708 పాఠశాలల్లో బయోమెట్రిక్
ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు
సర్వశిక్షా అభియూన్ ద్వారా నిధులు
{పతి రోజూ ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు నమోదు
విద్యారణ్యపురి : ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయులు ఇష్టానుసారంగా వచ్చే పరిస్థితులకు అడ్డుకట్ట వేయడానికి పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానం అమలుచేయబోతున్నారు. దీని ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు నమోదు చేస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యతో పాటు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం తదితర సదుపాయాలు కల్పిస్తున్నా విద్యార్థుల సంఖ్య ప్రతి ఏడాది తగ్గిపోతూనే ఉంది. విద్యార్థుల సంఖ్య పెరగాలంటే ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి నాణ్యమైన విద్య అందించాలనే అభిప్రాయం ఉంది. ఇదే కాకుండా ప్రధానంగా కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సక్రమంగా విధులకు హాజరుకావడం లేదనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు, తండాల్లోని పాఠశాలల్లో వంతులవారీగా ఉపాధ్యాయులు తమ విధులు నిర్వర్తిస్తున్నారనే విమర్శలున్నా యి. అలాగే, కొందరు తాము పనిచేసేచోట కా కుండా జిల్లా కేంద్రంలోనే ఉంటున్నారు. అక్కడి నుంచి రైళ్లు, బస్సుల్లో వంద కిలోమీటర్లకు పైగా రాకపోకలు సాగిస్తుండడంతో సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలున్నాయి. కొన్నిచోట్ల ఉపాధ్యాయులు సక్రమంగా విధులు నిర్వర్తించకపోవడం వల్లే విద్యార్థులకు సరైన విద్య అందడం లేదని, తద్వారా ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజల్లో నమ్మకం సడలిందనే అభిప్రాయం ఉంది. ఇందుకు నిదర్శనంగా జిల్లాలో 86 పాఠశాలల్లో అసలే విద్యార్థులు లేరు. వందలాది పాఠశాలల్లో 20నుంచి 30మందిలోపే విద్యార్థు లు ఉండడం గమనార్హం.
ప్రభుత్వ ఆమోదం..
ఈ విద్యా సంవత్సరంలో రాష్ర్ట్రంలో 25శాతం పాఠశాలల్లో బయోమెట్రిక్ అమలు చేయబోతున్నారు. ఇటీవల డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి కలెక్టర్లతో నిర్వహిం చిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ విషయంపై చర్చించారు. నిధులపై జిల్లా కలెక్టర్ల ప్రతిపాదన ల మేరకు బయోమోట్రిక్ పరికరాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జిల్లాలో ఈ వి ద్యాసంవత్సరం సుమారు 708 పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని వి ద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. అం దుకు సంబంధించిన పరికరాలు జూన్ నెలాఖ రుకల్లా ఎంపిక చేసిన పాఠశాలల్లో అమర్చనున్నారని తెలుస్తోంది. అందుకు నిధులు సర్వశిక్షాఅభియాన్ నుంచి కలెక్టర్లకు విడుదల చేయబోతున్నారని సమాచారం. వరంగల్ జిల్లాలో ప్రా థమిక పాఠశాలలు 2049 ఉండగా. యూపీఎస్ లు 360, హైస్కూళ్లు 510 ఉన్నాయి. మొత్తంగా 13,896 ఉపాధ్యాయ పోస్టులుండగా ప్రస్తుతం 12,068మంది పనిచేస్తున్నారు. ఇక.. జిల్లాలో 2015-2016 విద్యాసంవత్సరంలో 1నుంచి 5వ తరగతి వరకు లక్షా 26వేల 878 మంది విద్యార్థులు, 6నుంచి 8తరగతుల్లో 86,765 మంది వి ద్యార్థులు ఉన్నారని, 9, 10 తరగతుల్లో 59,637 మంది విద్యార్థులు ఉన్నట్లు డైస్ లెక్కల్లో ఉంది. ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థులకు ఆధార్ తప్పనిసరి చేశారు. ప్రవేశాల సమయంలో ఆ ధార్ నంబర్ నమోదు చేస్తారు. గత ఏడాది పా ఠశాలల్లో చేరిన పిల్లలకు ఆధార్‌తో అనుసంధానం చేసే చైల్డ్ ఇన్ఫో ప్రక్రియ కూడా కొనసాగుతోంది. దీనిద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఎందరు విద్యార్థులు ఉన్నారనేది తేటతెల్లం కా బోతుంది. డైస్ లెక్కల ప్రకారం చూపిన విద్యార్థుల సంఖ్యలో ఆధార్ అనుసంధానంతో 60వేలకు పైగా విద్యార్థులు త గ్గారనేది ప్రాథమిక అంచనా.
ఈసంఖ్య ఇంకా పెరిగే అవకాశముం ది. ఈ విద్యా సంవత్సరం బడి బాట కార్యక్ర మం కూడా కొనసాగుతుండగా.. ప్రతీ పాఠశాల లో కనీసం ఐదు శాతం అధికంగా సంఖ్య పెం చాలని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మ రోవైపు ఈ విద్యాసంవత్సరం 476 ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టబోతున్నారు. బయోమెట్రిక్ విధానం అమలు చేస్తే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు శాతంపెరిగి తద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్న అభిప్రాయం ఉంది. అంతేగాకుండా బయోమెట్రిక్ ద్వారా ప్రతీరోజు విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం ఎంద రికి ఉపయోగపడుతుందనే కూడా తెలిసిపో తుంది. అయితే బయోమెట్రిక్ అమలు చేయబోతున్నారని తెలిసి ఉపాధ్యాయుల్లో మాత్రం అది ‘భయో’మెట్రిక్ అనే చర్చ జరుగుతోంది.