Sankaran
-
ప్రముఖ దర్శకనటుడు కన్నుమూత
సీనియర్ దర్శకుడు, నటుడు ఆర్ శంకరన్ (93) ఇక లేరు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం చైన్నెలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల దర్శకుడు భారతి రాజా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన గురువు శంకరన్ మృతి తీవ్ర మనస్తాపానికి గురిచేసిందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. అదేవిధంగా పలువురు సినీ ప్రముఖులు శంకరన్‌కు నివాళులు అర్పిస్తున్నారు. 1962లో విడుదలైన 'ఆడి పేరుకు' చిత్రం ద్వారా నటుడిగా పరిచయమయ్యారు శంకరన్. ఆ తర్వాత ఊరు, ఖైదీ, లీలావతి, ఖాదర్ కోట్టై తదితర చిత్రాల్లో నటించారు. కార్తీక్, రేవతి జంటగా నటించిన మౌనరాగం చిత్రంలో రేవతి తండ్రిగా చంద్రమౌళి అనే పాత్రలో నటించి బాగా పాపులర్ అయ్యారు. ఈయన చివరిగా 1999లో అళగర్ సామి అనే చిత్రంలో నటించారు. 1974లో విడుదలైన ఒన్నే ఒన్ను కన్నె కన్ను అనే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత తేన్ సింధు దే వానం, దుర్గాదేవి, ఒరువనుక్కు ఒరుత్తి, తూండిల్ మీన్, పెరిమై కురియవన్, వేలుమ్ మైలుమ్ తున్నై, కుమారి పెణిన్ ఉళ్లత్తిలే వంటి పలు సక్సెస్ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. దర్శకుడు భారతి రాజా ఈయన వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారన్నది గమనార్హం. எனது ஆசிரியர் இயக்குனர் திரு.ரா.சங்கரன் சார் அவர்களின் மறைவு வேதனை அளிக்கிறது. அவரை இழந்து வாடும் அவரது குடும்பத்தினருக்கு ஆழ்ந்த இரங்கலைத் தெரிவித்துக் கொள்கிறேன். pic.twitter.com/SJmO0dApeq — Bharathiraja (@offBharathiraja) December 14, 2023 చదవండి: అది కుక్కల చేతుల్లోకి వెళ్తోంది.. వారు విషం చిమ్ముతున్నారు.. -
అవునూ.. మన అడవుల్లో ఏనుగెందుకు లేదు?
మీరు ఓ విషయాన్ని గమనించారా? మన రాష్ట్రంలో జూలో తప్ప అడవుల్లో ఏనుగులు లేవు. చుట్టూ ఉన్న రాష్ట్రాలన్నింటిలోనూ ఉన్నాయి. దక్షిణాదిలో అయితే.. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మందలు మందలుగా కనిపిస్తే.. ఇటు ఏపీలోనూ పదుల సంఖ్యలో అటవీ ప్రాంతాల్లో ఏనుగులు తిరుగుతూ ఉంటాయి. మరి తెలంగాణలో ఎందుకు లేవు? ఇటీవలే ఎలిఫెంట్ విష్పరర్స్ డాక్యుమెంటరీకి ఆస్కార్ పురస్కారం దక్కిన నేపథ్యంలో ఏనుగుల మీదకు అందరి దృష్టి మళ్లింది. ఈ నేపథ్యంలో అసలు గజరాజు తెలంగాణలో ఎందుకు లేడు? పక్క రాష్ట్రాల నుంచి ఎందుకు రాడు? అన్న విషయంపై ఓ లుక్కేద్దామా.. – సాక్షి, హైదరాబాద్ ఎందుకు లేవు.. ఎందుకు రావు.. ♦తెలంగాణలో ఏనుగులు కనిపించకపోవడానికి ప్రధానంగా భౌగోళిక, వాతావరణ పరిస్థితులే కారణం. తెలంగాణ, చుట్టుపక్కల ప్రాంతాలు భౌగోళికంగా దక్కన్ పీఠభూమిపై ఉండటంతోపాటు అడవుల మధ్య ‘డ్రై ఏరియా’ కారణంగా చారిత్రకంగానే ఇక్కడ ఏనుగులు లేవు. తెలంగాణకు ఆనుకుని ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలోని జిల్లాలన్నీ (పూర్వపు హైదరాబాద్ స్టేట్‌లోని) పొడి వాతావరణం, వర్షాభావ పరిస్థితులున్న ప్రాంతాలే. రాయచూర్, గుల్బర్గా, అకోలా, బీదర్, నాందేడ్ తదితర చోట్లా ఏనుగులు లేకపోవడంతో తెలంగాణలో ఏనుగుల ప్రవేశానికి అవకాశాలు లేకుండా పోయాయి. ♦ఏనుగులు స్థిర నివాసం ఏర్పరుచుకోవాలంటే దట్టమైన అడవులు, పచ్చదనం అవసరం. కనీసం 1,000–1,500 మిల్లీమీటర్ల వర్షపాతముండే ప్రాంతాలు కావాలి. తేమ వాతావరణం ఉండాలి. కనీసం 7, 8 నెలల పాటైనా అడవుల్లోని చెట్లు ఆకులు కలిగి ఉండాలి. గడ్డి ఎల్లప్పుడూ పచ్చగా ఉండాలి. ఒక్కో ఏనుగుకు సగటున రోజుకు 150 నుంచి 200 కేజీల మేత అవసరం. ఒక గుంపులో ఐదు ఏనుగులుంటే రోజూ టన్ను మేత కావాలి. తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఇలాంటి దట్టమైన అడవులు లేకపోవడం వల్ల.. పెద్ద పులులు, ఇతర జంతువులు పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వచ్చి, స్థిర నివాసం ఏర్పరుచుకుంటున్నా ఏనుగులు మాత్రం రావడం లేదు. ♦ అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఏనుగులున్న చిత్తూరు, విజయనగరం జిల్లాల నుంచి తెలంగాణలోకి రావడానికి ఎలాంటి అడవుల కనెక్షన్ లేదు. మధ్యలో మైదాన ప్రాంతాలను దాటి ఏనుగులు ఇటు వచ్చేందుకు అవకాశాల్లేవు. ఏపీ సరిహద్దుల్లో ఖమ్మంకు ఆనుకుని పశ్చి మగోదావరి, మహబూబ్‌నగర్‌కు ఆనుకుని కర్నూలు, నల్లగొండ వైపు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఏనుగులు లేవు. దీనితో తెలంగాణలోకి వచ్చే పరిస్థితి లేదు. ♦ గతంలో ఉమ్మడి ఏపీలోకి రెండు మార్గాల్లో ఏనుగులు వచ్చాయి. ఒకటి.. చిత్తూరు జిల్లాకు ఆనుకుని ఉన్న కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని అడవుల నుంచి వచ్చాయి. ఆ రెండు రాష్ట్రాలు కూడా ఏనుగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలే. ఆయా చోట్ల ఏనుగుల సంతతి పెరగడంతో పొరుగునే ఉన్న ఏపీలోకి ప్రవేశించాయి. స్థిరనివాసం ఏర్పరుచుకునే వాతావరణం, పరిస్థితులు ఉండడంతో ఇక్కడే ఉండిపోయాయి. ♦ ఇక రెండోది.. ఒడిశాకు పలుమార్లు భారీ వరదలు రావడంతో సరిహద్దుల్లోని విజయనగరం జిల్లాకు కొన్ని ఏనుగులు వలస వచ్చాయి. తిరిగి వెళ్లకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉండిపోయాయి. అదేవిధంగా జార్ఖండ్ నుంచి కూడా ఏనుగులు వలస వచ్చాయి. చారిత్రకంగా, భౌగోళికంగా, ఇతర ప్రధాన కారణాలతో తెలంగాణలో ఏనుగులు లేవు. ఏపీలోని నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లోనూ, ఇతర ప్రాంతాల్లోనూ ఏనుగులు లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏనుగును నల్లమల అటవీ ప్రాంతానికి తీసుకువచ్చేలా ఒక కారిడార్ ఏర్పాటు చేయాలని అధికారులు భావించారు. చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో పెద్దపులులు అసలు లేకపోవడం, ఇటు తెలంగాణలో ఏనుగులు లేకపోవడంతో.. రెండు ప్రాంతాల్లో పరస్పరం పులులు, ఏనుగులను మార్పిడి చేస్తే బావుంటుందని అంచనా వేశారు. ఈ విధంగా చేయడం ద్వారా మొత్తం ఉమ్మడి ఏపీవ్యాప్తంగా పుష్కలంగా వన్యప్రాణులతో పాటు జీవవైవిధ్యంతో కూడిన మంచి వాతావరణం ఏర్పడుతుందని ఆశించారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. – ఎ.శంకరన్, ఓఎస్డీ, తెలంగాణ అటవీ శాఖ, వైల్డ్ లైఫ్ విభాగం -
బ్రిటీష్ రాజుతో పోరాడిన లెజెండ్‌పై సినిమా
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన న్యాయవాది సి. శంకరన్ నాయర్ జీవితం వెండితెరకు రానుంది. ‘ది ఆన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ శంకరన్ నాయర్’ బయోపిక్కు కరణ్ సింగ్ త్యాగీ దర్శకత్వం వహించనున్నారు. ‘‘జలియన్ వాలాబాగ్ మారణకాండ’ వెనకాల దాగి ఉన్న నిజాలను దాచాలనుకున్న ఓ బ్రిటిష్ రాజుకు వ్యతిరేకంగా కోర్టులో పోరాడిన లెజెండ్ శంకరన్ నాయర్ జీవితంతో సినిమా తీయడం గౌరవంగా భావిస్తున్నాను. శంకరన్ మనుమడు రఘు, అతని భార్య పుష్ప కలిసి రాసిన ‘ది కేస్ దట్ షూక్ ద ఎంపైర్’ బుక్ ఆధారంగా ఈ చిత్ర కథనం ఉంటుంది. నటీనటుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు దర్శక–నిర్మాత కరణ్ జోహార్. చదవండి: Narappa: వారం రోజుల్లో ఫస్ట్ కాపీ రెడీ -
2022లో అటవీ జంతువుల గణన చేస్తాం
సాక్షి, హైదరాబాద్: నల్గొండ జిల్లాలో గురువారం ఓ చిరుతకు మత్తు మందు ఇచ్చి పట్టుకున్నామని అటవిశాఖ ఓఎస్డీ శంకరన్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అటవీ జంతవులు జానావాసాలు, పంట పొలాల్లోకి వస్తున్నాయని తెలిపారు. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు అధికంగా ఉండటంతో తాగటానికి జంతువులకు నీరు లేక జనావాసాల్లోకి చేరుతున్నాయని చెప్పారు. అభయ అరణ్యాల్లో అటవీ శాఖ తరఫున నీటి వసతి ఏర్పాటు చేశామని తెలిపారు. చిరుతల సంఖ్య ఎంత అనేది ఇప్పడు కచ్చితంగా చెప్పలేమని పేర్కొన్నారు. అడవి జంతువులను ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి లెక్కిస్తారని చెప్పారు. 2018లో అడవి జంతవులలను లెక్కించామని మళ్లీ 2022లో జంతుల గణన చేస్తామని ఓఎస్డీ శంకరన్ తెలిపారు. -
దళితుల ఆత్మబంధువు శంకరన్
శంకరన్ దళితుల పేదరిక నిర్మూలనకు, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి విద్య ప్రధాన మార్గం అని భావించి విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. వసతిగృహాలు నిర్మించి వేల మంది విద్యార్థులకు విద్యావకాశాలను పెంచారు. గురుకుల పాఠశాలల నిర్మాణానికి పూనుకున్నారు. దళితుల హృదయాలలో ఎవ రికీ దక్కని అరుదైన గౌరవం ఎస్.ఆర్. శంకరన్‌కు దక్కింది. శంకరన్ దళితులను అక్కున చేర్చుకున్నారు. అలాగే దళితు లు కూడా శంకరన్‌ను తమ ఆత్మ బంధువుగా భావించా రు. అంటరానితనం, దళితుల నిరక్షరాస్యత, పేదరి కం, దుర్భర జీవితాలు ఆయన్ని బాగా కదిలిం చాయి. వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో తన జీవి తాంతం తపించారు. అందుకే ఎస్ఆర్ శంకరన్ చని పోతే తమ ఆప్తుడు మరణించినట్టు భావించి రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల నుంచి బీదాబిక్కీ జనం తం డోప తండాలుగా హైదరాబాద్‌కు తరలివచ్చారు. రెండు రోజులపాటు ఉండి ఆయన అంత్యక్రియ లలో పాల్గొనటం, నివాళి ఘటించడం ఆయన మీద వారికి ఉన్న ఎనలేని ప్రేమకి నిదర్శనం. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగినా, అవి నిజం గానే లాంఛనం. పేద జనం తమ చేతుల మీదుగా నే అంత్యక్రియలు నిర్వహించి తమ ప్రేమనీ, అభి మానాన్నీ చాటుకున్నారు. శంకరన్‌ను కేవలం ఒక అధికారిగా చూడలేం. ఆయన గొప్ప సంస్కర్త. హోదాను పక్కన పెట్టి ఈ దేశంలో అత్యంత దిగువ స్థాయిలో ఉన్న ప్రజలతో ఆయన కలసి నడిచారు. వారి సమస్యలను అర్థం చేసుకున్నారు. అందుకు తగిన రీతిలో స్పందిం చారు. 1967లో హరిజన్ గోష్టి జరిగింది. వివిధ సమస్యలపై చర్చ జరిగింది. అక్కడ తీసుకున్న నిర్ణ యాలు కాగితాలకే పరిమితం కాకుండా ఒకే రోజు 120కి పైగా జీవోలను విడుదల చేసి శంకరన్ దళిత వర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధి పట్ల తనకున్న నిబద్ధతను చాటుకున్నారు. ఉద్యోగంలో ఉండగా శంకరన్‌ను ప్రభుత్వం ఎంతో వేధించింది. ప్రభు త్వంలోని పెద్దలతో చాలా సందర్భాలలో విభేదాలు వచ్చాయి. అయినా ప్రజా సంక్షేమం పట్ల తనకు ఉన్న శ్రద్ధను ఆయన విడిచిపెట్టలేదు. వారికి సేవలు అందించడంలో ఎన్నడూ వెనకడుగు వేయలేదు. ఎస్ఆర్ శంకరన్ దళితుల పేదరిక నిర్మూలనకు, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి విద్య ప్రధాన మార్గం అని భావించి విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. వసతి గృహాలు నిర్మించి వేల మంది విద్యార్థులకు విద్యా వకాశాలను పెంచారు. గురుకుల పాఠశాలల నిర్మా ణానికి పూనుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, నక్సలైట్ల మధ్య శాంతి చర్చలకు పునాది వేసింది శంకరన్ గారే. రాష్ట్రంలో శాంతి నెలకొనాలని ఎంతో శ్రమిం చారు. రాష్ట్ర ప్రభుత్వం, నక్సలైట్లకు మధ్యవర్తిత్వం వహించి అసాధ్యం అనుకొన్న చర్చలను సుసాధ్యం చేయగలిగిన మేధావి. రాజ్యాంగం ఇచ్చిన బాధ్యత లను సక్రమంగా నిర్వర్తించటానికి ఎన్ని ఇబ్బందు లు ఎదురైనా చిరునవ్వుతో ఎదుర్కొన్న ధీశాలి. పాలనా వ్యవహారాలలో సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల రక్షణకు ఆయన పెద్ద పీట వేసే వారు. అధికారం పేదలకు సేవ చేయటానికే అని చెప్పిన నిజమైన పాలనాదక్షుడు. నీతిగా పనిచే యటం, పేదల పక్షం వహించటం కొద్దిమంది అధి కారులకే సాధ్యం. అటువంటి వారిలో చెప్పు కోదగ్గవారు ఎస్ఆర్ శంకరన్. ప్రస్తుతం ఇటువంటి నిజాయితీ, నిబద్ధత, ప్రజాసేవాతత్పరత కలిగిన అధికారులు అరుదుగానే కనిపిస్తారు. సఫాయి కర్మచారి ఆందోళన ద్వారా సఫాయి కార్మికుల జీవితాలను మార్చటానికి శక్తి మేరకు కృషి చేశారు. వెట్టి చాకిరి నిర్మూలనకు నడుం కట్టి ఎన్నో వేల మందిని విముక్తులను చేశారు. వెట్టి చాకిరి నిర్మూలనకు పూనుకున్నందుకు నాటి ముఖ్యమంత్రి ఒకరు ఆగ్రహించారు కూడా. కారంచేడు దళిత బాధి తులకు పునరావాసం కల్పించటంలో భాగంగా చీరా లలో విజయనగర్ కాలనీని దగ్గరుండి ఉపయు క్తంగా నిర్మించారు. వారిలో ఆత్మస్థయిర్యం నింపా రు. భూసంస్కరణల అమలుకు నిరంతరం శ్రమిం చిన సాహసి. త్రిపుర ప్రభుత్వం శంకరన్ నిజా యితీ, దీక్ష, కార్యదక్షతలను గుర్తించి ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా నియమించింది. ఆ సమయంలో ఒక సారి ఆర్మీ త్రిపురలో ప్రవేశించినందుకు, మా అను మతి లేకుండా ఎలా వస్తారని తిరిగి వెనక్కు పం పించిన మానవ హక్కుల రక్షకుడు. శంకరన్ జీవితం చాలా సాదాసీదా బ్రహ్మచారి జీవితం. ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభు త్వం పద్మవిభూషణ్ ఇచ్చినప్పుడు చాలా సున్ని తంగా తిరస్కరించిన గొప్ప వ్యక్తి. రిటైర్మెంట్ దగ్గర పడినప్పుడు మీకు ఇల్లు కూడా లేదు, ఎక్కడ ఉం టారు అని ఆయన మిత్రులు అడిగితే ‘నా దళిత సోదరులతో ఏదో ఒక దళితవాడలో ఉంటాను’ అని చెప్పిన గొప్ప మానవతావాది. చాలా ప్రాంతా లలో దళితులు సొంత ఖర్చులతో తమ నివాసాల మధ్య ఆయన విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆయన్ని ప్రభుత్వం మర్చిపోయినా, ప్రజలు స్మరిం చుకుంటూనే ఉన్నారు. ఇప్పటికైనా ఎస్ఆర్ శంకరన్ విగ్రహాలను సెక్రటేరియట్లలో ఏర్పాటు చేసి, ఆయన జీవితాన్ని సిలబస్‌లో చేర్చి నేటి తరాలకు విలువైన పాఠాలు అందించాల్సిన బాధ్యత రెండు రాష్ట్రాల ప్రభుత్వాలపైనా ఉంది. (వ్యాసకర్త సామాజిక కార్యకర్త) మద్దులూరి ఆంజనేయులు