satish soni
-
విశాఖకు ఖండాంతర ఖ్యాతి
ఐఎఫ్ఆర్తో అంతర్జాతీయ బ్రాండ్‌గా నగరం తూర్పు నావికాదళ చీఫ్ వైస్ అడ్మిరల్ సోనీ విశాఖపట్నం: అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష(ఐఎఫ్ఆర్)కు వేదిక అయిన తూర్పు తీరంలోని విశాఖ ఖ్యాతి అంతర్జాతీయంగా ఇనుమడిస్తుందని తూర్పు నావికాదళ చీఫ్ ైవె స్ అడ్మిరల్ సతీష్ సోనీ అభిప్రాయపడ్డారు. ఐఎఫ్ఆర్తో విశాఖ నగరం ప్రపంచ దేశాలకు పరిచయమై ఒక బ్రాండ్‌గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐఎఫ్ఆర్లో భాగంగా రాష్ట్రపతి నిర్వహించనున్న యుద్ధనౌకల సమీక్ష (ప్రెసిడె న్షియల్ ఫ్లీట్ రివ్యూ) రిహార్సల్స్‌ను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎన్ఎస్ సుమిత్రలో సతీష్ సోనీ మీడియాతో మాట్లాడుతూ ఐఎఫ్ఆర్ విశేషాలను వివరించారు. ఐఎఫ్ఆర్లో 90 యుద్ధ నౌకలు పాల్గొంటాయని, వాటిలో 24 విదేశాలకు చెందినవని తెలిపారు. ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమాన్ని దేశంలో నిర్వహించడం ఇది రెండోసారి అని వివరించారు. 15 ఏళ్ల క్రితం పశ్చిమ తీరంలో నిర్వహించగా ఇప్పుడు తూర్పుతీరంలో నిర్వహిస్తున్నామన్నారు. 24 దేశాలకు చెందిన నౌకలు రివ్యూలో పాల్గొనేందుకు సిద్ధం కాగా రెండు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ సదస్సులో 80కి పైగా విదేశీ ప్రతినిధులు పాల్గొం టారని సోనీ చెప్పారు. ఐఎఫ్ఆర్ లోగోలోనే విశాఖ పేరు చేర్చడం తో ఈ నగరం పేరు గ్లోబలైజ్ అవుతుందని, దానివల్ల టూరిజం, వ్యాపారావకాశా లు పెరుగుతాయన్నారు. విన్యాసాల్లో భాగంగా యుద్ధనౌకలు తీరానికి దగ్గరగా రావడంతో విశాఖ వాసులకు బీచ్ నుంచే వీక్షించే అవకాశం లభిస్తుందన్నారు. అలాగే ప్రజలు వీక్షించేం దుకు నగరంలోని పలు చోట్ల స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాగా ఐఎఫ్ఆర్ భారత నావికాదళ శక్తిని ప్రదర్శించే వేదిక కాదన్నారు. ఉత్కంఠ రేపిన రిహార్సల్స్.. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో భాగంగా ఈనెల ఆరో తేదీన రాష్ట్రపతి నిర్వహించే యుద్ధనౌకల సమీక్ష రిహార్సల్స్‌ను విశాఖలో మంగళవారం సముద్రం లోపల నిర్వహించారు. ఈ నమూనా విన్యాసాల్లో 24 విదేశీ యుద్ధ నౌకలతో పాటు భారత నావికా దళానికి చెందిన యుద్ధనౌకలు, విమానాలు పాల్గొన్నాయి. అత్యంత సమీపం నుంచి దూసుకుపోయిన హాక్ యుద్ధ విమానాల విన్యాసాలు గగుర్పాటు కలిగించాయి. ఐఎన్ఎస్ సుమిత్ర రాజసంగా ముందుకు కదులుతుండగా కుడి, ఎడమ వైపుల్లో విదేశీ, స్వదేశీ యుద్ధ నౌకలు దాన్ని అనుసరిస్తూ గౌరవవందనం సమర్పించాయి. పరేడ్ సెయిల్స్తో హెలోబాటిక్స్, మెరైన్ కమెండోలు వాటర్ స్కూటర్లపై జరిపిన దాడి సన్నివేశాలు అసక్తి కలిగించాయి. ఫ్లైపాస్ట్‌లో చేతక్, రక్షక్, సీ కింగ్, హార్పన్స్ విమానాలు, ఆధునిక హెలికాప్టర్లు ధృవ్, కమోవ్, మీడియం రేంజ్ డోర్నియర్స్, తీరరక్షక దళ ఈగల్స్, సీ డ్రాగన్స్, షార్ట్ టేకాఫ్తోనే గగనతలంలోకి దూసుకుపోగల వైట్ టైగర్స్, జెట్ ట్రైనర్స్ హాక్‌లు విన్యాసాలు ప్రదర్శించాయి. విమాన వాహక నౌకలు ఐఎన్ఎస్ విక్రాంత్, విరాట్లతో పాటు విక్రమాదిత్య రిహార్సల్స్‌లో పాల్గొన్నాయి. -
కెరీర్‌ను గౌరవించండి
ఐఐఎం విద్యార్థులకు వైస్ అడ్మిరల్ సతీశ్ సోనీ సూచన విశాఖపట్నం: వేతన ప్యాకేజీలతో నిమిత్తం లేకుండా ఎంచుకున్న వృత్తిని గౌరవించాలని ఈస్టర్న్ నావల్ కమాండ్ వైస్ అడ్మిరల్ సతీశ్ సోని ఐఐఎం విద్యార్థులకు సూచించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) విశాఖపట్నం ప్రథమ వ్యవస్థాపక దినోత్సవానికి ఆయన హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకునేందుకు, సమాజాభివృద్ధికి పాటుపడేందుకు వేతనాలకై చూడకుండా వృత్తిని గౌరవించాలని చెప్పారు. నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు, వ్యక్తిత్వ వికాసానికి హార్డ్‌వర్క్, సిన్సియారిటీ ఎంతో ముఖ్యమని తెలిపారు. తీర ప్రాంత రక్షణ, దేశ ఆర్థికాభివృద్ధిలో నేవీ కీలకపాత్ర పోషిస్తోందని చెప్పారు. -
నేవీ అమ్ములపొదిలో ‘అస్త్రధరిణి’
విశాఖపట్నం: టొర్పొడోలను ప్రయోగించే స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన ఐఎన్ఎస్ అస్త్రధరిణి నౌక భారత నావికా దళంలో చేరింది. ప్రయోగించిన టొర్పొడోలను తిరిగి రికవరి చేయగల సామర్థ్యం కలిగిన అస్త్రధరిణిని తూర్పు నావికా దళ చీఫ్ రియర్ అడ్మిరల్ సతీష్‌సోనీ విశాఖపట్నం నేవల్ బేస్‌లో జరి గిన కార్యక్రమంలో మంగళవారం ప్రారంభించి జలప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వదేశీ పరిజ్ఞానంతో మరో యుద్ధనౌకను నిర్మించుకుని ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడించుకున్నామని, సముద్ర గర్భం లోనూ ప్రయోగించే విషయంలో మరో ముందడుగు వేశామని చెప్పారు. 95 శాతం స్వదేశీ పరిజ్ఞానం ఎన్ఎస్టీఎల్, షిప్‌యార్డ్‌లతో పాటు ఐఐటి ఖరగ్‌పూర్ సంయుక్తంగా ఈ నౌక నిర్మాణ డిజైన్‌ను రూపొందించారు. 50 మీటర్ల పొడవుతో 15 నాటికన్ మైళ్ల వేగంతో దూసుకుపోతుంది. ఈ నౌక ట్రయల్స్‌లో భాగంగానే పలు విధ్వంసకర టొర్పొడోలను ప్రయోగించి శక్తిసామర్థ్యాలను నిరూపించుకుంది. అధునాతన శక్తి వినియోగ విధానాన్ని అనుసంధానించుకుంటూ నావిగేషన్, సమాచార వ్యవస్థ పటిష్టతను కలిగిఉంది. మేకిన్ ఇండియా నినాదంతో 95 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంది. 2015 జూలై 17న సేవలనుంచి విరమించిన అస్త్రవాహినికి అధునాతన సాంకేతిత జోడించి నిర్మాణమైన నౌక అస్త్రధరిణి కావడం విశేషం. ఇద్దరు అధికారులు, 27మంది నావికులతో పాటు డీఆర్డీఓకు చెందిన 13 మంది సైంటిస్ట్‌లు ఈనౌకకు సేవలందించనున్నారు. ఈ నౌకను జలప్రవేశం చేయించేందుకు విచ్చేసిన ఈఎన్సీ చీఫ్ సతీష్సోనికి ఏపీ నావల్ ఆఫీసర్ ఇన్చార్జి కమాండర్ కె.ఎ. బొప్పన్న నావల్ జెట్టి వద్ద గౌరవ వందనంతో స్వాగతం పలికారు. కమాండింగ్ అధికారి దీపక్ సింగ్ బిస్త్‌కు జాతీయగీతాలాపనతో అస్త్రధరిణి నౌక పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ డీజీ డాక్టర్ వి.భుజంగరావు, ఎన్ఎస్టిఎల్ డైరక్టర్ సి.డి.మల్లేశ్వరరావు, గుజరాత్ రాష్ట్ర బరూచ్‌లోని షాఫ్ట్ షిప్‌యార్డ్ ప్రయివేట్ లిమిటెడ్ సీఎండీ సహాయ్‌రాజ్ పాల్గొన్నారు. -
తూర్పు నౌకాదళాదిపతిగా సతీశ్ సోని బాధ్యతలు
విశాఖ : తూర్పు నావికాదళం ప్రధాన అధికారిగా వైస్ అడ్మిరల్ సతీశ్ సోని సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. 2012 నుంచి దక్షిణ నౌకాదళాధిపతిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన భారత నౌకాదళంలోని పలు కీలక విభాగాల్లో పనిచేశారు. ఇప్పటివరకు విశాఖలో విధులు నిర్వర్తించిన వైస్ అడ్మిరల్ అనిల్ చోప్రా ముంబయి పశ్చిమ తీర నౌకాధిపతిగా బదిలీ అయ్యారు. చోప్రా నుంచి సతీశ్ సోని బాధ్యతలు స్వీకరించారు. -
ఉభయచర విమానం ప్రారంభం
ముంబై: రాష్ట్రంలోనే తొలిసారిగా సోమవారం సీ ప్లేన్ (ఉభయచరం) సేవలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర పర్యాటక శాఖ (ఎంటీడీసీ), మారిటైమ్ ఎనర్జీ హెలి ఎయిర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఈహెచ్‌ఏఐఆర్) సంయుక్త ఆధ్వర్యంలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పర్యాటక శాఖ మంత్రి ఛగన్ చంద్రకాంత్ భుజ్‌బల్ పచ్చజెండా ఈ సేవలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు ప్రధాన కార్యదర్శి సుమీత్ మల్లిక్, ఎంటీడీసీ మేనేజింగ్ డెరైక్టర్ జగదీష్ పాటిల్, సంయుక్త మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ సోని, ఎంఈహెచ్‌ఏఐఆర్ డెరైక్టర్ సిద్ధార్ధ వర్మ, యాంబివాలీ సిటీ సీఈఓ వివేక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యాటక మంత్రి ఛగన్ భుజ్‌బల్ మాట్లాడుతూ పర్యావరణ రంగం సిగలో ఇదొక కలికితురాయని అన్నారు. పర్యాటకులకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నామన్నారు. ఈ సేవలతో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కాగా రన్ వేలు లేకపోయినప్పటికీ నగరం నుంచి సమీపంలోని ఇతర ప్రాంతాలకు జలమార్గంద్వారా ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు ఇవి చేరవేస్తాయి. తొలి విడతలో భాగంగా యాంబీవ్యాలీ లోయ, ములా డ్యాం (మెహరాబాద్/షిర్డీ), పవనాడ్యాం (లోణవాలా), వరస్గావ్ డ్యాం (లావాసా), ధూం డ్యాం (పంచగని, మహాబలేశ్వర్) ప్రాంతాలకు సీ ప్లేన్ సేవలను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. వచ్చే నెల ఐదో తేదీనుంచి ప్రయాణికులు డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.ఎంఈహెచ్‌ఏఐఆర్.ఇన్ ద్వారా టికెట్లను కొనుగోలు చేయొచ్చు. ఈ సీ ప్లేన్ లో రెండు మోడళ్లు ఉన్నాయి. ఇందులో ఒకదానిలో నలుగురు, మరొక మోడల్లో తొమ్మిది మంది ప్రయాణించేందుకు వీలవుతుంది.