బాలికపై లైంగిక దాడి
పెద్దాపురం డీఎస్పీ విచారణ
సామర్లకోట (పెద్దాపురం) :
పట్టణంలోని ఒక బాలికపై ఒక యువకుడు లైంగిక దాడి చేశాడు. పోలీసులు, స్థానికుల కథ నం ప్రకారం ఈ బాలిక శని వారం సాయంత్రం ఇంటి ఎదురుగా ఉన్న కిరాణా షాపునకు బిస్కెట్లు కొనుగోలుకు వెళ్లింది. ఆ సమయంలో అక్కడకి వచ్చిన గంటా సుబ్బారావు ఆమె ఇంటి బాత్రూమ్లోకి తీసుకువెళ్లి లైంగిక దాడి చేశాడని స్థానికులు, బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెనుగులాటలో చెంపపై యువకుడు కొట్టడంతో ఆమె సృహ తప్పి పడిపోయిందన్నారు. సుమారు గంట తరువాత మెలకువ వచ్చిన తరువాత ఆమె బాత్రూమ్ తలుపు కొట్టడంతో.. ఆ ప్రాంతంలోని నీలం నవ్య, పురుషోత్తం వజ్రం వచ్చి ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. తల్లిదండ్రులు ఆదివారం ఉదయం స్థానికుల సహకారంతో పోలీసులను ఆశ్రయించారు. అదనపు ఎస్సై ఎస్.లక్షి్మకి ఈమేరకు బాలిక ఫిర్యాదు చేసింది. దీంతో పెద్దాపురం డీఎస్సీ ఎస్.రాజశేఖరరావు, సీఐ వీరయ్యగౌడ్, ఎస్సై ఆకుల మురళీకృష్ణ, వీఆర్వోలు సంఘటనా స్థలానికి చేరుకుని సమాచారం సేకరించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇలాంటి వ్యక్తిని ఉరి శిక్ష వేయాలని మానవ హక్కుల సంఘ జిల్లా అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ డిమాండ్ చేశారు. ఈ కేసు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ బాలికకు న్యాయం చేయాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ బాలాత్రిపుర సుందరి, అంగ¯ŒSవాడీ కార్యకర్తలు ఎంవీ శ్రీలక్ష్మీ, శ్యామల కోరారు.