ఇంటెల్ సైన్స్ పోటీలో 8మంది భారతీయ అమెరికన్లు
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్లో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఇంటెల్ సైన్స్ టాలెంట్ సర్చ్ కాంపీటీషన్లో 40 మంది
సైన్స్ టాలెంట్ ఫైనలిస్టు విద్యార్థులు పోటీపడుతుండగా, వారిలో 8మంది భారతీయ అమెరికన్ విద్యార్ధులు ఉన్నారు. వాషింగ్టన్లో మార్చి 7నుంచి 13వరకు జరిగే వాషింగ్టన్ టాలెంట్ సర్చ్ కాంపీటీషన్లో ఈ 40మంది విద్యార్థులు పోటీపడుతున్నారు. అయితే వీరిలో టాప్ విజేతగా నిలిచే విద్యార్థికి ఇంటెల్ ఫౌండేషన్ తరపునా లక్ష డాలర్ల బహుమతిని అందజేస్తారు. సైన్స్ టాలెంట్ ఫైనలిస్టులుగా పోటీపడుతున్న 8మంది భారతీయ అమెరికన్ విద్యార్థులలో విష్ణు శంకర్, శ్రియా మిశ్రాలు కాలిఫోర్నియాకు చెందినవారు, చికాగో నుంచి రాహుత్ సిద్ధార్థ మెహతా, జార్జీయాకు చెందిన అనంద్ శ్రీనీవాసన్, మస్కట్ నుంచి అజయ్ సైనీ, న్యూయార్క్ నుంచి అనుభావ్ గుహా, ప్రితీ కాకానీలు ఉన్నారు.
ఇదిలా ఉండగా, అమెరికాలో 40 ఉన్నత పాఠశాలలకు సీనియర్లు కావాలని, భవిష్యత్తులో ప్రపంచ అత్యుత్తమ సవాళ్లు ఎదుర్కోవడానికి వీరి సహాయం అవసరమవుతుందనే ఉద్దేశ్యంతో ఈ కాంపీటీషన్ నిర్వహించనున్నట్టు ఇంటెల్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెండీ హకీన్స్ పేర్కొన్నారు. అయితే ఈ పోటీకి మొత్తం 1,700మంది పోటీపడగా, సెమీఫైనల్లో 300మంది విద్యార్థులను ఎంపికచేసినట్టు చెప్పారు. వారిలో 40మంది విద్యార్థులను మాత్రమే ఫైనల్కు ఎంపిక చేసినట్టు ఇంటెల్ నివేదిక వెల్లడించింది. శాస్త్రీయపరమైన విధానాలపై అభివృద్ధి సాధించడం, భవిష్యత్తులో రాబోయో సమస్యలను ఎలా పరిష్కరించాలి అనే అంశాలపై నైపుణ్యాన్ని సంపాదించేలా ది ఇంటెల్ సైన్స్ టాలెంట్ సర్చ్ విద్యార్థులను ప్రోత్సహిస్తోంది. ఈ పోటీలో పాల్గొనే అభ్యర్థుల శాస్త్రీయ పరిశోధన నైపుణ్యంపై, వారు సాధించిన విజయాలు, నాయకత్వ లక్షణాలను ఆధారంగా ఇంటెల్ నిర్వహణ అధికారులు ఎంపిక చేస్తారు.