ఐక్యత కోసం..
పటేల్ సేవలు మరువలేనివి
బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజేశ్వర్‌రావు
బీజేపీ ఆధ్వర్యంలో ఐక్యతా ర్యాలీ
హన్మకొండ : దేశ ఐక్యత కోసం ఉక్కుమనిషి సర్దార్ వల్లబాబాయి పటేల్ ఎనలేని కృషి చేశారని బీజేపీ క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు అన్నారు. వల్లబాబాయి పటే ల్ జయంతిని కేంద్ర ప్రభుత్వం జాతీయ ఐక్య తా దినంగా ప్రకటించింది. దీంతోపాటు దేశవ్యాప్తంగా ఐక్యతా ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం హన్మకొండ సుబేదారి లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఐక్యతా ర్యా లీ నిర్వహించారు.
ఈ ర్యాలీని డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రావు పద్మ ప్రా రంభించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ర్యాలీని ఉద్దేశించి రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ.. నిజాం పాలన నుంచి హైదరాబాద్ సంస్థానాన్ని(తెలంగాణ ప్రాంతాన్ని) విడిపించి సమైఖ్య దేశం లో విలీనం చేయడంలో పటేల్ పాత్ర కీలకం అన్నారు. లేకపోతే తెలంగాణ మరో కాశ్మీరులా ఉండేదని పేర్కొన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ఐక్యతకు కృషి చేస్తుందన్నారు.
మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రం కో సం పోరాడిన బీఆర్ అంబేద్కర్, నేతాజీ సుభా ష్ చంద్రబోస్. సర్దార్ వల్లబాబాయి పటేల్‌కు రావాల్సిన గుర్తింపు రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ.. పటేల్‌ను ఆదర్శంగా తీసుకొని యువత, విద్యార్థులు మందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ ర్యాలీలో బీజేపీ నగర శాఖ అధ్యక్షుడు చింతాకుల సునీల్, మాజీ ఎమ్మెల్యే ఒంటేరు జయపాల్, నాయకులు చాడా శ్రీనివాస్‌రెడ్డి, రావుల కిషన్, రావు అమరేందర్‌రెడ్డి, డా క్టర్ టి.విజయలక్ష్మి, డాక్టర్ రామగళ్ళ పరమేశ్వ ర్, గాదె రాంబాబు, మల్లాడి తిరుపతిరెడ్డి, దిలీ ప్నాయక్, కుమారస్వామి, శ్రీరాముల మురళీమనోహర్, గుజ్జ సత్యనారాయణరావు, సి.హెచ్.రాజిరెడ్డి, శేషగిరిరావు, రఘునారెడ్డి, త్రిలోకేశ్వర్‌రావు, మార్టీన్ లూథర్, జన్నె మొగిళి, పుప్పాల రాజేందర్, బన్న ప్రభాకర్, జలగం రంజిత్, బండి సాంబయ్య, వీసం రమణారెడ్డి, నక్క రాంనర్సయ్య, రాజెందర్ పాల్గొన్నారు.