ఇగ్లూ హోటల్..
ఇది ఇగ్లూ హోటల్. చూశారుగా.. అన్నీ ఇగ్లూ మోడల్లో ఉన్నాయి. ఫిన్లాండ్లోని శారిసెల్కాలో ఈ హోటల్ ఉంది. ఇందులో ఇలాంటి అద్దాల ఇగ్లూలు మొత్తం 40 ఉన్నాయి. ఆకాశంలో కనువిందు చేసే ఉత్తర ధ్రువ కాంతులను చూడటానికి ఎక్కువ మంది ఇక్కడికి వస్తారు. బయట విపరీతంగా మంచు ఉన్నా..
గదిలో మాత్రం వెచ్చగా ఉంటుంది. ఈ హోటల్లో ఓ మంచు రెస్టారెంట్ కూడా ఉంది. ఇక్కడ బల్లలు సహా అన్నీ ఐస్తో చేసినవే ఉంటాయి. ఒక్కో ఇగ్లూ రూంలో ఇద్దరు ఉండొచ్చు. ఒక రోజుకు రూ.25 వేలు వసూలు చేస్తారు.