ముఖ్యమంత్రి పీఎస్ అని పరిచయం చేసుకుని..
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ వ్యక్తిగత కార్యదర్శి అని పరిచయం చేసుకుని పలువురిని మోసం చేసిన సౌరభ్ వత్స్ అనే వ్యక్తిని (30) ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. తన పలుకుబడిని ఉపయోగించి పనులు చేసిపెడతానని చెప్పి కొందరి నుంచి సౌరభ్ డబ్బులు తీసుకున్నట్టు పోలీసులు చెప్పారు.
సీఎం వ్యక్తిగత కార్యదర్శిని అని చెప్పి సౌరభ్ తమను మోసం చేశాడని కొందరు ఫిర్యాదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. డెహ్రాడూన్‌లోని పటేల్ నగర్ ప్రాంతంలో సౌరభ్‌ను అతని ఇంట్లో అరెస్ట్ చేసినట్టు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడిని విచారిస్తున్నామని చెప్పారు.