టీమ్ టెన్నిస్ చాంప్ ఎస్‌బీఓఏ
సౌత్‌జోన్ సీబీఎస్ఈ ఇంటర్ స్కూల్ టోర్నీ
హైదరాబాద్: సౌత్‌జోన్ సీబీఎస్ఈ ఇంటర్ స్కూల్ టెన్నిస్ టోర్నమెంట్లో తమిళనాడుకు చెందిన ఎస్‌బీఓఏ అమ్మాయిల జట్టు అండర్-14 విభాగంలో విజేతగా నిలిచింది. ఇండస్ యూనివర్సల్ స్కూల్లో సోమవారం జరిగిన బాలికల టీమ్ ఈవెంట్ ఫైనల్లో ఎస్‌బీఓఏ జట్టు 2-1తో డీపీఎస్ (బెంగళూరు)పై గెలుపొందింది. తొలి సింగిల్స్‌లో దీపాలక్ష్మి (ఎస్‌బీఓఏ) 1-8తో సంస్కృతి చేతిలో పరాజయం చవిచూడగా... రెండో సింగిల్స్‌లో అనన్య (ఎస్‌బీఓఏ) 8-6తో రష్మీపై గెలిచింది. నిర్ణాయక డబుల్స్‌లో అనన్య-దీపాలక్ష్మి (ఎస్‌బీఓఏ) జోడి 8-3తో సంస్కృతి-రష్మి జంటపై విజయం సాధించింది.