సపక్‌తక్రా జిల్లా జూనియర్ జట్ల ఎంపిక
అమలాపురం : రాష్ట్రస్థాయి 20వ జూనియర్ బాలబాలికల సపక్ తక్రా చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్ల ఎంపికలు అమలాపురం జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో బుధవారం జరిగాయి. ఈనెల 18, 19 తేదీల్లో వైఎస్సార్ జిల్లా కడప స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో జరిగే పోటీల్లో ఎంపికైన జట్లు తలపడతాయని ఆ క్రీడ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు రంబాల చిట్టిబాబు తెలిపారు. జిల్లా అసోసియేషన్ కార్యదర్శి మునగాల మన్యం జట్ల వివరాలను వెల్లడించారు. బాలుర విభాగంలో కేతా సతీష్ (కెప్టెన్), పాటి సన్ని, టి.యశ్వంత్, కె.ప్రసాద్, బాలికల విభాగంలో ఆచంట కావ్య, విన్న గాయత్రి, వాకపల్లి పూజిత, వాకపల్లి దీపిక, వి.రమ్యశ్రీ ఎంపికయ్యారు. జట్లకు మేనేజర్‌గా స్థానిక తులిప్స్ స్కూలు పీఈటీ ప్రసాద్, కోచ్‌లుగా సపక్ తక్రా జాతీయ క్రీడాకారులు సందీప్, గౌతమ్ వ్యవహరిస్తారు. జిల్లా జట్లను అమలాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్ దొమ్మేటి రాము, ఈదరపల్లి సర్పంచి నక్కా సంపత్‌కుమార్ అభినందించారు.