శాంతారావుకు ఆరోగ్య వర్సిటీ బాధ్యతలు
హైదరాబాద్: రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) డాక్టర్ జి. శాంతారావుకు ప్రభుత్వం విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు వైద్య విద్య ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత వీసీ రవిరాజు ఈ నెల 9 నుంచి 26 వరకు విదేశీ పర్యటన నేపథ్యంలో ఆయన వచ్చే వరకూ ఈ బాధ్యతలను డీఎంఈకి అప్పగించినట్లు పేర్కొన్నారు.