11 గంటల్లో సినిమా షూటింగ్ పూర్తి
ఉదయం 7 గంటలకు ప్రారంభించి సాయంత్రం 6 గంటలకు షూటింగ్ పూర్తి చేసుకున్న తొలి చిత్రం తప్పా యోసిక్కాదీంగ. సోమవారం ఈ చిత్ర షూటింగ్ చెన్నైలో పూర్తి చేసుకుంది. జి.అనిల్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రం ద్వారా సుల్తాన్ దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఈయన ఫిలిం ఇన్స్టిట్యూట్ విద్యార్థి. ఎవిఎం సంస్థలో 13 సీరియల్స్‌కు దర్శకత్వం వహించారు. తెండ్రల్ సీరియల్ ఫేమ్ రాజా హీరోగా నటిం చిన ఈ చిత్రంలో జ్యోతిషా, సనీల హీరోయిన్లుగా నటించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఒక యువకుడు తాత్కాలికంగా చేసే ఉద్యోగాన్ని కోల్పోతే తన కుటుంబంలో ఎదురయ్యే వ్యతిరేకత, ఆర్థిక ఇబ్బందులు ఎలా ఉం టాయి, చివరికి వాటిని ఎలా ఎదుర్కొన్నారన్న అంశాల సమాహారంగా ఉంటుందన్నారు.
అదే విధంగా ఈ రోజుల్లో భార్యభర్తల మధ్య అవగాహన ఎంత ముఖ్యమో చెప్పే చిత్రంగా తప్ప యోసిక్కాదీంగ (తప్పుగా ఆలోచించకండి) చిత్రం ఉంటుందన్నారు. ఈ చిత్రాన్ని 11 గంటల్లో రూపొందించడానికి పగడ్బందీగా ప్రణాళిక సిద్ధం చేశారని వివరించారు. నటీనటులతో ముందుగా పలుమార్లు రిహార్సిల్స్ చేయించినట్లు వెల్లడించారు. 11 గంటల్లో పూర్తి చిత్రం టాకీ పార్టుతో పాటు రెండు పాటలను కూడా చిత్రీకరించినట్లు దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్ర నిర్మాణం గురించి దర్శకుడు విశ్వాసం వ్యక్తం చేయడంతో తాను నిర్మాణానికి సిద్ధం అయ్యానని అయితే చెప్పింది చెప్పినట్లుగా తెరకెక్కించి తానేమిటో నిరూపించుకున్నానని నిర్మాత జి.అనిల్‌కుమార్ తెలిపారు.