రంజాన్ పండుగకు ఏర్పాట్లు
కలెక్టర్ నీతూప్రసాద్
ముకరంపుర : జిల్లాలో రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ నీతూప్రసాద్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో రంజాన్ ఏర్పాట్లపై అధికారులు, మత పెద్దలతో చర్చించారు. పండుగ సందర్భంగా మజీద్, ఈద్గా పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచనున్నట్లు తెలిపారు. పట్టణప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు, గ్రామీ ణ ప్రాంతాల్లో పంచాయతీ అధికారులు శానిటేషన్ పనులు చేపట్టాలని ఆదేశిం చారు. మజీద్ఈద్గాల వద్ద లైటింగ్ ఏర్పా ట్లు చేస్తామన్నారు. తాగునీటికి ఇబ్బం దులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తగినంత బ్లీచింగ్ పౌడర్‌ను కొనుగోలు చేసుకోవాలని పంచాయతీ మున్సిపల్ అధికారులను కోరారు. నమాజు చేసే సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని ట్రాన్స్‌కో ఎస్ఈని ఆదేశించారు. ఎస్పీ జోయెల్ డేవిస్ మాట్లాడుతూ పండుగ ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి చర్యలు చేపడతామని చెప్పారు.
మజీదుల వద్ద నమాజ్ సమయంలో వాహనాల తనిఖీలు లేకుండా చేస్తామన్నారు. కొత్తవారికి అవకాశం కల్పించి పీస్ కమిటీలను ఏర్పాటు చేస్తామని వివరించారు. కరీంనగర్ డీఎస్పీ రామారావు, నగరపాలక సంస్థ కమిషనర్ కృష్ణభాస్కర్, జగిత్యాల సబ్‌కలెక్టర్ శశాం క, ఏజేసీ నాగేంద్ర, డీఆర్వో వీరబ్రహ్మయ్య, ఆర్డీవోలు, మతపెద్దలు అక్బర్ హుస్సేన్, వహాజుద్దీన్, అబ్బాస్‌షమీ, మునీర్, మోసిన్, నయీమ్, సిరాజ్ హుస్సే న్, ముజాహిద్ హుస్సేన్, కమ్రొద్దీన్, అస్మత్ బేగ్, అఖిత్, వాజీద్ పాల్గొన్నారు.
బడిబాటను విజయవంతం చేయాలి
ముకరంపుర : రాష్ట్రవ్యాప్తంగా 3వ తేదీ నుంచి బడిబాటను చేపట్టినట్లు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలను మెరుగుపరిచామని తెలిపారు. ప్రతి పాఠశాలలో ఫర్నిచర్, మరుగుదొడ్లు, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. విద్యావాలంటీర్లను నియమించుకోవడానికి కలెక్టర్లకు అధికారాలనిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ బడిబాటను విజయవంతం చేయడానికి ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తామని తెలిపారు.
మిషన్‌మోడ్‌లో ఐఎస్ఎల్ పూర్తి చేయాలి
అన్ని మున్సిపాలిటీలు, కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లలో మిషన్‌మోడ్‌లో పని చేసి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. క్యాంపను కార్యాలయంలో కమిషనర్లతో సమీక్షించారు. అన్ని శాఖల సిబ్బందిని వినియోగించుకుని వారం రోజులలోపు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో డిసెంబర్ నాటికి ఐఎస్ఎల్ వంద శాతం పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ కృష్ణభాస్కర్ తదితరులున్నారు.