కేసీఆర్ దురహంకారానికి ఘోరీ కట్టాలి: సతీష్ మాదిగ
హైదరాబాద్: టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు దురహంకారానికి ఘోరీ కట్టాలని తెలంగాణ సీమాంధ్ర జేఏసీ నేత సతీష్ మాదిగ అన్నారు. టీఆర్ఎస్ కనుసన్నల్లోనే తెలంగాణ సకల జన భేరీ జరిగిందని తెలంగాణ సెటిలర్స్ ఫ్రంట్ అధ్యక్షుడు శ్రీనివాసరాజు చెప్పారు. సీమాంధ్రప్రజలను అవహేళన చేయడం తగదని ఆయన అన్నారు. అహంకారపూరిత ప్రకటనలే తెలంగాణకు అడ్డు అని ఆయన చెప్పారు.