అందుకే బాహుబలికి మినహాయింపు: బన్నీ
హైదరాబాద్: హీరో రాణా, వరుస హిట్లతో దూసుకుపోతున్న అల్లు అర్జున్ల మధ్య ట్విట్టర్‌లో ఆసక్తికరమైన చర్చ జరిగింది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రాణాలు నటించిన బాహుబలి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రికార్డులు నెలకొల్పిన విషయం తెలిసిందే.
అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమా విడుదలై విజయవంతంగా 30 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సినిమాకు బ్రహ్మాండమైన విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు బన్నీ కృతజ్ఞతలు తెలిపాడు. సరైనోడు రికార్డులకు సంబంధించి ఓ ఫోటోను కూడా బన్నీ పోస్ట్ చేశాడు. అయితే ఆ లిస్ట్‌లో బాహుబలి కాకుండా అని రాసి.. రికార్డుల ర్యాంకులు ఇచ్చారు.
దీన్ని చూసిన రాణా.. ఎందుకు బన్నీ ర్యాంకుల లిస్ట్‌లో మాకు మినహాయింపు ఇచ్చారంటూ సరదాగా ట్విట్ చేశాడు. దీనికి బన్నీ బదులిస్తూ బాహుబలి ఓ ప్రత్యేక చిత్రం కాబట్టే రికార్డుల్లో దాన్ని మినహాయించి ర్యాంకులు ఇచ్చామని బదులిచ్చాడు.
Whole Heartedly Thank Telugu Movie Audience for this Stupendous Success ! pic.twitter.com/D7fma9LLtz
— Allu Arjun (@alluarjun) 19 May 2016
@RanaDaggubati We "excluded" Bahubali bcoz it is "exclusive"