Santosh Narayan
-
'అందంగా లేని హీరోయిన్ను తీసుకున్నారు'.. దర్శకుడి సమాధానమిదే!
రాఘవ లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'జిగర్తాండ డబుల్ ఎక్స్'. నవంబర్ 10న విడుదలైన ఈ మూవీ పది రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సినిమా సూపర్ సక్సెస్ కావడంతో చిత్రయూనిట్ సంబరాలు చేసుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా విజయోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓ రిపోర్టర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన నిమిషా సజయన్ అంత అందంగా ఏమీ లేదని వ్యాఖ్యానించాడు. తను బాగోలేకపోయినా సరే తనను సినిమాలోకి తీసుకుని ఆమె నుంచి నటన ఎలా రాబట్టుకున్నారని ప్రశ్నించాడు. అలా అనడం చాలా తప్పు ఈ ప్రశ్నకు ఖంగు తిన్న దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఘాటుగానే స్పందించాడు. 'ఆమె అందంగా లేదని నువ్వెలా చెప్పగలవు? నీకెందుకలా అనిపించింది? ఒకరు అందంగా లేరని అనేయడం, అలా డిసైడ్ చేసేయడం.. చాలా తప్పు' అని కౌంటరిచ్చాడు. దర్శకుడి సమాధానం విని చిత్రయూనిట్ అంతా చప్పట్లు కొట్టింది. ఇక ఈ సినిమాతో పాటు సక్సెస్ మీట్లోనూ భాగమైన మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. ఏమీ మారలేదు 'నేను అక్కడే ఉన్నాను. అందం గురించి అతడు పిచ్చి ప్రశ్న అడిగి వదిలేయలేదు. ఏదైనా వివాదాస్పదం అయ్యే ప్రశ్నలు అడగాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అలాంటి ప్రశ్నలు అడిగేశాక తనకు తాను గర్వంగా ఫీలయ్యాడు. 9 ఏళ్ల క్రితం జిగర్తాండ మొదటి భాగం వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఏమీ మారలేదు' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు ఈ హీరోయిన్‌కు ఏం తక్కువ? అంత బాగా అభినయం చేస్తోంటే ఇలా అవమానించేలా ఎలా మాట్లాడుతారో అని కామెంట్లు చేస్తున్నారు. నటనలో ఘనాపాటి కాగా ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన నిమిషా సజయన్ ఈ విజయోత్సవ సభకు హాజరు కాలేదు. ఈమె ఇటీవల వచ్చిన సిద్దార్థ్ చిత్త(చిన్నా) మూవీలోనూ నటతో మెప్పించింది. ఈమె మలయాళ నటి. 2017లో కేరాఫ్ సైరా భాను సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ద గ్రేట్ ఇండియన్ కిచెన్, నాయట్టు, తొండిముతలుమ్ దృక్షాక్షియుమ్.. తదితర హిట్ చిత్రాల్లో నటించింది. జిగర్తాండ డబుల్ ఎక్స్ మూవీలో రాఘవ లారెన్స్ భార్యగా, గిరిజన యువతి మలైయారసి పాత్రలో కనిపించింది. I was there. It was not just about the ridiculous ‘beauty’ question for the reporter. There was a conscious effort from the guy to ask something controversial and he was so proud after asking this. Nothing has changed since the appalling ‘Jigarthanda’ - ‘Figuredhanda’ question 9… https://t.co/ZaVh5lEkK9 — Santhosh Narayanan (@Music_Santhosh) November 18, 2023 చదవండి: అందుకే 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' మూవీ వదులుకున్నా.. భూమికతో గొడవలు.. -
సెన్సార్‌ను దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకోను
తాను సెన్సార్‌ను దృష్టిలో పెట్టుకుని కథలను తయారు చేసుకోనని అన్నారు నటుడు, దర్శకుడు ఆర్.పార్తీపన్. జయాపజయాలను పక్కన పెడితే పార్తీపన్ చిత్రాలకంటూ ప్రేక్షకులు ప్రత్యేకంగా ఉంటారు. ఈయన చిత్రాలు ప్రయోగాత్మకంగానూ, ప్రయోజనాత్మకంగానూ ఉంటాయని చెప్పవచ్చు. అలా చిన్న గ్యాప్ తరువాత పార్తీపన్ చేసిన మరో ప్రయోగం ఒత్త చెరుప్పు సైజ్ 7. సినిమా పేరే వైవిధ్యంగా ఉంది కదూ. కథా, కథనాలు కొత్తగా ఉంటాయి. ఎందుకంటే ఈ చిత్రం అంతా ఒక్క పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అవును ఆ పాత్రని పోషించింది పార్తీపనే. ఒకే పాత్రతో ఇంతకుముందు కొన్ని చిత్రాలు వచ్చినా, పార్తీపన్ స్వీయ దర్శకత్వంలో నటించిన ఈ ఒత్త చెరుప్పు సైజ్ 7 వాటికి పూర్తిగా భిన్నంగా ఉంటుందంటున్నారీయన. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని, రసూల్ పోకుట్టి సౌండ్ ఎఫెక్ట్స్ అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకోవంతో పాటు సెన్సార్‌ను జరుపుకుంది. చిత్రానికి సెన్సార్‌బోర్డు యూ సర్టిఫికెట్‌ను ఇచ్చింది. ఈ సందర్భంగా ఈ చిత్ర సృష్టికర్త పార్తీపన్ మాట్లాడుతూ తాను సెన్సార్‌ను దృష్టిలో పెట్టుకుని కథలను రాసుకోనని అన్నారు. అలా చేస్తే కథ బలాన్ని కోల్పోతుందన్నది తన అభిప్రాయం అన్నారు. ఒత్త చెరుప్పు సైజ్ 7 చిత్రానికి యూ సర్టిఫికెట్ ఇవ్వడం సంతోషం అన్నారు. అయితే తన దృష్టిలో చిత్రానికి రెండు సెన్సార్ సర్టిఫికెట్లు ఉంటాయని అన్నారు. అందులో ఒకటి సెన్సార్ సభ్యులిచ్చిన సర్టిఫికేట్ అయితే రెండోది ప్రేక్షకులు ఇచ్చే సర్టిఫికెట్ అని అన్నారు. ఆ రెండో సిర్టిఫికేట్ కోసమే తానిప్పుడు ఎదురు చూస్తున్నానని అన్నారు. ఇది ఒక్క పాత్రతో రూపొందిన చిత్రం అయినా, హీరోలు మాత్రం చాలా మంది ఉన్నారని అన్నారు.ఈ చిత్రానికి పనిచేసిన సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్, సౌండ్ ఇంజినీర్ రసూల్ పోకుట్టి ఇలా చాలా మంది హీరోలేనని పార్తీపన్ పేర్కొన్నారు. త్వరలోనే ఈ చిత్ర విడుదల తేదీని వెల్లడిస్తానని పార్తీపన్ చెప్పారు. -
మరో టాలెంట్ చూపిస్తారట
ఇప్పటికే నటుడిగా, గాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ధనుష్ తన మల్టీ టాలెంట్‌ను ప్రేక్షకులందరికీ చూపించారు. లేటెస్ట్గా తనలోని సంగీత దర్శకుడిని కూడా మనకు పరిచయం చేయడానికి రెడీ అయ్యారు. తన లేటెస్ట్ మూవీ ‘వడ చెన్నై’ ద్వారా ఈ కొత్త టాలెంట్‌ను పరిచయం చేయనున్నారు. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ తెలియజేశారు. ధనుష్ పాడిన చాలా పాటలు సూపర్ హిట్ అయ్యాయి. మరి సంగీత దర్శకుడిగా ఎన్ని మార్కులు వేయించుకుంటారో చూడాలి. ఇదిలా ఉంటే.. మరోవైపు పలు వాయిదాలు పడుతూ ఆగిపోతూ వస్తున్న ‘ఎన్నై నోక్కి పాయుమ్ తోట్టా’ సినిమా దసరా రేస్‌కు రెడీ అయింది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ధనుష్, మేఘా ఆకాశ్ నటించిన ఈ చిత్రం, ‘వడ చెన్నై’ఒకే నెలలో విడుదల కానున్నాయి. సో.. అక్టోబర్ నెలలోనే ధనుష్ రెండుసార్లు థియేటర్స్‌లో సందడి చేస్తారన్నమాట. -
‘కబాలి’ మ్యూజిక్ డైరెక్టర్‌పై జాతి వివక్షత?
సాక్షి, సినిమా : కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ జాతి వివక్షతకు గురైనట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్లో తెలియజేశారు. సిడ్నీ ఎయిర్‌పోర్టులో ఆయనతో ఓ అధికారి దురుసుగా ప్రవర్తించినట్లు ట్వీట్ చేశారు. అయితే ఎయిర్‌పోర్టు శాఖ మాత్రం ఆయన చేసిన ఆరోపణలను ఖండించింది. రెండు రోజల క్రితం ఆయన చేసిన ట్వీట్ ప్రకారం... సిడ్నీ వెళ్లిన ఆయనను ఎయిర్‌పోర్టులో భద్రతా సిబ్బంది అడ్డగించారు. నిషేధిత రసాయనాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ఆయన్ని అడ్డగించి.. పక్కన ఓ వరుసలో నిలబెట్టారు. అలా 8 సార్లు ఆయన్ని క్యూలు మార్చి మరి తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ఓ అధికారి ఆయనతో దురుసుగా కూడా వ్యవహరించినట్లు ఆయన చెప్పారు. ఇది దారుణం.. జాతి వివక్షతకు అడ్డుకట్టపడాల్సిన అవసరం ఉంది అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఎయిర్‌పోర్టు శాఖ మాత్రం తనిఖీల్లో భాగంగానే తమ అధికారులు అలా చేసుంటారని వరుస ట్వీట్లలో వివరణ ఇచ్చుకుంది. దానికి సంతృప్తి చెందని సంతోష్ నారాయణన్... భద్రత కోసమైతే వందసార్లు తాను వరుసలో నిల్చోటానికి సిద్ధమని, కానీ, కొందరు అధికారులు ఆ వంకతో వ్యక్తిగతంగా జాతి వివక్షత చూపించటం దారుణమని ఆయన ఆరోపించారు. డైరెక్టర్ పా రంజిత్ అటకత్తి చిత్రంతో ఆరంగ్రేటం చేసిన సంతోష్.. గురు, మద్రాస్ తదితర చిత్రాలకు మ్యూజిక్ అందించినప్పటికీ... కబాలితో బాగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం రజనీకాంత్ కాలా చిత్రానికి కూడా ఆయనే సంగీతం అందిస్తుండటం విశేషం. I was “randomly” picked up for the 8th time in a row at the Sydney airport for a chemical substance test and a rude officer insulted my intelligence. Racial profiling needs to stop. @SydneyAirport — Santhosh Narayanan (@Music_Santhosh) November 16, 2017 -
రెండు కోణాలున్న పాత్ర ఇది : సిద్ధార్థ్
‘‘ఇప్పటివరకు నేను పాతిక చిత్రాలు చేస్తే, వాటిలో పన్నెండు తెలుగు సినిమాలున్నాయి. ఆ విధంగా తెలుగు పరిశ్రమతో నాది విడదీయరాని అనుబంధం. వచ్చే ఏడాది తెలుగులో రెండు చిత్రాలు చేయనున్నా. ‘నాలో ఒక్కడు’ సినిమా ఒక వినూత్న ప్రయత్నం. ఇందులో రెండు కోణాలున్న పాత్రలో కనిపిస్తా’’ అని హీరో సిద్ధార్థ్ అన్నారు. ప్రసాద్ రామర్ దర్శకత్వంలో ఆయన నటించిన తమిళ చిత్రం ‘ఎనక్కుళ్ ఒరువన్’ తెలుగులో ‘నాలో ఒక్కడు’ పేరిట అనువాదమైంది. కోనేరు కల్పన సారథ్యంలో ఈ చిత్రాన్ని ప్రకృతి విడుదల చేస్తున్నారు. సంతోష్ నారాయణ్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని నాని ఆవిష్కరించి, సందీప్‌కిషన్‌కి ఇచ్చారు. ప్రచార చిత్రాన్ని సి. కల్యాణ్ విడుదల చేశారు.