Sark
-
ప్రపంచంలోనే అతిచిన్న జైలు.. ఖైదీలు ఎందరో తెలుసా?
ఇది ప్రపంచంలోనే అతిచిన్న చెరసాల. ఇద్దరు ఖైదీల సామర్థ్యం మాత్రమే గల ఈ జైలు బ్రిటన్‌లోని సార్క్ దీవిలో ఉంది. ఇంగ్లండ్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఇంగ్లిష్ చానల్‌లోని చానల్ దీవుల ద్వీపసమూహంలో ఒకటైన సార్క్ దీవి విస్తీర్ణం 5.4 చదరపు కిలోమీటర్లు మాత్రమే! ఈ దీవి జనాభా 562 మంది.ఈ దీవిలో 1856లో ఈ జైలును నిర్మించారు. చెక్కపీపాను దీనికి పైకప్పుగా ఏర్పాటు చేయడం ఇందులోని మరో విశేషం. తొలిరోజుల్లో ఈ జైలుకు విద్యుత్ సౌకర్యం కూడా ఉండేది కాదు. జైలు నిర్మించిన దాదాపు శతాబ్దం తర్వాత మాత్రమే దీనికి విద్యుత్తు సౌకర్యం వచ్చింది. ఇందులో ఇద్దరు ఖైదీల కోసం రెండు గదులు, రెండు గదుల మధ్య సన్నని నడవ మాత్రమే ఉంటాయి. ఈ జైలు ఇప్పటికీ వినియోగంలో ఉండటం విశేషం.అయితే, ఈ జైలులో ఖైదీలను ఎక్కువకాలం నిర్బంధంలో ఉంచరు. ఏదైనా నేరారోపణతో పట్టుబడిన నిందితులను ఈ జైలులో రెండు రోజుల వరకు ఉంచుతారు. కోర్టులో హాజరుపరచిన తర్వాత ఇక్కడి నుంచి గ్రంజీ దీవిలోని పెద్ద జైలుకు తరలిస్తారు. సార్క్ దీవి అధికార యంత్రాంగానికి బ్రిటిష్ రాచరికం పరిమితంగా మాత్రమే న్యాయవిచారణ అధికారాలను ఇచ్చింది.ఇక్కడ పట్టుబడిన ఖైదీలను రెండు రోజులకు మించి నిర్బంధించరాదని, అంతకు మించిన శిక్ష విధించాల్సిన నేరానికి పాల్పడినట్లయితే వారిని గ్రంజీ జైలుకు తరలించాలని 1583లో అప్పటి బ్రిటిష్ రాచరికం ఆదేశాలు జారీచేసింది. ఆనాటి ఆదేశాలే ఇక్కడ ఈనాటికీ అమలులో ఉన్నాయి. అయితే, ఈ జైలుకు తరచు ఖైదీల రాక ఉండదు. తక్కువ జనాభా గల ఈ దీవిలో నేరాలు కూడా చాలా తక్కువ.ఇవి చదవండి: 'అపార్ట్మెంట్ 66బి’ గురించి.. కనీసం మాట్లాడాలన్నా ధైర్యం చాలదు! -
పాక్ దుర్భేద్యమైనది..
- భారత్ దాడులు అబద్ధం - ఎల్ఓసీ వద్ద మీడియాతో పాక్ ఆర్మీ మంధోల్(పాకిస్తాన్): భారత ఆర్మీ జరిపిన ‘మెరుపు దాడి’ బూటకమని ప్రపంచాన్ని నమ్మించేందుకు పాకిస్తాన్ ఆపసోపాలు పడుతోంది. తాజాగా భారత సైనిక స్థావరం కనిపించేలా పాక్ ఆక్రమిత కశ్మీర్ వాస్తవాధీన రేఖ(ఎల్ఓసీ) సమీపంలోని ఎత్తై అటవీ ప్రాంతానికి అంతర్జాతీయ మీడియాను తీసుకెళ్లి మరీ భేటీ పెట్టింది. తమ దేశం దుర్భేద్యమైనదని, ఎట్టి పరిస్థితుల్లోనూ చొరబాట్లు సాధ్యం కావని విలేకర్లకు చెప్పింది. మెరుపు దాడిలో భాగంగా తమ కమాండోలు కొందరు 3 కిలోమీటర్లు పాక్‌లోకి చొచ్చుకువెళ్లి ఉగ్రవాదులను తుదముట్టించారని భారత్ చెప్పిన నేపథ్యంలో దాయాది దేశ సైన్యం శనివారం ఈ భేటీ ఏర్పాటు చేసింది. పాత్రికేయులను హెలికాప్టర్లో తీసుకెళ్లి అక్కడి పరిస్థితులను వివరించింది.భారత్ చెబుతున్న సర్జికల్ దాడులు అబద్ధమని పాక్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ బజ్వా చెప్పారు. చందూ విడుదలకు ఇంకొంత సమయం పుణె: సరిహద్దు దాటి పాక్ దళాలకు పట్టుబడిన భారత జవాను చందూ బాబూలాల్ చవాన్‌ను రప్పించడానికి మరికొంత సమయం పడుతుందని రక్షణమంత్రి పరీకర్ తెలిపారు. డెరైక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) ద్వారా కూడా చర్యలు ప్రారంభించామన్నారు. సార్క్‌లో ఏకాకిగా మారిన పాకిస్తాన్ కఠ్మాండు: ఉగ్రవాదాన్ని అరిక ట్టాలని నేపాల్ పాక్‌ను హెచ్చరించింది. తమ భూభాగాలు ఉగ్రవాదులకు అడ్డాగా మారకుండా చూడాల్సిన బాధ్యత సభ్యదేశాలపై ఉందని సార్క్ అధ్యక్ష స్థానంలో ఉన్న నేపాల్ సూచించింది.