దళితుల ఆత్మబంధువు శంకరన్
శంకరన్ దళితుల పేదరిక నిర్మూలనకు, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి విద్య ప్రధాన మార్గం అని భావించి విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. వసతిగృహాలు నిర్మించి వేల మంది విద్యార్థులకు విద్యావకాశాలను పెంచారు. గురుకుల పాఠశాలల నిర్మాణానికి పూనుకున్నారు.
దళితుల హృదయాలలో ఎవ రికీ దక్కని అరుదైన గౌరవం ఎస్.ఆర్. శంకరన్‌కు దక్కింది. శంకరన్ దళితులను అక్కున చేర్చుకున్నారు. అలాగే దళితు లు కూడా శంకరన్‌ను తమ ఆత్మ బంధువుగా భావించా రు. అంటరానితనం, దళితుల నిరక్షరాస్యత, పేదరి కం, దుర్భర జీవితాలు ఆయన్ని బాగా కదిలిం చాయి. వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో తన జీవి తాంతం తపించారు. అందుకే ఎస్‌ఆర్ శంకరన్ చని పోతే తమ ఆప్తుడు మరణించినట్టు భావించి రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల నుంచి బీదాబిక్కీ జనం తం డోప తండాలుగా హైదరాబాద్‌కు తరలివచ్చారు. రెండు రోజులపాటు ఉండి ఆయన అంత్యక్రియ లలో పాల్గొనటం, నివాళి ఘటించడం ఆయన మీద వారికి ఉన్న ఎనలేని ప్రేమకి నిదర్శనం. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగినా, అవి నిజం గానే లాంఛనం. పేద జనం తమ చేతుల మీదుగా నే అంత్యక్రియలు నిర్వహించి తమ ప్రేమనీ, అభి మానాన్నీ చాటుకున్నారు.
శంకరన్‌ను కేవలం ఒక అధికారిగా చూడలేం. ఆయన గొప్ప సంస్కర్త. హోదాను పక్కన పెట్టి ఈ దేశంలో అత్యంత దిగువ స్థాయిలో ఉన్న ప్రజలతో ఆయన కలసి నడిచారు. వారి సమస్యలను అర్థం చేసుకున్నారు. అందుకు తగిన రీతిలో స్పందిం చారు. 1967లో హరిజన్ గోష్టి జరిగింది. వివిధ సమస్యలపై చర్చ జరిగింది. అక్కడ తీసుకున్న నిర్ణ యాలు కాగితాలకే పరిమితం కాకుండా ఒకే రోజు 120కి పైగా జీవోలను విడుదల చేసి శంకరన్ దళిత వర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధి పట్ల తనకున్న నిబద్ధతను చాటుకున్నారు. ఉద్యోగంలో ఉండగా శంకరన్‌ను ప్రభుత్వం ఎంతో వేధించింది. ప్రభు త్వంలోని పెద్దలతో చాలా సందర్భాలలో విభేదాలు వచ్చాయి. అయినా ప్రజా సంక్షేమం పట్ల తనకు ఉన్న శ్రద్ధను ఆయన విడిచిపెట్టలేదు. వారికి సేవలు అందించడంలో ఎన్నడూ వెనకడుగు వేయలేదు. ఎస్‌ఆర్ శంకరన్ దళితుల పేదరిక నిర్మూలనకు, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి విద్య ప్రధాన మార్గం అని భావించి విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. వసతి గృహాలు నిర్మించి వేల మంది విద్యార్థులకు విద్యా వకాశాలను పెంచారు. గురుకుల పాఠశాలల నిర్మా ణానికి పూనుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, నక్సలైట్ల మధ్య శాంతి చర్చలకు పునాది వేసింది శంకరన్ గారే. రాష్ట్రంలో శాంతి నెలకొనాలని ఎంతో శ్రమిం చారు. రాష్ట్ర ప్రభుత్వం, నక్సలైట్లకు మధ్యవర్తిత్వం వహించి అసాధ్యం అనుకొన్న చర్చలను సుసాధ్యం చేయగలిగిన మేధావి. రాజ్యాంగం ఇచ్చిన బాధ్యత లను సక్రమంగా నిర్వర్తించటానికి ఎన్ని ఇబ్బందు లు ఎదురైనా చిరునవ్వుతో ఎదుర్కొన్న ధీశాలి.
పాలనా వ్యవహారాలలో సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల రక్షణకు ఆయన పెద్ద పీట వేసే వారు. అధికారం పేదలకు సేవ చేయటానికే అని చెప్పిన నిజమైన పాలనాదక్షుడు. నీతిగా పనిచే యటం, పేదల పక్షం వహించటం కొద్దిమంది అధి కారులకే సాధ్యం. అటువంటి వారిలో చెప్పు కోదగ్గవారు ఎస్‌ఆర్ శంకరన్. ప్రస్తుతం ఇటువంటి నిజాయితీ, నిబద్ధత, ప్రజాసేవాతత్పరత కలిగిన అధికారులు అరుదుగానే కనిపిస్తారు.
సఫాయి కర్మచారి ఆందోళన ద్వారా సఫాయి కార్మికుల జీవితాలను మార్చటానికి శక్తి మేరకు కృషి చేశారు. వెట్టి చాకిరి నిర్మూలనకు నడుం కట్టి ఎన్నో వేల మందిని విముక్తులను చేశారు. వెట్టి చాకిరి నిర్మూలనకు పూనుకున్నందుకు నాటి ముఖ్యమంత్రి ఒకరు ఆగ్రహించారు కూడా. కారంచేడు దళిత బాధి తులకు పునరావాసం కల్పించటంలో భాగంగా చీరా లలో విజయనగర్ కాలనీని దగ్గరుండి ఉపయు క్తంగా నిర్మించారు. వారిలో ఆత్మస్థయిర్యం నింపా రు. భూసంస్కరణల అమలుకు నిరంతరం శ్రమిం చిన సాహసి. త్రిపుర ప్రభుత్వం శంకరన్ నిజా యితీ, దీక్ష, కార్యదక్షతలను గుర్తించి ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా నియమించింది. ఆ సమయంలో ఒక సారి ఆర్మీ త్రిపురలో ప్రవేశించినందుకు, మా అను మతి లేకుండా ఎలా వస్తారని తిరిగి వెనక్కు పం పించిన మానవ హక్కుల రక్షకుడు.
శంకరన్ జీవితం చాలా సాదాసీదా బ్రహ్మచారి జీవితం. ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభు త్వం పద్మవిభూషణ్ ఇచ్చినప్పుడు చాలా సున్ని తంగా తిరస్కరించిన గొప్ప వ్యక్తి. రిటైర్మెంట్ దగ్గర పడినప్పుడు మీకు ఇల్లు కూడా లేదు, ఎక్కడ ఉం టారు అని ఆయన మిత్రులు అడిగితే ‘నా దళిత సోదరులతో ఏదో ఒక దళితవాడలో ఉంటాను’ అని చెప్పిన గొప్ప మానవతావాది. చాలా ప్రాంతా లలో దళితులు సొంత ఖర్చులతో తమ నివాసాల మధ్య ఆయన విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆయన్ని ప్రభుత్వం మర్చిపోయినా, ప్రజలు స్మరిం చుకుంటూనే ఉన్నారు. ఇప్పటికైనా ఎస్‌ఆర్ శంకరన్ విగ్రహాలను సెక్రటేరియట్‌లలో ఏర్పాటు చేసి, ఆయన జీవితాన్ని సిలబస్‌లో చేర్చి నేటి తరాలకు విలువైన పాఠాలు అందించాల్సిన బాధ్యత రెండు రాష్ట్రాల ప్రభుత్వాలపైనా ఉంది.
(వ్యాసకర్త సామాజిక కార్యకర్త) మద్దులూరి ఆంజనేయులు