సర్వాయి జయంతిని ప్రభుత్వమే నిర్వహించాలి
-మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు
సుందరయ్య విజ్ఞాన కేంద్రం(హైదరాబాద్‌సిటీ)
సర్వాయి సర్ధార్ పాపన్న జయంతి ఉత్సవాలను ప్రభుత్వమే నిర్వహించాలని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం, తెలంగాణ సాంసృ్కతిక కేంద్రం, చేతి వృత్తిదారుల సమన్వయ కమిటి, బీసీ సబ్ ప్లాన్ సంయుక్త ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. పాపన్న చరిత్రను నేటి తరానికి అందించటంతో పాటు, ఆయన విగ్రహాలను గోల్కొండ కోట, ట్యాంక్ బండ్, ఇతర అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.గీతా కార్మికుల అభివృద్దికోసం నూతన కల్లు విధానాన్ని అమలు చేయాలని, గీత ఫెడరేషన్‌ను ఏర్పాటు చేసి రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని, తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షులు మాటూరి బాలరాజ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ఎం.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.