Sarinodu
-
మీ అభిమానానికి ఫిదా : అల్లు అర్జున్
దేశవ్యాప్తంగా తన సినిమాలకు వస్తున్న ఆదరణకు ఉబ్బితబ్బిబ్బవుతున్నట్లు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేర్కొన్నారు. తాజాగా ఆయన నటించిన సరైనోడు, డీజే హిందీ డబ్బింగ్ సినిమాలు యూట్యూబ్‌లో మిలియన్లకొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ట్విటర్లో స్పందిస్తూ 'నా సినిమాలపై మీరు చూపిస్తున్న అభిమానానికి ఫిదా అయ్యాను. మీ ఆదరాభిమానాలు ఎల్లప్పుడు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. నా సినిమాలు ప్రాంతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం సంతోషాన్ని కలిగిస్తోంది’ అని పేర్కొన్నారు. అభిమానులు చూపిస్తున్న అభిమానానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ, రాబోయే రోజుల్లో మరిన్ని మంచి సినిమాలు అందించడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన సరైనోడు, హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన డీజే హిందీ డబ్బింగ్ సినిమాలు యూట్యూబ్‌లో 200,150 మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి మంచి హిట్ సినిమాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో తాజాగా రూపొందుతున్న చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. I thank all the viewers from all over ... glad our work is being liked beyond regional borders ... hope to entertain you more in the coming years and win more of your love . Thank you once again. @harish2you @hegdepooja @Rakulpreet @MusicThaman @ThisIsDSP many more... 🙏🏼 pic.twitter.com/ARKMUVxiPf— Allu Arjun (@alluarjun) August 6, 2019 -
అందుకే బాహుబలికి మినహాయింపు: బన్నీ
హైదరాబాద్: హీరో రాణా, వరుస హిట్లతో దూసుకుపోతున్న అల్లు అర్జున్‌ల మధ్య ట్విట్టర్లో ఆసక్తికరమైన చర్చ జరిగింది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రాణాలు నటించిన బాహుబలి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రికార్డులు నెలకొల్పిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమా విడుదలై విజయవంతంగా 30 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సినిమాకు బ్రహ్మాండమైన విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు బన్నీ కృతజ్ఞతలు తెలిపాడు. సరైనోడు రికార్డులకు సంబంధించి ఓ ఫోటోను కూడా బన్నీ పోస్ట్ చేశాడు. అయితే ఆ లిస్ట్‌లో బాహుబలి కాకుండా అని రాసి.. రికార్డుల ర్యాంకులు ఇచ్చారు. దీన్ని చూసిన రాణా.. ఎందుకు బన్నీ ర్యాంకుల లిస్ట్‌లో మాకు మినహాయింపు ఇచ్చారంటూ సరదాగా ట్విట్ చేశాడు. దీనికి బన్నీ బదులిస్తూ బాహుబలి ఓ ప్రత్యేక చిత్రం కాబట్టే రికార్డుల్లో దాన్ని మినహాయించి ర్యాంకులు ఇచ్చామని బదులిచ్చాడు. Whole Heartedly Thank Telugu Movie Audience for this Stupendous Success ! pic.twitter.com/D7fma9LLtz — Allu Arjun (@alluarjun) 19 May 2016 @RanaDaggubati We "excluded" Bahubali bcoz it is "exclusive" -
ఈ వారం ఆ సినిమాలకే..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో సమ్మర్ సీజన్‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. స్టార్ హీరోలతో పాటు చిన్న హీరోలు కూడా ఈ సీజన్లో తమ సినిమాలను రిలీజ్ చేసి క్యాష్ చేసుకోవాలనుకుంటారు. అందుకే సమ్మర్ సీజన్లో ప్రతీవారం కనీసం ఒక్క సినిమా అయినా థియేటర్లలో సందడి చేసేది. కానీ ఈ వారం ఒక్క తెలుగు సినిమా కూడా రిలీజ్ కావటం లేదు. చాలా మంది హీరోలు తమ సినిమాల రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నా.. ఈ టైంలో రిలీజ్ చేయడానికి మాత్రం ఇంట్రస్ట్ చూపించటం లేదు. దీంతో ఈ వారం ఏకంగా ఆరు డబ్బింగ్ సినిమాలు ఆడియన్స్ ముందుకు రానున్నాయి. వీటిలో జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న పెన్సిల్ సినిమా ఒక్కటే కొంత హైప్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాతో పాటు విజయ్ ఆంటోని హీరోగా తమిళ్లో ఘన విజయం సాధించిన పిచ్చైకారన్ సినిమాను తెలుగులో బిచ్చగాడు పేరుతో రిలీజ్ చేస్తున్నారు. శివకార్తీకేయన్ హీరోగా తెరకెక్కిన పాత సినిమాను కేడి బిల్లా కిలాడి రంగాగా రిలీజ్ చేస్తున్నారు. వీటితో పాటు రహదారి, స్ట్రాబెర్రీ, టీనేజ్ లాంటి మరో మూడు డబ్బింగ్ సినిమాలు ఈ శుక్రవారమే థియేటర్లలోకి వస్తున్నాయి. అయితే వీటిలో చాలా సినిమాలకు థియేటర్లు కూడా పెద్దగా దొరికే అవకాశం కనిపించటం లేదు. ఇప్పటికీ సరైనోడు, సుప్రీం సినిమాల హవా కొనసాగుతుండటం. 24 సినిమా తెలుగు, తమిళ భాషల్లో మంచి వసూళ్లను సాధిస్తుండటంతో ఈ డబ్బింగ్ సినిమాలకు థియేటర్ల సమస్య తప్పేలా లేదు.