ఎస్బీఐ డిపాజిట్ రేట్లపై అర శాతం కోత
6.25 శాతానికి తగ్గింపు
ముంబై: ఇప్పటికే వడ్డీ రేట్లు కనిష్ట స్థాయిల్లో కొనసాగుతుండగా ప్రభుత్వ రంగ ఎస్బీఐ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను అరశాతం మేర తగ్గిస్తూ సోమవారం అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించిం ది. రూ.కోటి లోపు విలువగల మధ్య కాల, దీర్ఘకాల టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. సవరించిన వడ్డీ రేట్లు తాజాగా చేసే డిపాజిట్లు, గత డిపాజిట్ల పునరుద్ధరణకు ఏప్రిల్ 29 నుంచి వర్తిస్తుందని ఎస్బీఐ తెలిపింది. కాగా, బ్యాంకు ఎంసీఎల్ఆర్లో ఎటువంటి మార్పులేదు. ఏడాది ఎంసీఎల్ఆర్ 8%. నోట్: ఏడాది నుంచి 455 రోజుల టర్మ్ డిపాజిట్‌పై మాత్రం 6.90% వడ్డీని ఆఫర్ చేస్తోంది.