- భారత్ దాడులు అబద్ధం
- ఎల్‌ఓసీ వద్ద మీడియాతో పాక్ ఆర్మీ
మంధోల్(పాకిస్తాన్): భారత ఆర్మీ జరిపిన ‘మెరుపు దాడి’ బూటకమని ప్రపంచాన్ని నమ్మించేందుకు పాకిస్తాన్ ఆపసోపాలు పడుతోంది. తాజాగా భారత సైనిక స్థావరం కనిపించేలా పాక్ ఆక్రమిత కశ్మీర్ వాస్తవాధీన రేఖ(ఎల్‌ఓసీ) సమీపంలోని ఎత్తై అటవీ ప్రాంతానికి అంతర్జాతీయ మీడియాను తీసుకెళ్లి మరీ భేటీ పెట్టింది. తమ దేశం దుర్భేద్యమైనదని, ఎట్టి పరిస్థితుల్లోనూ చొరబాట్లు సాధ్యం కావని విలేకర్లకు చెప్పింది. మెరుపు దాడిలో భాగంగా తమ కమాండోలు కొందరు 3 కిలోమీటర్లు పాక్‌లోకి చొచ్చుకువెళ్లి ఉగ్రవాదులను తుదముట్టించారని భారత్ చెప్పిన నేపథ్యంలో దాయాది దేశ సైన్యం శనివారం ఈ భేటీ ఏర్పాటు చేసింది. పాత్రికేయులను హెలికాప్టర్‌లో తీసుకెళ్లి అక్కడి పరిస్థితులను వివరించింది.భారత్ చెబుతున్న సర్జికల్ దాడులు అబద్ధమని పాక్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ బజ్వా చెప్పారు.
చందూ విడుదలకు ఇంకొంత సమయం
పుణె: సరిహద్దు దాటి పాక్ దళాలకు పట్టుబడిన భారత జవాను చందూ బాబూలాల్ చవాన్‌ను రప్పించడానికి మరికొంత సమయం పడుతుందని రక్షణమంత్రి పరీకర్ తెలిపారు. డెరైక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) ద్వారా కూడా చర్యలు ప్రారంభించామన్నారు.
సార్క్‌లో ఏకాకిగా మారిన పాకిస్తాన్
కఠ్మాండు: ఉగ్రవాదాన్ని అరిక ట్టాలని నేపాల్ పాక్‌ను హెచ్చరించింది. తమ భూభాగాలు ఉగ్రవాదులకు అడ్డాగా మారకుండా చూడాల్సిన బాధ్యత సభ్యదేశాలపై ఉందని సార్క్ అధ్యక్ష స్థానంలో ఉన్న నేపాల్ సూచించింది.
పాక్ దుర్భేద్యమైనది..
Published Mon, Oct 3 2016 1:34 AM | Last Updated on Sat, Mar 23 2019 7:58 PM
Advertisement
Advertisement