భారత్‌కు రానున్న అఫ్గాన్ మహిళ
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్ మహిళ షర్బత్గులా(40) త్వరలో భారత్‌కు చికిత్స కోసం రానున్నారు. ఆకుపచ్చ రంగు కళ్లతో కోపంగా చూస్తున్న ఆమె చిత్రాన్ని 1984లో నేషనల్ జియోగ్రఫిక్ మ్యాగ్జైన్ కవర్‌పేజీగా ప్రచురించింది. ఈ చిత్రంతో ఆమెకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఆమె భారత్‌కు వస్తున్న విషయాన్ని అఫ్గాన్‌లో భారత రాయబారి షౌదా అబ్దాలీ ఆదివారం తెలిపారు.
హెపటైటిస్-సితో బాధపడుతున్న ఆమెకు బెంగుళూరు ఆస్పత్రిలో ఉచితంగా చికిత్స అందించనున్నట్లు పేర్కొన్నారు. పాకిస్తాన్‌కు వలసవెళ్లిన గులాను ఇటీవల ఆ దేశ పోలీసులు అరెస్ట్ చేసి అఫ్గాన్‌కు పంపడం తెలిసిందే. ఈమెకు ముగ్గురు పిల్లలు.