పహాణీ...కహానీ..!
పాలమూరు, న్యూస్‌లైన్ : ఖిల్లాఘనపురం మండలం అల్లమయాప ల్లి గ్రామానికి చెందిన గో పాల్, వెంకట్ నర్సింహ్మ, పెద్ద నర్సింహ్మ లకు స ర్వేనెంబర్లు 136, 138, 141లో 6ఎకరాల భూమి ఉంది. ఈ మొత్తం పట్టాదారు పాసుపుస్తకాల్లో.. నమోదై ఉన్నప్పటికీ.. ఆన్లైన్లో న మోదు చేయని కారణంగా.. మీ సేవా కేంద్రాల్లో ఆర్ఓఆర్, పహాణీలు రావడంలేదు.
ఈ భూమికి సంబంధించిన వివరాలను కంప్యూటరీకరణ చేయాల్సిందిగా .. గత 6నెలలుగా తహశీల్దా ర్ కార్యాలయం చుట్టూ తిరుగున్నా.. అధికారులు స్పందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుణాలు పొందాలంటే ఆన్లైన్ న మోదు తప్పనిసరి అని..తమ గోడు పట్టించుకునే వారే లేరని వారు చెబుతున్నారు.. అదే మండలం మల్కిమియాన్పల్లికి చెం దిన రైతు ఎ.బుచ్చారెడ్డికి సర్వే నెంబర్ 132లో 2.10 ఎకరాల భూమి ఉంది. ఆయనదీ ఇదే పరిస్థితి.ఈ రైతులకే కాదు.. జిల్లాలోని చాలా మం ది రైతులు ఆన్లైన్ భూముల సమాచారం స రైన విధంగా పొందుపర్చని కారణంగా ఇబ్బం దులు పడుతున్నారు.కంప్యూటరీకరణలో భూ ముల క్రయ, విక్రయాల వివరాలు నమోదు సమస్యతో రై తులు, భూ యజమానులు సతమతమవుతున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన వారికి సంబంధించి 30 శాతం వివరాలు కూడా నమోదు కాలేదు. తా జాగా ప్రభుత్వం ఇకనుంచి పట్టాదారు పాసు పుస్తకాలను కూడా మీ సేవలోనే పొందాలని నిర్ణయించడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
వేధిస్తున్న సిబ్బంది కొరత
వివిధ మండలాల్లో నిత్యం భూముల క్ర య, విక్రయాలకు సంబంధించి 10 నుం చి 15 వరకు పట్టాలు తయారు చేసి, పా సు పుస్తకాలు మంజూరు చేస్తున్నారు. వా రికి రెవెన్యూ సిబ్బంది మూ డు ఫొటోలు తీసుకొని పాసుపుస్తకాలు ఇస్తున్నారే త ప్ప కంప్యూటర్లోకి ఎక్కించడం లేదు. ఆయా గ్రామాల్లో కార్యదర్శుల్లేని కారణంగా నమోదు ప్రక్రియ భారంగా మారింది.