జిల్లాలోనే అగ్రస్థానంలో నిలుపుతా..
సన్నూరు పర్యటనలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ
ఐదున్నర గంటలు ఆలస్యంగా పర్యటన
వరాల జల్లు కురిపించడంతో సన్నూరు గ్రామాస్తుల హర్షం
సన్నూరు(రాయపర్తి) : సన్నూరు గ్రామాన్ని అభివృద్ధిపరంగా జిల్లాలోనే అగ్రస్థానంలో నిలుపుతానని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ప్రకటించారు. రా యపర్తి మండలంలోని సన్నూరు గ్రామాన్ని ఆ యన బుధవారం పర్యటించారు. సంసద్ ఆద ర్శ యోజన కింద సన్నూరును దత్తాత్రేయ దత్త త తీసుకున్న విషయం విదితమే. ఈ మేరకు ఆయన గ్రామంలో పర్యటించారు. అయితే, ఉదయం 11గంటలకు మంత్రి వస్తారని ప్రకటించగా.. సాయంత్రం 4.30గంటలకు వచ్చా రు. దీంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి న ప్రజలు కొంత అసహనం వ్యక్తం చేసినా గ్రా మంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి ప్రకటించిన వరాలతో సంతోషం వెలిబుచ్చారు. గ్రామానికి వచ్చిన కేంద్ర మంత్రి దత్తాత్రేయ తొలుత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సం దర్శించి ప్రత్యేక పూజలు చేశాక.. గ్రామంలోని జెడ్పీఎస్ఎస్ ఆవరణలో ఏర్పాటుచేసిన సదస్సులో పాల్గొని మాట్లాడారు.
సమస్యల పరిష్కారం.. గ్రామాభివృద్ధి
సన్నూరు గ్రామంలోని ప్రతీ సమస్యను పరిష్కరించడమే కాకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని కేంద్ర మంత్రి దత్తాత్రేయ ప్రకటించారు. గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తిరుమల తరహాలో అభివృ ద్ధి చేయడంతో పాటు రహదారులు మరమ్మతు చేయిస్తానని తెలిపారు. గ్రామంలో వసతుల కల్పిస్తూనే నిరుద్యోగులకు ఉపాధి లభించేలా వృత్తి, విద్యాకోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే, పొగాకు సంబంధిత ఉత్పత్తులు, గుడుంబాతో పాటు అత్యాచారాలు జరగకుండా గ్రామస్తులే కమిటీలు వేసుకుని కృషి చేయాలని సూచించారు. ఎవరి గ్రామానికి వారే అభివృద్ధి నిర్మాతలని.. అవినీతి లేకుండా గ్రా మాన్ని అభివృద్ధి చేయడంతో పాటు బంగారు తెలంగాణ నిర్మాణానికి సహకరించాలని కోరా రు. సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులతో కలిసి అభివృద్ధికి చేస్తానని దత్తాత్రేయ ప్రకటించారు.
ఐదేళ్లుగా అభివృద్ధి లేదు..
నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. తెలంగాణ సాధన కోసం సాగిన ఉద్యమంలో పాల్గొనడంతో ఐదేళ్లు అభివృద్ధి జరగలేదని.. ఇప్పుడు కేంద్ర మంత్రి దత్తాత్రేయతో కలిసి అభివృద్ధి పనులు చేపడుతామని వెల్లడించారు. సన్నూరు గ్రామం గురించి మంత్రి దత్తాత్రేయ దృష్టికి తీసుకువెళ్లింది తానేనని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ గూబ యాకమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు యాకమ్మ, ఎంపీపీ గుగులోతు విజయ, జెడ్పీటీసీ వంగాల యాకమ్మతో పాటు బీజేపీ నాయకులు వన్నాల శ్రీరాములు, మార్తినేని ధర్మారావు, టి.రాజేశ్వర్‌రావు, చందుపట్ల జంగారెడ్డి, మందాడి సత్యనారాయణరెడ్డి, ఎడ్ల అశోక్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.