Sayantani Ghosh
-
అడవిని డిజైన్ చేసింది..
చీరకట్టును అందమైన పదాలతో కవితలను అల్లుతుంటారు కవులు. కానీ, సయంతీ ఘోష్ చీరల డిజైన్స్ చూస్తే మాత్రం పచ్చని అడవి తల్లి చెప్పే జ్ఞాపకాల కథల గొలుసును అల్లుకోవచ్చు. రంగు రంగుల పక్షులు, జంతువులు,పెద్ద పెద్ద వృక్షాలు, దట్టమైన ΄÷దలు, అందమైన లతలు... ఇవన్నీ డిజైన్లుగా చేరి సయంతీ కలెక్షన్‌ను ఆకర్షణీయంగా మార్చేశాయి. ఆ కథల డిజైన్ల సృజన వెనకాల కృషి మనమూ తెలుసుకుందాం.ఫ్యాషన్ డిజైనర్ సయంతీ ఘోష్ కలకత్తావాసి. తనపేరు మీదుగానే డిజైనర్ స్టూడియోను నడుపుతున్నారు ఆమె. అడవి, అందులోని జంతుజాలం నుంచి స్ఫూర్తి పొంది వైల్డ్ లైఫ్‌ను చీరలు, బ్లౌజుల మీదకు తీసుకువస్తున్నారు. ప్రకృతి అందాన్ని ఎంబ్రాయిడరీ ద్వారా చూపుతూ ఫారెస్ట్ డిజైన్స్‌ని ఆకట్టుకునేలా చూపుతోంది.‘‘సంప్రదాయ చేనేతలు, భారతీయ వస్త్రాలపైన థ్రెడ్‌వర్క్‌తో కూడిన హ్యాండ్ క్రాఫ్ట్ డిజైన్స్ రూపొందించడమే మా ప్రత్యేకత. డిజైన్ల ద్వారా కథలు చెప్పడం మా బ్రాండ్ గొప్పతనం. చిన్నతనంలో అందరం జంతువుల బొమ్మల పట్ల ఆకర్షితులం అయ్యేవాళ్లం. ఆ చిన్ని మనసు ఎప్పుడూ నాటి ఆనందాల చుట్టూతానే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ చిన్ననాటి జ్ఞాపకాలను సజీవంగా తీసుకు రావాలని చేసిన ప్రయత్నమే ఈ డిజైనర్ చీరలు, బ్లౌజులు.సృజనకు మొదటి కిటికీ..ముడి సిల్క్, మస్లిన్, ఆర్గన్జా, టస్సర్, ముగా సిల్క్.. వంటి ఫ్యాబ్రిక్స్ వాడుతున్నాం. అడవిని భూమికి ఊపిరితిత్తులుగా పిలుస్తారు. చిన్నప్పుడు మోగ్లీ (ది జంగిల్ బుక్) జీవితం, ప్రయాణాన్ని గురించి తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపేదానిని. ఆ యానిమేషన్ అందమైన, సృజనాత్మక ప్రపంచం నా ముందు తెరుచుకున్న మొదటి కిటికీ. జంగిల్ బుక్ మా ఇంటికి చాలా దగ్గరే అనిపించేది. అడవి, అందులోని జంతువులపై నా అభిమానాన్ని పెంచుకున్నాను.ఆ అడవి అందాన్ని చెక్కు చెదరకుండా ఉంచుతూ, చిన్ననాటి జ్ఞాపకాలు, ప్రకృతి పట్ల ప్రేమతో ప్రతిధ్వనించేలా నా కొత్త సేకరణ ఉండేలా చూసుకున్నాను. అంతేకాదు, చిన్నతనంలో మన హృదయాలలో గూడుకట్టుకున్న అడవిలోని స్నేహితులను ఇప్పటికీ ప్రేమించడం చాలా ముఖ్యం. ఆ అడవిలోని స్నేహితులు అంతరించి ΄ోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన అడవులు ఇంకా పచ్చదనంతో నిండాలి. ఈ ఆలోచనే నా డిజైన్స్ సృష్టికి మూలం.తొమ్మిదేళ్ల క్రితం..మొదట్లో మా హోమ్ గ్యారేజ్ స్పేస్‌లోనే బ్లౌజుల రూపకల్పనతో ఈ బ్రాండ్‌ను మొదలుపెట్టాను. అక్కణ్ణుంచి ఈ రోజు వరకు భారతదేశం అంతా ప్రత్యేక యూనిట్లను నడుపుతున్నాను. మెషిన్ ఎంబ్రాయిడరీ, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, జమ్దానీ, కలంకారీ, ఎకో–ప్రింటింగ్, మధుబని, హ్యాండ్ పెయింటింగ్, బాతిక్, పిచ్వాయి.. వంటి పన్నెండు టెక్నిక్‌లతో డిజైన్ చేస్తాను. నా రోజువారి జీవితమంతా ప్రకృతి, వాస్తు శిల్పం నుంచి స్ఫూర్తిæ పొందుతూ ఈ డిజైన్స్ సృష్టిస్తుంటాను’’ అని వివరిస్తుంది సయంతీ.– సయంతీ ఘోష్ -
అదే ప్రశ్న నేను అడిగితే ముఖం ఎక్కడ పెట్టుకుంటావ్?
సోషల్ మీడియా వాడకం పెరిగాక ఈ మధ్య సినీతారలకు ఇబ్బందులు ఎక్కువయ్యాయి. పబ్లిక్‌గా చెత్త కామెంట్లు చేయడానికి సైతం కొందరు నెటిజన్లు వెనకడుగు వేయడం లేదు. కొందరు స్టార్స్ వీటిని చూసీ, చూడనట్లు వదిలేస్తుంటే..మరికొందరు మాత్రం తగిన సమాధానం చెప్పి వాళ్ల నోరు మూయిస్తారు. తాజాగా టీవీ నటి సయాంతనీ ఘోష్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. బుధవారం(నిన్న)ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజు ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో ఫ్యాన్స్‌తో ముచ్చటించిన ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఆరోగ్యం, పాజిటివ్ ఆటిట్యూడ్ వంటి విషయాలపై నెటిజన్లతో చర్చిస్తుండగా, అందులో ఓ నెటిజన్ తన వంకర బుద్దిని బయటపెట్టాడు. నీ లోదుస్తుల సైజ్ ఎంత అడిగిన నెటిజన్‌కు సయాంతనీ దిమ్మతిరిగే జవాబిచ్చింది. 'ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో నాకు అర్థమైంది. నువ్వు మానసికంగా ఇంకా ఎదగాలి. నువ్వు నా లో దుస్తుల సైజు అడిగావు.. నేను కూడా నీ అంగం సైజు ఎంత అని అడిగి ఉంటే అప్పుడు నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు? సైజుల గురించి మాట్లాడుకోవడం ఇకనైనా ఆపేయాలి. గతంలో నాకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. మగవాళ్లు నా వక్షోజాలను తదేకంగా చూస్తున్నప్పుడు నేను చాలా అసౌకర్యానికి గురయ్యాను. View this post on Instagram A post shared by Sayantani (@sayantanighosh0609) ఇక చాలు..మనల్ని మనం ప్రేమించాల్సిన అవసరం చాలా ఉంది. మన శరీరం ఎలాంటి సైజ్‌లో ఉన్నా దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఎవరైనా మిమ్మల్ని అగౌరవించాలని చూసినా, బాడీ షేమింగ్ చేసినా వారికి గట్టి బదులివ్వండి' అంటూ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది. ఇక సయాంతనీ చేసిన ఈ పోస్ట్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. మీరు ఇచ్చిన రిప్లై చాలా ఇంప్రెసివ్‌గా ఉందంటూ సయాంతనీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఘర్ ఏక్ సప్నా, నాగిని వంటి సీరియల్స్‌తో సయాంతనీ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. చదవండి : న్యూడ్ ఫోటో అడిగిన నెటిజన్.. అలా చేస్తే ఓకే అన్న ప్రియమణి న్యూడ్ ఫోటో అడిగిన నెటిజన్..షేర్ చేసిన యాంకర్ -
నథింగ్ స్పెషల్.. టెరెన్స్తో డేటింగా..!
ఉండబట్ట లేకో... మరేదన్నా ఊహించుకున్నాడో గానీ... ‘టెరెన్స్ లూయీస్‌తో మీరు డేటింగ్ చేస్తున్నారట కదా’ అని టీవీ స్టార్ సయంతాని ఘోష్‌ను ఠక్కున అడిగేశాడొకాయన. మరీ అంత డెరైక్ట్ ప్రశ్నకు లోపల ఎలా ఫీలైనా... బయటకు మాత్రం ‘అలాంటిదేమీ లేద’ంటూ కూల్‌గా బదులిచ్చిందీ భామ. ‘మేమిద్దరం కలిసి కాఫీకో, డిన్నర్‌కో వెళ్లాలని ఏడాదిగా ప్లాన్ చేస్తున్నాం. కానీ ఇప్పటి వరకు కుదరలేదు. మా ఇద్దరి గురించీ చాలాచాలానే రాస్తున్నారు. కానీ కలిసింది లేదు’ అంటూ గోడు వెళ్లబోసుకుంది.