బస్సులు లేక విద్యార్థుల అవస్థలు
గుమ్మిడిపూండి, న్యూస్‌లైన్: పాఠశాల సమయాల్లో తగినన్ని ఆర్డినరి బస్సులు లేకపోవడంతో ప్రమాదమని తెలిసినా విద్యార్థులు బస్సులకు వేలాడుతూ ప్రయాణం సాగిస్తున్నారు. పెరియపాలెం, ఊత్తుకోట, కన్నిగైపేర్ ప్రాంతాల మధ్య తగినన్ని ఆర్డనరి బస్సు సర్వీసులు లేవు.
పెరియపాలెంలోని ప్రభుత్వ మహోన్నత పాఠశాలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది మంది విద్యార్థులు వెళుతుంటారు. వీరికి ప్రభుత్వం ఉచిత బస్సు పాస్‌లు ఇచ్చింది. ఈ మార్గంలో ఆర్డనరి సర్వీసులు లేవు. ఎప్పుడో ఒకటి వస్తుంది. పాఠశాలకు సరైన సమయంలో వెళ్లేందుకు విద్యార్థులు బస్సు కిటికీలు, డోరు వద్ద వేలాడుతూ ప్రయాణం చేస్తున్నారు.
బస్సు సర్వీసులు పెంచాలని గతంలో పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేదు. ప్రస్తుతం పరీక్షల సమయం కావడంతో విద్యార్థులు అవస్థలు ఎక్కువయ్యాయి. పరీక్షల్లో హాజరైనందుకు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు ఈ మార్గాల్లో బస్సు సర్వీసులను పెంచాలని విద్యార్థులు, ప్రయాణికులు కోరుతున్నారు.