santhosh nagar
-
సంతోష్ నగర్ సీఐపై MIM నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం
-
హైదరాబాద్ సంతోష్ నగర్ లో దారుణం
-
సంతోష్ నగర్ గ్యాంగ్ రేప్ కేసును ఛేదించిన పోలిసులు
-
తలను వేరు చేసి అతికిరాతకంగా..
సంతోష్‌నగర్: దుండగులు ఓ యువకుడిని అతికిరాతకంగా హత్య చేశారు. కంచన్‌బాగ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసుల ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం... బాలాపూర్ నీటి ట్యాంక్ సమీపంలో 25 ఏళ్ల గుర్తు తెలియని యువకుడ్ని దుండగులు సిమెంట్ ఇటుకలతో తలపై కొట్టి చంపేశారు. మృతుడిని ఎవ్వరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు తలను వేరు చేశారు. తీవ్ర దుర్వాసన వస్తుండటంతో శనివారం ఈ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండటం బట్టి 15 రోజుల క్రితమే హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కాలేజీకి వెళ్లి... తిరిగిరాని విద్యార్థిని
సంతోష్‌నగర్ (హైదరాబాద్) : కళాశాలకని వెళ్లిన ఓ యువతి కనిపించకుండాపోయిన సంఘటన కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై పి.ప్రమోద్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మీర్పేట్ అల్మాస్గూడ సీఎంఆర్ కాలనీ ప్రాంతానికి చెందిన బండారి పాండు కూతురు(20) చంపాపేట్‌లోని వేద డిగ్రీ కళాశాలలో చదువుకుంటోంది. ఈ నెల 9వ తేదీన సదరు యువతి కళాశాలకని ఇంట్లో నుంచి బయటికి వెళ్లింది. అనంతరం తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు కళాశాల విద్యార్థులను వాకబు చేయగా... ప్రతి రోజు కళాశాల వద్ద నరేష్ అనే ఆటో డ్రైవర్ ఆమెను కలిసేవాడని తెలిసింది. దీనిపై తండ్రి పాండు తన కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆచూకీ తెలిసిన వారు 040-27854764, 9490616537 నంబర్లలో సమాచారం అందించాలన్నారు. -
యజమాని కళ్లుగప్పి బంగారం చోరీ
హైదరాబాద్: నగంరలోని సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చంద్రా జ్యువెల్లరీ దుకాణంలో శుక్రవారం చోరీ జరిగింది. ఓ వ్యక్తి నగల షాపు యజమాని దృష్టి మరల్చి బంగారు గొలుసును తస్కరించాడు. చోరీ చేసిన బంగారు గొలుసు స్థానంలో బంగారుపూత పూసిన మరో చైన్‌ను అక్కడ ఉంచాడు. అనంతరం అక్కడి నుంచి పలాయనం చిత్తగించాడు. సదరు వ్యక్తి వెళ్లిపోయిన తర్వాత నగల దుకాణం యజమాని విషయం తెలుసుకుని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా చోరీకి పాల్పడిన వ్యక్తి గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.