భారత బాక్సర్ సర్జుబాలాకు రజతం
జెజూ:దక్షిణ కొరియాలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో భారత్ కు రజతం దక్కింది. ఏఐబీఏ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో భాగంగా ఇక్కడ జరిగిన పోరులో సర్జుబాలా దేవీ రజతంతో సరిపెట్టుకుంది. మహిళల లైట్ ఫ్లై వెయిట్ 48 కేజీల విభాగంలో జరిగిన సెమీ ఫైనల్ పోరులో థాయ్ లాండ్ తైపీకి చెందిన చుతామత్ రాక్ సాత్ ను ఓడించి సర్జుబాలా ఫైనల్ కు చేరింది. అయితే ఫైనల్లో పోరులో చతికిలబడ్డ సర్జుబాలా రజతంతో సరిపెట్టుకుంది.