sarees manufacturing
-
జాంధానీ జరీ..మెరిసింది మళ్లీ
ఉప్పాడ చేనేత కళాకారుల అద్భుతసృష్టి జాంధానీ.. ఏళ్లు గడిచినా తరగని విలువ దీని ప్రత్యేకత. ఎటు నుంచి చూసినా కళాత్మకత ఉట్టిపడే ఈ చీరలకు ఇప్పుడు అరుదైన గౌరవం దక్కింది. జాంధానీ డిజైన్లతో కేంద్ర ప్రభుత్వం పోస్టల్ కవరు విడుదల చేయనుండడంతో ఈ చీర సోయగాల గొప్పతనం మరోసారి మార్మోగుతుంది. ఇప్పటికే పేటెంట్ హక్కుతో పాటు ఇండియన్ హ్యాండ్లూమ్స్లో ఉప్పాడ జాంధానీకి స్థానం లభించగా.. తాజాగా దక్కిన గౌరవంతో తమ బతుకుల్లో వెలుగులు వస్తాయని చేనేత కళాకారులు ఆశిస్తున్నారు. వీటి తయారీలో ఉపయోగించే నాణ్యమైన వెండి జరీ, అత్యంత నేర్పుతో ఒక్కొక్క పోగు చేతితో పేర్చే నేతన్న పనితనంతో ప్రపంచపటంలో జాంధానీకి అరుదైన స్థానం లభించింది. పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలంలోని కొన్ని గ్రామాల్లో తరతరాలుగా ఈ జాంధానీ చీరల తయారీని కుటీర పరిశ్రమగా నిర్వహిస్తున్నారు. ఇవి అంత అందంగా కనిపించడానికి పూర్తిగా చేతితో నేయడమే కారణమని చెబుతారు. పాడై చిరిగిపోయినా.. కొన్న డబ్బులో సుమారు 30 శాతం వరకు తిరిగి వచ్చేస్తుంది. వెండి జరీలో సన్నని పట్టు, ఎర్రటి దారం ఉంటుంది. ఇది తొందరగా కాలదు, బూడిద కాదు. గీటురాయితో వెండి జరీ నాణ్యతను çపరీక్షించుకోవచ్చు. జరీని ఎన్ని పోగులు ఉపయోగిస్తే చీరకు అంత విలువ పెరుగుతుంది. నేతలో ఎక్కడా వదులు లేకుండా కార్మికులు చాలా జాగ్రత్తలు తీసుకోవడంతో ఎక్కడా లోపాన్ని పట్టుకోలేం.ఒక చీరపై ముగ్గురు నుంచి నలుగురు కార్మికులు పనిచేస్తారు. డిజైన్‌ను బట్టి పూర్తికావడానికి 20 నుంచి 40 రోజుల సమయం పడుతుంది. గతంలో రోజుకు ఒకట్రెండు చీరల కంటే ఎక్కువ తయారయ్యేవి కావు. ప్రస్తుతం 50 నుంచి 100 చీరలు తయారుచేస్తున్నారు. ముందు పేపరుపై డిజైన్ గీసుకుని నేత ప్రారంభిస్తారు. జరీని బట్టి చీర ధర నిర్ణయం చీరలో వాడే జరీని బట్టి విలువ నిర్ధారిస్తారు. చీరలో 240 గ్రాములు జరీ వాడితే దాని విలువ రూ 5 వేల వరకూ ఉంటుంది. డిజైన్ల కనుగుణంగా 500 గ్రాముల వరకూ జరీ వినియోగిస్తారు. చిలుక, హంస, నెమలి వంటి అనేక రకాల డిజైన్లు నేతన్నల కళాత్మకతను కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. కొత్తపల్లి మండలంలోనే కొత్తపల్లి, కుతుకుడుమల్లి, వాకతిప్ప, అమీనాబాద్, ఉప్పాడ, మూలపేట తదితర గ్రామాల్లో గతంలో 50 వరకు ఉండే మగ్గాలు నేడు 500కు చేరాయి. గొల్లప్రోలు మండలం తాటిపర్తి తదితర గ్రామాల్లోను వీటి తయారీ ఉంది. అన్ని కులాల వారు చీరలు నేయడం విశేషం. పోస్టల్ కవర్లపై ముద్రించేందుకు డిజైన్ల ఎంపిక రూ.వెయ్యి నుంచి రూ.లక్ష వరకు ఖరీదు చేసే చీరల్ని ఇక్కడి నేతన్నలు తయారుచేస్తున్నారు. ఇతర రాష్ట్రాలతోపాటు విదేశాల నుంచి ఆర్డర్లు వస్తుంటాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఆన్లైన్ షాషింగ్ సైట్లతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో ఇటీవల కాలంలో వ్యాపారం ఊపందుకుంది. జాంధాని పేటెంట్ హక్కు సాధించుకున్నాక అమ్మకాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ ఎగ్జిబిషన్లో స్థానం సంపాదించి విదేశీ ఆర్డర్లు కూడా పొందింది. ఇప్పుడు వీటిపై పోస్టల్ కవర్లు విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఉప్పాడ చేనేత కళాకారులకు వర్తమానం పంపింది. కవర్లపై ప్రింట్ చేసేందుకు చీరల డిజైన్లను పంపమని సూచించడంతో.. ఎంపిక చేసిన కొన్ని డిజైన్లకు ఢిల్లీకి పంపారు. నేతన్న శ్రమకు దక్కని విలువ మార్కెట్లో ఈ చీరలకు మంచి ధర పలుకుతున్నా.. నేత కార్మికుడికి దక్కే మజూరీ అంతంతమాత్రమే. కొన్ని చేనేత సహకార సంఘాలు మాస్టర్ వీవర్సుతో కుమ్మౖMð్క నేత కార్మికులను నట్టేట ముంచుతున్నాయి. తక్కువ మజూరీలు ఇస్తూ వారి శ్రమను దోచుకుంటున్నాయి. సహకార సంఘాల ద్వారా నేత కార్మికులతో చీరలు నేయించాల్సి ఉండగా ఎక్కడా అమలుకావడం లేదు. ముడిసరుకుల ధరలు చుక్కలనంటడం, చేసిన అప్పులు పెరిగిపోవడంతో నేతన్న ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. గత ఐదేళ్లలో చంద్రబాబు సర్కారు తమకిచ్చిన హామీల్ని నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కేవలం ఉప్పాడ పరిసర ప్రాంతాల చేనేత కార్మికులకు మాత్రమే సొంతమైన పేటెంట్ హక్కును కొందరు దళారులు పక్కదారి పట్టిస్తున్నారు. ఈ రకం చీరలను ఇతర ప్రాంతాల్లో నేయించడంతో ఇక్కడి చీరలకు గిరాకీ తగ్గుతోంది. పేటెంట్ హక్కును కాపాడాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని కార్మికులు వాపోతున్నారు. నేతన్న నేరుగా విక్రయించేలా చూడాలి అగ్గిపెట్టెలో పట్టే ఆరు గజాల చీర నేసిన ఘనత మా కార్మికులకుది. తాజాగా కేంద్ర ప్రభుత్వం పోస్టల్ కవరు విడుదల చేయడంతో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. మా కళాకారుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడంతో వీటికి డిమాండ్ పెరుగుతుంది. నేరుగా కార్మికులే ఆన్లైన్లో విక్రయాలు జరుపుకునేలా చర్యలు తీసుకోవాలి. – ఆర్.నాగేశ్వరరావు, ఏపీ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ సభ్యుడు, మూలపేట -
సిరిసిల్లకు సంక్రాంతి శోభ
సిరిసిల్ల: సిరిసిల్ల వస్త్రపరిశ్రమకు పక్కరాష్ట్రాల నుంచి వస్త్రోత్పత్తి ఆర్డర్లు వస్తున్నాయి. తమిళనాడులో పొం గల్ (సంక్రాంతి) కోసం ఇక్కడ చీరలు తయారవుతు న్నాయి. తమిళనాడు ప్రభుత్వం అక్కడి పేదలకు పం డగ కానుకగా చీరలు, పంచెలు పంపిణీ చేస్తోంది. ఆ ఆర్డర్లు సిరిసిల్ల నేతన్నలకు లభించాయి. దీంతో ఇక్కడి వస్త్రపరిశ్రమలో తమిళనాడు చీరల ఉత్పత్తి జోరుగా సాగుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 6 నెలల క్రితం బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వగా 95 లక్షల చీరలకు అవసరమైన 6 కోట్ల మీటర్ల బట్టను ఉత్పత్తి చేశారు. బతుకమ్మ చీరల ఆర్డర్లతో నేతన్నలకుమెరుగైన ఉపాధి లభించింది. ఆ ఆర్డర్లు పూర్తి కాగానే.. ఇప్పుడు కొత్తగా తమిళనాడు ఆర్డర్లు రావడంతో నేత కార్మికుల ఉపాధికి మరో దారి లభించింది. సిరిసిల్లకు పండుగ శోభ ఐదేళ్లుగా సిరిసిల్లలో ఉత్పత్తి అవుతున్న చీరలు తమిళనాడుకు ఎగుమతి అవుతున్నాయి. ఈసారి కూడా తమిళనాడు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. డిసెంబరు నెలాఖరు వరకు తమిళనాడు చీరలు ఉత్పత్తి కానున్నాయి. పండగకు ముందే ఆర్డర్లు రావడంతో మరమగ్గాలపై వేగంగా చీరలు, దోవతులు, పంచెలను ఉత్పత్తి చేస్తున్నారు. తమిళనాడులో 1.72 కోట్ల పంచె లు, మరో 1.73 కోట్ల చీరలు అవసరం ఉండటంతో అక్కడ ఆ మేరకు ఒకేసారి ఉత్పత్తి సాధ్యం కాకపోవడంతో అక్కడి వస్త్రాల ఏజెంట్ల దృష్టి సిరిసిల్లపై పడింది. దీంతో ఇక్కడ భారీగా ఆర్డర్లు ఇస్తూ.. చీరలు, పంచెలు ఉత్పత్తి చేయిస్తున్నారు. పాలిస్టర్, కాటన్ నూలు కలిసిన దారంతో మెత్తగా చీరలు, పంచెలను నేస్తున్నారు. సిరిసిల్లలో 2 వేల మరమగ్గాలపై చీరలు, పంచెలు ఉత్పత్తి అవుతున్నాయి. ఒక్కో మగ్గం నిత్యం 70 మీటర్లు ఉత్పత్తి చేస్తుండగా రోజుకు లక్షా నలభైవేల మీటర్ల చీరల వస్త్రం ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ తయారైన చీరలు, దోవతులను కేరళకు ఎగుమతి చేస్తున్నారు. ఓనం పండగకు సిరిసిల్ల చీరలను, పంచెలను సామాన్యులు ఇష్టపడడంతో కేరళలోని బహిరంగ మార్కెట్‌కు వస్త్రాలు ఎగుమతి అవుతున్నాయి. నాణ్యమైన ఉత్పత్తులు ఇప్పటికే ఉన్న మరమగ్గాలపై కాటన్ చీరలు, తువ్వాలలు, దోవతులు, కర్చిఫ్లు, లుంగీలను ఉత్పత్తి చేస్తున్నారు. చీరలపై అనువైన రంగుల్లో ప్రింటింగ్ చేసి ఆధునిక హంగులను సమకూర్చే అవకాశం ఉంది. పాలిస్టర్ గుడ్డను ఉత్పత్తి చేస్తే మీటర్‌కు రూ.1.80 లభిస్తుండగా, అదే చీర ఉత్పత్తి చేస్తే మీటర్‌కు రూ.4.70 చెల్లిస్తున్నారు. చీర పొడవు 5.50 మీటర్లు ఉండగా.. రూ.25 చెల్లిస్తున్నారు. నూలు అందించి, బీములు పోసి ఇస్తుండటంతో మెరుగైన ఉపాధి సమకూరుతుంది. ఒకే పనికి కొద్ది నైపుణ్యం జోడిస్తే మూడింతల కూలీ దొరుకుతుంది. సిరిసిల్లలో తక్కువ ధరకే గుడ్డ ఉత్పత్తవుతుండగా, తమిళనాడు వ్యాపారులు భారీ ఎత్తున దిగుమతి చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్వీఎం, క్రిస్మస్, కేసీఆర్ కిట్ల ఆర్డర్లను సిరిసిల్లకే ఇస్తోంది. పని బాగుంది మొన్నటి వరకు బతుకమ్మ చీరలతో మంచి ఉపాధి లభించింది. ఇప్పుడు తమిళనాడు చీరల ఆర్డర్లు వస్తున్నాయి. పనిబాగుంది. పాలి స్టర్ కంటే కార్మికులకు, ఆసాములకు చీరల ఆర్డర్లతో బతుకుదెరువు బాగుంది. ప్రభుత్వ ఆర్డర్లతో సిరిసిల్లకు మంచి రోజులు వచ్చాయి. – వెల్ది హరిప్రసాద్, ఆసామి బతుకమ్మ ఆర్డర్లతో మంచి కూలీ వచ్చింది సిరిసిల్లలో ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరల ఆర్డర్లతో మంచి కూలీ వచ్చింది. వారానికి రూ.5 వేలు సంపాదించిన. ఇప్పుడు మళ్లీ వారానికి రూ.2 వేలు వస్తుంది. తమిళనాడు చీరల ఆర్డర్లతో నెలకు రూ.10 వేలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆర్డర్లు వస్తేనే బాగుంటుంది. అందరికీ పని ఉంటుంది. పాలిస్టర్ కంటే తమిళనాడు చీరలు నయమే. – మహేశుని ప్రసాద్, కార్మికుడు -
‘కొత్త’కు జీవం... నేతకు ప్రాణం
- మగ్గంపై రూ.80 వేలకు పైగా విలువ చేసే చీరల తయారీ - పోచంపల్లి ఇక్కత్ చీరలో అనేక ప్రయోగాలు, ఎన్నో ప్రత్యేకతలు - ఆదర్శంగా నిలుస్తున్న చిలుకూరి రామ్మూర్తి భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండల కేంద్రానికి చెందిన చేనేత కార్మికుడు చిలుకూరి రామ్మూర్తి ఏకంగా రూ.80 వేలు విలువ చేసే ఖరీదైన చీరలు నేసి ఔరా అన్పించాడు. అంతేకాదు పోచంపల్లి చీరల్లో అనేక వినూత్న ప్రయోగాలు చేస్తూ అబ్బుర పరుస్తున్నాడు. తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్నాడు. నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చిలుకూరి రామ్మూర్తిది స్వస్థలం చండూరు. ఐదేళ్లుగా కుటుంబ సభ్యులతో పోచంపల్లికి వచ్చి ఇక్కడే మగ్గం నేస్తూ, నేయిస్తూ పలువురి కి ఉపాధి చూపుతున్నాడు. ఇతను పాతికేళ్ల నుంచి చేనేత వృత్తిని నమ్ముకున్నాడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం అంజయ్య వద్ద కొన్నేళ్లు పని చేశాడు. చేనేతపనిలోనే ఏదైనా కొత్తదనం చూపించాలన్నది ఇతని తపన. తన బుర్రకు ఎప్పుడు పదును పెడుతుంటాడు. రొటీన్‌కు భిన్నంగా వినూత్నంగా చీరలను తయారు చేయాలని ఆలోచన చేశాడు. ఆ తపనలోనే ఎన్నో ఆవిష్కరణలకు జీవం పోశాడు. రూ. 80 వేల చీర ప్రత్యేకత ఏమిటంటే.. బెంగళూరు నుంచి తెప్పించిన స్వచ్ఛమైన పట్టు దారం.. సూరత్ నుంచి తెప్పించిన వెండి జరీతో చీరను నేస్తాడు. చీర పొడవు 6 మీటర్లు, మీటరు బ్లౌజ్, వెడల్పు 50 ఇంచులు ఉంటుంది. చీర బరువు 900 గ్రాములు ఉంటుంది. చీరను నేయడానికి ప్రత్యేకమైన మగ్గం అవసరం. రెండు జకాత్ మిషన్లు తొక్కుతూ ప్రత్యేక శిక్షణ పొందిన కార్మికుడు మాత్రమే నేయగలుగుతాడు. 10 రోజులు నేస్తే ఒక చీర తయారవుతుంది. కొనుగోలు చేస్తున్న ప్రముఖులు ఖరీదైన చీరను సాధారణ మహిళలు కొనుగోలు చేయలేరు. అంత ఖరీదైన చీరలను ప్రత్యేకంగా ప్రముఖులు మాత్రమే కొనుగోలు చేస్తారు. సెలబ్రిటీల డిజైనర్లు, ఫ్యాషన్ డిజైనర్లు, పలు డిజైన్లు ఇచ్చి ఇలా నేసి ఇవ్వాలని ఆర్డర్ ఇస్తున్నారు. వారి కోసం ఆకర్షణీయమైన డిజైన్లతో చీరలను తయారు చేస్తాడు. గతంలో నటి అనుష్కకు రూ.80 వేల చీరను, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి కుటుంబంతో పాటు పలువురు వ్యాపార వేత్తలకు ఖరీదైన చీరలను అందజేసి వారి మెప్పును పొందాడు. వినూత్న డిజైన్లను సృష్టించి.. ఇతనికి మొదటి నుంచి వస్త్ర తయారీలో ప్రయోగాలు చేయడమంటే ఇష్టం. ప్రయోగాలు చేసి విజయం కూడా సాధించాడు. ఇతర ప్రాంతాల్లో పేరుగాంచిన కంచి, ఉప్పాడ, జంథానీ, కోట డిజైన్లను, పోచంపల్లి ఇక్కత్ చీరల్లో మిళితం చేసి వినూత్న చీరలను సృష్టించాడు. ఒకే చీరలో పోచంపల్లి ఇక్కత్, కంచి బార్డర్, కొంగు కోటా డిజైన్. ఇలా మూడు రకాల వైరైటీ డిజైన్లను రూపొందిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. మంచి ఆదరణ ఉంది పోచంపల్లి ఇక్కత్‌లోనే అనేక డిజైన్లు ను రూపొందిస్తున్నాను. రిస్క్ ఎక్కువ ఉన్నా సరే నాకు చిన్నప్పటి నుంచి విభిన్నంగా చీరలను తయారు చేయాలని కోరిక. రూ. 6 వేల నుంచి రూ.80 వేల విలువైన చీరెలను తయారు చేస్తాను. ఖరీ దైన చీరలను మాత్రం ఆర్డర్‌పైన నేసి ఇస్తా ను. అంతేకాక పోచంపల్లి చీరలోనే కంచి, ఉప్పాడ, కోట, జంథానీ డిజైన్లతో చీరల ను కూడ తయారు చేశారు. చీరలకు మంచి ఆదరణ లభిస్తుంది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని ఆవిష్కరణ చేస్తాను. –చిలుకూరి రామ్మూర్తి, చేనేత కళాకారుడు