ఎస్సీ వర్గీకరణ కోసం కలిసిరావాలి
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ
వరంగల్ : షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ కో సం జరుగుతున్న సమరంలో అందరూ స్వ చ్ఛందంగా కలిసిరావాలని ఎమ్మార్పీఎస్ వ్య వస్థాపకుడు మంద కృష్ణమాదిగ అన్నారు. శుక్రవారం హన్మకొం డలోని హరితకాకతీ య హోటల్లో ఏర్పా టు చేసిన కుల సంఘా లు, ప్రజా సం ఘాలు, మేధావుల సన్నాహ క సదస్సులో ఆయన మాట్లాడారు. 35కు పైగా కుల, ప్ర జా సంఘాల నాయకులు హా జరై తమ సంపూర్ణ మద్దతు ప్రకటించడం అభినందనీయమని అన్నారు.
సీనియర్ ప్రొ ఫెసర్, రైతు సంఘం నాయకులు కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ న్యాయంగా జరుగుతున్న ఎస్సీ వర్గీకరణ ఉద్యమం అంతి మదశలో ఉందని ఇందుకు అన్ని వర్గాల ప్రజ ల నుంచి మద్దతు కావాలని కోరారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రస్థానంలో తమ పోరాటా లు కేవలం మాదిగల పక్షానే కాక సమాజంలో ని అన్ని వర్గాల క్షేమం కోసం చేసినట్లు తెలిపా రు. వారి పోరాటాల ఫలితంగానే ప్రభుత్వా లు పలు పథకాల రూపకల్పన చేశారని పేర్కొన్నారు. ప్రొఫెసర్ సారంగపాణి మాట్లాడుతూ ఇదే ఐక్య చాటే సమయమని, ఇప్పుడే ఎస్సీ వర్గీకరణ సాధించే దశలో ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు తిరుణహరిశేషు, మహాజన జేఏసీ వ్యవస్థాపకుడు రాజమౌళి, ఎల్‌హెచ్‌పీఎస్ నాయకులు జైసింగ్‌రాథోడ్ పాల్గొన్నారు.