యువతిపై జిమ్ ట్రైనర్ అత్యాచారం
యువతికి మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి అపై అత్యాచారం చేశాడు ఓ జిమ్ ట్రైనర్. ఆ ఘటన దక్షిణ ఢిల్లీలోని సరోజిని నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. దాంతో సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా జిమ్ ట్రైనర్ తరుణ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు సరోజిని నగర్ పోలీసులు వెల్లడించారు. బాధితురాలు (30) స్థానికంగా వ్యాపారం చేసుకుంటు జీవనం సాగిస్తుంది.
అయితే కొద్ది నెలల క్రితం ఆమె జిమ్‌లో చేరటంతో.... ఆమెకు జిమ్ ట్రైనర్ తరుణ్ శిక్షణ ఇస్తున్నాడు. ఆ క్రమంలో ఆమెకు కూల్ డ్రింక్ ఇచ్చిడు. ఆమె ఆ డ్రింక్ తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం ఆ విషయం ఎక్కడైన చెబితే చంపెస్తానని బెదిరించాడు. దాంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అతడి నివాసంలో అరెస్ట్ చేశారు.