రత్యేక తెలంగాణ కోసం రకరకాల కార్యక్రమాలు చేపట్టాడు. 2001లో కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ పెడితే దానిలో చేరి కొంతకాలం పనిచేశాడు.చదవండి: ఓబీసీల వర్గీకరణతో సమన్యాయంఆయన చనిపోయి 8 సంవత్సరాలు అయినా ఆయనకో విగ్రహంగానీ, ఆయన పోతే వరంగల్ ప్రాంతంలో ఏ సంస్థనూ ఎవరూ పెట్టింది లేదు. ఆయనతో పని చేసిన జయశంకర్‌కు, కాళోజీకి, కొండా లక్ష్మణ్‌కి చాలా గుర్తింపు దొరికింది. జీవితంలో సుదీర్ఘకాలం బీదరికంలో బతికిన ఆయన మనకో ఆదర్శాన్ని మిగిల్చాడు.- ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు(జనవరి 21న సంగంరెడ్డి సత్యనారాయణ జయంతి) -
తొలితరం ఉద్యమ నేత..!
విశ్లేషణ జీవితమంతా తెలంగాణ కోసం ఉద్యమించిన పోరాటయోధుడు, వాగ్గేయకారుడు సంగంరెడ్డి సత్యనారాయణ మనమధ్య నుంచి నిష్ర్కమించారు కాని ఆయన చూపిన మార్గం, ఆదర్శాలు మిగిలే ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన తొలి తరం నాయకుల్లో ముందువరుసన నిలిచిన సంగంరెడ్డి సత్యనారా యణ అక్టోబర్ 10న హైదరా బాద్‌లో మరణించారు. ఆయన వయస్సు 86 ఏళ్లు. తల్లిదండ్రులు నర్సమ్మ, నర్సయ్య. ఉద్యమ నాయకుడు, కవి వాగ్గే యకారుడు, మంచివక్త, మాజీ మంత్రి సంగంరెడ్డి (ముచ్చర్ల) సత్యనారాయణ సొంత ఊరు హన్మకొండ మండలంలోని ముచ్చర్ల. బాల్యం నుంచి చురుకుతనంతో ఆటపాటలందు ఆసక్తే కాకుండా శ్రీకృష్ణ తులాభారం, సత్యహరిశ్చంద్ర వంటి నాటకాలు వేసి బహుమతులు గెల్చుకున్నారు. ఇంటర్మీడియట్లో సహవిద్యార్థి అయిన జయశంకర్ ఆ నాటకాల్లో స్త్రీ పాత్రలు వేసేవారు. 1952 నాటి ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, నాన్‌ముల్కి గోబ్యాక్ ఉద్య మాన్ని వరంగల్లులో మొదట ఆరం భించినవారు సంగంరెడ్డి. పోలీస్ యాక్షన్ చర్య తర్వాత హైదరాబాద్ రాష్ట్ర పరిపాలనా బాధ్యతలు చేపట్టిన మిలిటరీ జనరల్ జయంతినాధ్ చౌదరి అధికార భాషలో చదివి ఉన్నత స్థాయి పదవుల్లో ఉన్న సివిల్, పోలీస్ అధి కారులతో సహా దాదాపు 50 వేల పోస్టులను రద్దు చేసి వారి స్థానంలో ఆంగ్లం తెలిసిన నాన్ ముల్కిలైన ఆంధ్ర ప్రాంతం వారిని వివిధ పోస్టుల్లో నియమించటంతో ముల్కీ, నాన్ ముల్కీ సమస్య ఉత్పన్నమైంది. పుండు మీద కారంలా అప్పటి వరంగల్ డివిజన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్‌గా పనిచేసిన సెటిలర్ పార్థసారథి ఏకపక్షంగా 180 మంది స్థానిక ఉపాధ్యాయులను దూరప్రాంతా లకు బదిలీ చేసి వారి స్థానంలో ఆంధ్రప్రాంతం వారిని నియమించడంతో వరంగల్‌లో ఆందోళన మొదలైంది. ఆ ఆందోళనలో ముందుభాగాన నిల్చిన సత్యనారాయణ విద్యార్థి యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసి ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. 1953 డిసెంబర్లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నాటి ఒరిస్సా గవర్నర్ సయ్యద్ ఫజల్ ఆలీ చైర్మన్‌గా స్టేట్ రీ ఆర్గనైజింగ్ కమిటీని యేర్పాటు చేసినప్పుడు రాబోయే ప్రమాదాన్ని ముందే గ్రహించిన సత్యనారాయణ ‘తెలం గాణ సోదరా తెలుసుకోరానీరా మోస పోకురా, గోస పడుతవురా’ అంటూ జరిగే మోసాన్ని ముందుగానే ఊహించి హెచ్చరించారు. తాను ఊహించి నట్లుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్దమ నుషుల ఒప్పందాన్ని, రక్షణ సూత్రాలను యధేచ్చగా ఉల్లంఘిం చడంతో సంజీవరెడ్డి మామ.. సంజీవరెడ్డి మామ... చోడోజీ తెలంగాణ.. చేలే జావో రాయలసీమ అంటూ పాట ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత వెల్లు వెత్తిన 1969 నాటి తెలంగాణ ఉద్యమంలో ఈ పాట రణన్నినాదమైంది. టి పురుషోత్తమరావుతో కలిసి తెలం గాణ రక్షణల ఉద్యమ సమితిని స్థాపించి తెలంగాణ జిల్లాలన్నీ తిరిగి అనేక బహిరంగ సభలను నిర్వహించి ప్రజలను చైతన్య పరిచారు. ఆ సమయంలోనే స్థానికు లకు పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ విద్యుత్ స్టేష న్లో ఉద్యోగ నియామకాల విషయంలో స్థానికులకు జరి గిన అన్యాయం ఉద్యమ రూపం దాల్చి 1969 నాటికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమానికి అంకురా ర్పణ చేసింది. దాంట్లో భాగంగా జనవరి 8, 1969న ఖమ్మంలో అన్నబత్తుల రవీంద్రనాధ్ అనే విద్యార్థి తెలం గాణ కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసిన సందర్భంగా తన మాటపాటలతో ఉద్యమ స్ఫూర్తిని రగిలించాడు. రాజకీయ నాయకత్వం లేకుండా ఉద్యమం గెలు పొందదని గ్రహించి, ఉద్యమానికి దూరంగా ఉన్న మర్రి చెన్నారెడ్డిని ఉద్యమంలోకి ఆహ్వానిస్తూ ‘రావోయి రావోయి మర్రి చెన్నారెడ్డి, ఇకనైన రావేమీ వెర్రి చెన్నారెడ్డి’ అంటూ పాట ద్వారా పిలుపునిచ్చాడు. కానీ ఉవ్వె త్తున లేచిన తెలంగాణ ఉద్యమాన్ని ఆంధ్ర పాలకులు తుపాకి కాల్పులతో అణిచివేశారు. అయినా తెలంగాణ ఆకాంక్ష చావని సత్యనారాయణ జై తెలంగాణ పత్రిక స్థాపించి తెలంగాణ భావజాల ప్రచారం చేపట్టారు. 1959లో పంచాయితీ రాజ్ వ్యవస్థ వచ్చిన తర్వాత తొలుత ముచ్చర్ల గ్రామసర్పంచ్‌గా, హసన్‌పర్తి, ఆ తర్వాత హన్మకొండ పంచాయితీ ప్రెసిడెంటుగా సేవలం దించి.. తన ఊరిపేరైన ముచ్చర్ల సత్యనారాయణగా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించాడు. 1983లో ఎన్టీరామారావు స్థాపించిన టీడీపీ తరఫున హన్మకొండ నియోజక వర్గం అభ్యర్థిగా పోటీ చేసి తన రాజకీయ గురువు, కాంగ్రెస్ సీనియర్ నేత హయగ్రీవాచారిపై 18 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వెంటనే మంత్రి వర్గంలో రవాణా శాఖ మంత్రిగా కేబినెట్ హోదా కల్పిం చారు. కానీ స్వతంత్ర వ్యక్తిత్వం, తలవంచని నైజం కలి గిన సత్యనారాయణ రాజకీయాలకు దూరమై చాలా కాలం ఒంటరిగా ఉండి పోయారు. 2001న కె. చంద్ర శేఖర రావు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి మలి దశ ఉద్యమం ప్రారంభించినప్పుడు సీనియర్ ఉద్యమ నేత సత్యనారాయణ ఇచ్చిన సూచనలు ఉద్యమ నిర్మా ణానికి ఎంతగానో తోడ్పడ్డాయి. జీవితమంతా తెలం గాణ కోసం ఉద్యమించిన పోరాటయోధుడు సత్యనారా యణ మనమధ్య నుంచి నిష్ర్కమించాడు కాని ఆయన చూపిన మార్గం, ఆదర్శాలు మిగిలే ఉన్నాయి. (నేడు ఉదయం 11 గంటలకు హన్మకొండ, నక్కలగుట్టలోని నందనా గార్డెన్లో సంగంరెడ్డి సత్యనారాయణ సంస్మరణ సభ) వ్యాసకర్త: పి. చంద్ మొబైల్ : 95730 93526