సేవ్ ఉత్తరాంధ్రకు రెవెన్యూ ఉద్యోగుల సహకారం
సీఎంకు ఏపీ ఆర్ఎస్ఏ నేతల హామీ
విశాఖ రూరల్: సేవ్ ఉత్తరాంధ్ర పేరుతో తుపాను వల్ల నష్టపోయిన మూడు జిల్లాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్(ఏపీ ఆర్ఎస్ఏ) రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు సీఎం చంద్రబాబునాయుడుకు చెప్పారు. సీఎంను కలెక్టరేట్లో బుధవారం కలిశారు. తుపాను సహాయ కార్యక్రమాల్లో 1500 మంది రెవెన్యూ ఉద్యోగులు అహర్నిశలు పనిచేస్తున్నారని తెలిపారు.
సామాజిక బాధ్యతగా నష్టం పరిహారం అందించే విషయంపై త్వరలోనే జేఏసీలో చర్చిస్తామని, రెవెన్యూ ఉద్యోగులు, వారి బంధువులు, ఇతరుల నుంచి భారీగా విరాళాలు సేకరించి సీఎం సహాయ నిధికి అందజేస్తామని చెప్పారు. రెవెన్యూ అసోసియేషన్, ఉద్యోగులు చేస్తున్న కృషిని సీఎం అభినందించారు. సీఎంను కలసిన వారిలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్.నాగేశ్వరరెడ్డి, ఇతర ప్రతినిధులు ఉన్నారు.
నేడు పాడేరుకు సీఎం
విశాఖ రూరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం పాడేరు వెళుతున్నారు. ఉదయం గం.7.30కు నగరం నుంచి బయలల్దేరతతారు. అక్కడ తుపాను బాధితులను, కాఫీ పంట నష్టాన్ని పరిశీలించనున్నారు. అనంతరం తిరిగి నగరానికి రానున్నారు.