sanskrit school
-
ధోతి క్రికెట్.. సంస్కృతంలో కామెంట్రీ!
వారణాసి : ఈ తరం పిల్లలు ధోతులు కట్టుకోమంటే.. ధోతులా.. మేమా? అంటూ జారుకుంటారు. జీన్స్, టీషర్ట్స్కు ఇచ్చే ప్రాధాన్యతను మన ఆచారాలు, సంప్రదాయా దుస్తులకు ఏ మాత్రం ఇవ్వరు. కానీ మన ఆచారాలను, సంప్రదాయాలను పాటించే పాఠశాలు, పిల్లలు మన దేశంలో ఇంకా ఉన్నారు. వారు ధోతులు, కుర్తాలు ధరించడమే కాదు.. క్రికెట్‌ను కూడా వాటితోనే ఆడుతున్నారు. పైగా ఏలాంటి ఇబ్బంది లేకుండా మైదానంలో ఇరగదీస్తున్నారు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఈ మ్యాచ్‌లకు సంస్కృతంలోనే కామెంట్రీ చెప్పడం. ప్రస్తుతం ఈ క్రికెట్ టోర్నీ.. ఈ పాఠశాలలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. క్రికెట్ అంటే పడి చచ్చే మనదేశంలో ధోతులతో క్రికెట్.. సంస్కృతం కామెంట్రీ అనగానే జనాలు విపరీతమైన ఆసక్తి కనబరుస్తున్నారు. అయ్యో.. ఎక్కడా ఈ టోర్నీ అంటూ ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ టోర్నీ ‘సంస్కృతం క్రికెట్ లీగ్’గా ప్రాచూర్యం పొందింది. ఇంతకీ ఈ టోర్నీ సంగతేంటంటే.. వారణాసీలోని సంపూర్ణానంద సంస్కృత విద్యాలయాల 75వ వ్యవస్థాపక దినోత్వవం సందర్భంగా క్రికెట్ టోర్నీని నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీలో వారణాసీ వ్యాప్తంగా ఉన్న సంస్కృత పాఠశాలలు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీలో పాల్గొనే ఆయా పాఠశాల విద్యార్థులు ధోతి, కుర్తాతో పాటు మూడు నామాలు పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చేస్తున్నారు. అంపైర్లు కూడా కుర్తా, ధోతిలోనే ఆడిస్తున్నారు. ఈ టోర్నీకి సంస్కృతంలో కామెంట్రీ కూడా చెబుతున్నారు. ఈ ధోతి క్రికెట్‌ను చూసేందుకు చుట్టు పక్కల ప్రజలు ఎగబడుతున్నారు. విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు పాఠశాల టీచర్ గణేశ్ దత్ శాస్త్రి మీడియాకు తెలిపారు. ‘ఈ టోర్నీ 10 ఓవర్ల ఫార్మాట్. వారణాసిలో అన్నీ సంస్కృత పాఠశాలలు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. మొత్తం 5 జట్లు పోటీ పడుతున్నాయి. విద్యార్థులందరూ.. ధోతి,కుర్తాలను ధరిస్తారు. ఈ టోర్నీ మరో ప్రత్యేకత ఏంటంటే.. నారాయణ మిశ్రా, వికాస్ దీక్షిత్ అనే ఇద్దరు టీచర్లు సంస్కృతం కామెంట్రీ చెప్తారు. సంస్కృతం క్రికెట్ లీగ్‌గా ఈ టోర్నీ ప్రాచుర్యం పొందడం చాలా గర్వంగా ఉంది’ అని గణేశ్ దత్ సంతోషం వ్యక్తం చేశారు. -
బ్రాహ్మణేతర మహిళా పూజారులు!
సాక్షి, ముంబాయి: అవకాశాలను అందిపుచ్చుకుని మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. వివక్ష, అవమానాలను ఎదుర్కొని తాము ఎంచుకున్న రంగంలో నిలదొక్కుకుంటున్నారు. ఓ విశ్రాంత ఉపాధ్యాయుడి సాయంతో సంస్కృతం నేర్చుకుని వైదిక కర్మకాండలు నిర్వహిస్తూ అందరి మెప్పు పొందుతున్నారు మెహపెడా గ్రామానికి చెందిన బ్రాహ్మణేతర మహిళలు. విశ్రాంత ఉపాధ్యాయుడి కృషి ముంబైకి 60 కిలోమీటర్ల దూరంలో ఈ మెహపెడా గ్రామం ఉంది. అలియాబాగ్‌కు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు రామేశ్వర్ కార్వే(101) ఓ రోజు ఈ గ్రామానికి సమీపంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉపన్యాసం ఇచ్చాడు. అది విన్న మెహపడా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తమ గ్రామంలోని వారికి సంస్కృత పాఠాలు నేర్పాలని కోరాడు. అలా 18 ఏళ్ల క్రితం సంస్కృత శిక్షణ ప్రారంభమైంది. ఆ గ్రామంలోని బ్రహ్మణేతర కుటుంబాలకు చెందిన 150 మంది మహిళలు సంస్కృతం చదువుకుని పట్టాలు సాధించడం, అర్చకత్వ శిక్షణ పొందడం వెనుక రామేశ్వర్ కృషి, పట్టుదల ఎంతో ఉంది. ‘వీరసావర్కర్ జైలులో ఉన్నప్పుడు మా నాన్న వెళ్లి కలిసేవారు..సంస్కృతాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన మా నాన్నకు చెప్పేవారు... అలా మా నాన్నగారు రాయ్‌గఢ్ జిల్లాలో ఐదు విద్యాసంస్థలను ప్రారంభించారు. సంస్కృతాన్ని బ్రాహ్మణేతర ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది మా నాన్న ప్రధాన లక్ష్యంగా ఉండేద’ని కార్వే కుమార్తె వసంతి డియో చెప్పారు. అయితే మొదట్లో సంస్కృతం నేర్చుకునేందుకు ఆ గ్రామానికి చెందిన మహిళలు ఆసక్తి చూపలేదు. వారిని క్లాసులకు రప్పించడమే కార్వేకు పెద్ద సవాలు. ‘ హోం వర్క్ ఇవ్వడం వల్ల ఇంట్లో పనులకు ఇబ్బంది కలుగుతోంది..దీంతో చదువుకోవడానికి రావడం మానేస్తారని..హోం వర్క్ ఇచ్చేవారు కాదు...చిన్న పిల్లలను స్కూలుకు రప్పించేందుకు ఉపాధ్యాయులు ఎంత కష్టపడతారో తమ గురూజీ కూడా తమ పట్ల అంతే శ్రద్ధ తీసుకునేవారు’ అని మొదటి బ్యాచ్‌కు చెందిన సురేఖా పాటిల్ తెలిపారు. అన్ని రకాల పూజలు పూజాధిక కార్యక్రమాలను మహిళలు నిర్వహించడాన్ని మొదట చాలా మంది అంగీకరించలేదు. క్రమంగా వారికి ఆహ్వానాలు అందుతున్నాయి. ముంబై మహానగరంతో పాటు థానే, నవీ ముంబాయిలోనూ ఈ మహిళా పూజారులు వివిధ క్రతువులు నిర్వహిస్తున్నారు. పెళ్ళిళ్లు, దశదిన కర్మలు, ఒడుగు, సాధారణంగా పురుషులు మాత్రమే నిర్వహించే శని శాంతి పూజ వంటి వాటిని కూడా వీరు చేయడం గమనార్హం. ఈ మహిళంతా ఆరు నెలల కరస్పాండెన్స్ కోర్సు ‘సంస్కృత భారతి’ని పూర్తి చేశారు. వీరిలో ఎక్కువ మంది నూటికి 80 నుంచి 90 మార్కులు సాధించడం విశేషం. అయితే, ఇప్పటికీ కొన్ని చోట్ల పూజలకు వెళ్లినపుడు వారి వారి బంధువులు తమను తక్కువ చేసి మాట్లాడటం, మంత్రాలు సరిగా చదువుతారా? పూజలు సక్రమంగా చేస్తారా అంటూ వ్యంగ్యగా మాట్లాడుతుంటారు...వాటిని విని నవ్వుకుంటూ తమ పని తాము చేసుకు పోతామని దాల్వీ అనే మహిళా పూజారి పేర్కొన్నారు. ఓ చోట సత్యనారాయణస్వామి వ్రతం చేయడానికి వెళ్లాం..సాధారణంగా పూజ అనంతరం పూజారి కాళ్లకు నమస్కరించి ప్రసాదం తీసుకోవడం అనవాయితీ.. కానీ తాము పూజ చేసిన అనంతరం కాళ్లకు మొక్కకుండానే ప్రసాదాన్ని తీసుకుంటారని చెప్పుకొచ్చారు. -
పాఠశాలలో ఉరేసుకున్న విద్యార్థిని
పశ్చిమగోదావరి: జిల్లాలోని కొవ్వూరు సంస్కృత పాఠశాలలో సోమవారం ఘోరం చోటు చేసుకుంది. పాఠశాలలో చదువుకుంటున్న ఇంటర్ విద్యార్థిని ప్రసన్న ఆత్మహత్యకు పాల్పడింది. ప్రసన్న సొంతవూరు జీలుగుమల్లి మండలం పాములువారిగూడెం. కాగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
శ్రీమఠానికి వాస్తు దోషమా!
► ప్రాకారం పశ్చిమ భాగంలో ► దారి మూసివేత పీఠాధిపతి గది ఆగ్నేయ ► ద్వారానికి తాళాలు మంత్రాలయం: ప్రముఖ పుణ్యక్షేత్రం రాఘవేంద్రస్వామి శ్రీమఠంలో వాస్తు మార్పిళ్లకు మఠం అధికారులు తెరతీశారు. ఇటీవల శ్రీమఠంలో ఊహించని సంఘటనలు చోటు చేసుకోవడంతో వాస్తు దోషాలు సరిచేయడం మొదలెట్టారు. గతనెల మఠం దివాన్ బండాచార్పై సంస్కృత పాఠశాల పండితుడు చెయ్యి చేసుకున్నారు. స్వామిజీపై 10 రోజుల క్రితం కర్ణాటకలోని ఓ చానెల్లో ఇద్దరు వ్యక్తులు ఆరోపణలు చేయడం దుమారం రేగింది. అనుకోకుండా పీఠాధిపతులు ఆప్తకార్యదర్శి సుయమీంద్రాచార్ రాజీనామా, ఉపసంహరణ చోటు చేసుకుంది. శుక్రవారం శిలామండపం నిర్మాణం పనుల్లో భాస్కర్ అనే వ్యక్తిపై బండరాయి పడింది. వంట సరుకులు అనసరంగా స్టాక్ చేయడంతో కాలం చెల్లడం బయటకు పొక్కింది. ఇలా ఒకదాని తర్వాత ఒక సమస్య తలెత్తుండటంతో వాస్తు దోషాలే కారణమని భావిస్తున్నారు. దోషాల నుంచి గట్టెక్కేందుకు చర్యలు చేపట్టారు. మఠం పీఠాధిపతి సుభుధేంద్రతీర్థులు భవనం ఆనుకుని పశ్చిమ దిశ ప్రాకారం ద్వారాన్ని మూసేసి గోడ కట్టించారు. స్వామిజీ గది ఆగ్నేయ భాగంలోని తలుపులకు సైతం తాళాలు వేయించారు. ప్రస్తుతం గది ఈశాన్య భాగంలోని తలుపును మాత్రమే ప్రవేశానికి తెరిచి ఉంచారు. అదే గదిలోనే స్వామిజీ సేవా భక్తులకు ఆశీర్వాదాలు చేయడం జరుగుతోంది. ప్రస్తుతం ఒకే తలుపు తెరవడంతో కాస్త ఇబ్బందికరంగా మారింది. అంతకు ముందు మంచాలమ్మ, రాఘవేంద్రస్వామి గర్భాలయంలోనూ హోమాలు సైతం చేయించారు. ఏది ఏమైనా వాస్తు దోషాల సరిచేసుకోవడంతోనైనా సమస్యలు సమసి పోతాయో వేచిచూద్దాం. రీమఠం శిలా మండప నిర్మాణంలో అపశ్రుతి - రాతిబండ పడి కూలీకి గాయాలు రాఘవేంద్రస్వామి మఠం గర్భాలయ శిలామండప నిర్మాణంలో అపశ్రుతి చోటుచేసుకుంది. తమిళనాడులోని పుదుకోట జిల్లాకు చెందిన భాస్కర్ 10 రోజుల క్రితం శిలా మండప నిర్మాణ పనులకు ఇక్కడకు వచ్చారు. శుక్రవారం ఉదయం రాతిబండలు పేరుస్తుండగా ఒకటి ప్రమాదవశాత్తు అతడి కాలిపై పడింది. దీంతో కుడికాలు తొడ భాగంలో బలమైన గాయమైంది. అక్కడున్న భక్తులు వెంటనే కాలిపై పడిన రాతిబండను తొలగించారు. స్థానిక శ్రీమఠం ఆసుపత్రిలో ప్రథమ చికిత్స తర్వాత ఆదోని ఆస్పత్రికి తరలించారు.