శరణ్య గెలుపు ఆలిండియా ర్యాంకింగ్ టెన్నిస్
జింఖానా, న్యూస్‌లైన్: ఆలిండియా ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శరణ్య నాగ్‌పాల్ మెయిన్ డ్రా మొదటి రౌండ్లో విజయం సాధించింది. సికింద్రాబాద్ క్లబ్ నిర్వహిస్తున్న ఈ పోటీల్లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో శర ణ్య నాగ్‌పాల్ 6-3, 6-1తో ఢిల్లీకి చెందిన మేఘా శరావత్‌పై నెగ్గింది.
నయనిక 7-6 (7-4), 7-5తో అమోల్ వారిక్ (కర్ణాటక)పై, ఎస్. పడమట 6-3, 7-5తో ఆర్యాలిపై గెలిచారు. మరో వైపు అనుష్కా భార్గవ 6-3, 2-6, 2-6తో దాంగ్వాల్ (ఢిల్లీ) చేతిలో, శ్వేత 3-6, 0-6తో నికు అమిన్ (గుజరాత్) చేతిలో ఓడారు. పురుషుల విభాగంలో సాయి తేజస్ 6-3, 6-3తో తేజిస్విపై నెగ్గి రెండో రౌండ్‌కు అర్హత సాధించాడు. రోహిత్ సార్వతే 6-4, 7-6తో సాగర్ (మహారాష్ట్ర)పై, శరణ్ రెడ్డి 6-3, 7-5తో సాగర్ (కర్ణాటక) నెగ్గారు.