విపత్తులను ధైర్యంగా ఎదుర్కోవాలి
రామలింగాపురం (విడవలూరు) : సముద్రతీరం వెంబడి ఉన్న మత్స్యకారులు, ఇతరులె విపత్తుల సమయంలో ధైర్యంగా ఉండి, వాటిని ఎదుర్కోవాలని చైతన్య జ్యోతి వెల్ఫేర్ సోసైటీ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని రామతీర్ధం పంచాయతీ పరిధిలో ఉన్న రామలింగాపురం మత్స్యకార గ్రామంలో మంగళవారం అవగాహన సదస్సును ఏర్పాటుచేశారు. ఆయన మాట్లాడుతూ విపత్తుల సమయంలో మహిళలు, చిన్నారులు, వద్ధులను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా యువతని ప్రొత్సహించడమే సోసైటీ ఉద్ధేశమన్నారు. ఇందులో భాగంగా రామలింగాపురం గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగిందన్నారు. గాయపడిన వారిని ఏ విధంగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలో ప్రయోగాత్మకంగా వివరించారు. బాల్య వివాహాలను అడ్డుకోవడంతో పాటు బాలకార్మికులను గుర్తించి వారికి విద్య అందించడం జరుగుతుందన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కషిచేస్తామన్నారు.