on screen pair
-
ఆ నటుడు బెస్ట్ కిస్సర్..
నియా శర్మ-రవి దూబే ఆన్‌స్క్రీన్ మీద బాగా ఫేమస్ అయిన జంట. వెండితెర మీద ముద్దులు, హగ్గులు ఇచ్చుకునే ఈ జంట జమాయి 2.0లో లిప్‌లాక్‌కు సైతం వెనుకాడలేదు. ఈ వెబ్ సిరీస్‌లో ఈ జోడీ అండర్వాటర్లోనూ ముద్దులాడుతూ రెచ్చిపోయింది. ఇటీవల దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2021కు హాజరైన నియాశర్మ తన కో స్టార్ రవి గురించి మాట్లాడుతూ అతడు బెస్ట్ కిస్సర్ అని బిరుదిచ్చింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారగా ఇది చూసి రవి దంపతులు షాకయ్యారు. కానీ ఆ సన్నివేశాల్లో నటించడానికి ఇబ్బంది పడకుండా స్పోర్టివ్‌గా తీసుకోవడాన్ని మెచ్చుకున్నారు. ఈ మేరకు రవి మాట్లాడుతూ.. "నేను, నా భార్య సర్గమ్ ఇద్దరికీ నియా అంటే ఇష్టం. ఆమె నా గురించి మాట్లాడిన వీడియో చూసి బాగా నవ్వుకున్నాం. నన్ను బెస్ట్ కిస్సర్ అని పిలవడాన్ని ఓ ప్రశంసగా తీసుకుంటా. అంతే తప్ప దాన్ని నెగెటివ్‌గా ఏం తీసుకోము. ఏదేమైనా నియా నా బెస్ట్, ఫేవరెట్ కో స్టార్" అని చెప్పుకొచ్చాడు. అతడు నియా గురించి చెప్తూ రొమాంటిక్ సన్నివేశాలు నేచురల్‌గా రావడానికి ఆమె చాలా సహకరిస్తుంది. దీనివల్ల రెండో సీజన్లో క్లోజ్ సీన్లలో నటించడం చాలా ఈజీ అయింది. కాగా టీవీ సీరియల్ జమాయి రాజాకు సీక్వెల్‌గా వచ్చిందే జమాయి 2.0. ఈ వెబ్ సిరీస్ హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో పాటు నటీనటులకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇదిలా వుంటే ఉదారియన్ టీవీ షోతో నిర్మాతగా మారారు రవి దంపతులు. చదవండి: విడాకులు తీసుకుందామనుకున్నాం.. బిగ్‌బాస్ మళ్లీ కలిపింది వీడియోకాల్ మాట్లాడుతుండగా నటి రూమ్‌లోకి.. -
షారుక్ కొడుకు, ఐశ్వర్య కూతురు కలిసి నటిస్తే!
అందాల తార ఐశ్వర్యారాయ్ నోట్లోంచి ఊడి పడినట్లుండే ఆరాధ్యా బచ్చన్ ఇప్పటికే పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. గట్టిగా నాలుగేళ్లు ఉన్నాయో లేవో.. అప్పుడే ఆమె వెండితెర ప్రవేశం గురించిన చర్చలు మొదలైపోయాయి. అలాగే.. షారుక్ ఖాన్ కొడుకు అబ్రామ్ గురించి కూడా వినిపిస్తున్నాయి. నిజానికి బాలీవుడ్లో బాగా సెలబ్రిటీలుగా మారిపోయిన పిల్లలు ఎవరంటే వీళ్లిద్దరే. భవిష్యత్తులో వీళ్లిద్దరూ ఆన్‌స్క్రీన్ మీద మంచి జంట అవుతారని షారుక్ ఇప్పటినుంచే కలలు గంటున్నాడు. సీనియర్ బచ్చన్ అమితాబ్ కూడా దానికి సై అంటున్నారు. ఇటీవల దిల్వాలే సినిమా ప్రమోషన్ సందర్భంగా షారుక్ మాట్లాడుతూ, స్క్రీన్ మీద తాను- కాజోల్ మంచి జంట అని, భవిష్యత్తులో అబ్రామ్ - ఆరాధ్య మంచి జంట అవుతారని అన్నాడు. ఈ మాట విని ఆరాధ్య తాత అమితాబ్ బచ్చన్ ఉప్పొంగిపోయారట. నిజంగా షారుక్ ఆ మాట అని ఉంటే ఆయన నోట్లో నెయ్యి, చక్కెర, పాల మీగడ అన్నీ వెయ్యాలని అన్నారు. అంటే, పెద్దాయన కూడా పచ్చజెండా ఊపేశారన్న మాట. వజీర్ సినిమా గురించి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కొసమెరుపు: ఐశ్వర్యా రాయ్ కూతురు ఆరాధ్యా బచ్చన్ (4) కంటే.. షారుక్ ఖాన్ కొడుకు అబ్రామ్ (2) రెండేళ్లు చిన్నవాడు.