నక్సల్స్ ఘాతుకం.. ఏడుగురి మృతి
జార్ఖండ్లో నక్సలైట్లు రెచ్చిపోయారు. శాంతిసేన కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని భారీ ఎత్తున కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ఏడుగురు కార్యకర్తలు అక్కడికక్కడే మరణించారు.
శాంతిసేన అనే పేరుతో జార్ఖండ్లో కొంతమంది గ్రూపుగా ఏర్పడ్డారని, అయితే వాళ్లు ప్రజలను వేధిస్తున్నారని ఇటీవలి కాలంలో కథనాలు వచ్చాయి. ఈ వేధింపుల కారణంగా గ్రామస్థులకు.. శాంతిసేన కార్యకర్తలకు మధ్య కూడా ఘర్షణాత్మక వైఖరి నెలకొంది. తాజాగా నక్సలైట్లు ఈ శాంతిసేన దళంపై కాల్పులు జరపడంతో ఏడుగురు మరణించారు.