seat ticket
-
నెల్లూరు సిటీ సీటుపై టీడీపీ, జనసేన మడత పేచీ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో టీడీపీ, జనసేన పొత్తులో టికెట్ అంశం కుంపటి రాజేస్తోంది. పొత్తులో భాగంగా నెల్లూరు నగర సీటును జనసేన ఆశిస్తోంది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్‌రెడ్డికి టికెట్ ఇస్తారని గతంలో ప్రచారం జరిగింది. నాదెండ్ల మనోహర్‌తో ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలతో పాటు ఆర్థికపరమైన లావాదేవీలు ఉండడంతో తప్పకుండా సీటు జనసేనకేనన్న ధీమా ఉంది. దీంతో ఆయన నగర నియోజకవర్గంలో సొంతంగానే ప్రచారం చేసుకుంటున్నారు. అయితే టీడీపీ మాత్రం నగర సీటు మాజీ మంత్రి నారాయణకేనని చెబుతుండడంతో ఇరు పార్టీల్లోనూ సందిగ్ధం నెలకొంది. మరోవైపు జనసేన తరపు నుంచి జానీమాస్టర్ పేరు తెరపైకి రావడంతో మరింత అయోమయం నెలకొంది. దీని వెనుక రాజకీయం నెరుపుతున్నది టీడీపీయేనన్నది బహిరంగ రహస్యమని జనసేన నేతలు మండి పడుతున్నారు. అనూహ్యంగా తెరపైకి జానీ మాస్టర్ నెల్లూరుకు చెందిన సినిమా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అనూహ్యంగా జనసేన తరుపున తెరపైకి వచ్చాడు. పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితుడైన జానీ మాస్టర్ నెల్లూరులోనే మకాం వేసి పలు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇటీవల అంగన్వాడీ కార్యకర్తల దీక్షలోకి ఎంట్రీ ఇచ్చి మీడియా ముందుకు వచ్చారు. రెండ్రోజుల క్రితం నెల్లూరులో జనసేన కార్యకర్తలతో సమావేశమయ్యారు. జనసేనలో అగ్గి రాజేసిన టీడీపీ నగర సీటుపై జనసేన కన్నేసిన క్రమంలో ఆ పార్టీ నేతల మధ్య టీడీపీ అగ్గి రాజేసింది. పార్టీ ఆవిర్భావం నుంచి నమ్ముకుని ఉన్న మనుక్రాంత్‌రెడ్డి నగర సీటు ఆశిస్తున్న క్రమంలో అతన్ని తప్పించేందుకు నారాయణ అనుకూల టీం ఎత్తుగడ వేసింది. మనుక్రాంత్ను నెల్లూరు నగరం నుంచి రూరల్ వైపు మళ్లించేలా ప్రయత్నాలు చేసింది. ఇది పసిగట్టిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రంగంలోకి దిగి మనుక్రాంత్తో రహస్య చర్చలు జరిపారు. రూరల్ సీటు వైపు కన్నెత్తి చూడొద్దని, నారాయణ కంటే తానే ఎక్కువగా ఉపయోగపడతానని మనుక్రాంత్‌కు హితోపదేశం చేశారని తెలిసింది. మరోవైపు నారాయణ టీం స్వయంగా రంగంలోకి దిగి తన సామాజిక వర్గ కీలక నేతల ద్వారా పవన్ కుటుంబ సభ్యులతో చర్చలు జరిపింది. నగరం కాకుండా రూరల్ సీటుపై దృష్టిపెడితే అందుకు ప్రత్యేక ప్యాకేజీతో పాటు అభ్యర్థికి కావాల్సిన ఎన్నికల ఖర్చు తనదేనంటూ సందేశం పంపారు. దాంతో పాటు మనుక్రాంత్‌కు నాదెండ్ల వర్గం ముద్రవేసి ఎప్పుడైనా పార్టీ ఫిరాయించే అవకాశం ఉందని చాడీలు చెప్పి అతన్ని తప్పించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలను పసిగట్టిన నారాయణ వ్యతిరేకవర్గం పవన్‌కు సన్నిహితుడిగా ఉన్న జానీమాస్టర్‌ను ఉసిగొల్పింది. జానీతో మైండ్ గేమ్ నెల్లూరుకు చెందిన జానీమాస్టర్‌తో ప్రస్తుతం నారాయణ టీం మైండ్‌గేమ్ ప్రారంభించింది. జానీతో అంటకాగే జనసేనకు చెందిన ఓ చోటా నేత నారాయణ కాంపౌండ్‌కు చెందిన వ్యక్తి. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఆ చోటా నేతకు ఇప్పటికే రూ.30 లక్షల విలువైన వాహనాన్ని ఉచితంగా ఇచ్చారు. జనసేనలోనే ఉంటూ ఆ పార్టీలో జరిగే అన్ని విషయాలు, రహస్యాలను నారాయణకు చేరవేయడం ఆ చోటా నేత పని. జానీ మాస్టర్‌తో అంటకాగుతూ ఎలాగైనా ఆయన్ని నెల్లూరు రూరల్ సీటు వైపు మళ్లించేలా చేసేందుకు ప్రత్యేక ప్యాకేజీ కూడా కేటాయించారన్న ప్రచారం ఉంది. ఎల్లో మీడియాలో ప్రచారం ఓ వైపు జనసేనలో వర్గ రాజకీయాలకు ఆజ్యం పోసిన టీడీపీ టీం తాజాగా నెల్లూరు నగర సీటు మాజీ మంత్రి నారాయణకే ఖరారు చేసినట్లుగా టీడీపీ అనుకూల పత్రికలో కథనం రాయించారు. సోషల్ మీడియాల్లోనూ నారాయణకే నెల్లూరు సీటు అంటూ పోస్ట్‌లు పెట్టిస్తున్నారు. నెల్లూరు సీటుపై జనసేన ఒత్తిడి తెస్తున్న క్రమంలో ఇలా లీకులతో మైండ్ గేమ్ ప్రారంభించారు. టీడీపీ మైండ్ గేమ్‌లో చిక్కుకుని జనసేననేతలు విలవిల్లాడిపోతున్నారు. -
సీట్ల కోసం గొడవ.. దారుణంగా కొట్టుకున్న మహిళలు
సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించగా.. దాదాపు బస్సులన్నీ మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి. కూర్చునేందుకు సీట్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంటుండటంతో పలుచోట్లా గొడవలు జరుగుతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో కూడా ఇదే ఘటన చోటుచేసుకుంది. సీటు కోసం ఇద్దరు మహిళలు తిట్టుకోవడం తో పాటు జుట్టుపట్టుకుని మరీ కొట్టుకున్నారు. ఫ్రీ బస్ ఎఫెక్ట్!! జహీరాబాద్ నుండి సంగారెడ్డికి వస్తున్న ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం గొడవ.. దారుణంగా కొట్టుకున్న మహిళలు. pic.twitter.com/ah7wceH6vl — Telugu Scribe (@TeluguScribe) January 1, 2024 దీంతో బస్సులోని గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీయగా.. అది కాస్త సోషల్ మీడియాలోకి ఎక్కి చక్కర్లు కొడుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. సోమవారం ఉదయం జహీరాబాద్ నుంచి సంగారెడ్డి వెళ్లేందుకు పల్లెవెలుగు బస్సు బస్టాండ్‌కు వచ్చింది. ఇప్పటికే ఎక్కువగా రష్ ఉంటుండటం, సీట్ల కోసం పోటీ ఏర్పడుతుండటంతో ఓ మహిళ బస్సు ఆగగానే కిటికీలో నుంచి కర్చీఫ్ వేసింది. బస్సు ఆగిన అనంతరం పెద్ద సంఖ్యలో మహిళలు బస్సులోకి ఎక్కారు. బస్సులోనే కొట్లాట ఇద్దరు తిట్టుకుంటూనే జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. బస్సులో ఉన్న మిగతా మహిళలు, పురుషులు సర్ది చెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఇద్దరూ సీటు కోసం కొట్లాడుకుంటుండటంతో బస్సులో ఉన్న మిగతా ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సర్దిచెప్పినా వినకుండా గొడవ పడుతుండటంతో గందరగోళానికి గురయ్యారు. చివరకు బస్సులో ఉన్న ప్రయాణికులు ఇద్దరి మధ్య కలగజేసుకుని సర్ది చెప్పడంతో గొడవకు ఫుల్ స్టాప్ పడింది. -
ఇండిపెండెంట్‌గా జశ్వంత్ పోటీ
నేడు బార్మర్ నుంచి నామినేషన్ పార్టీ అభ్యర్థిగానా కాదా అన్నది వారే తేల్చాలి పార్టీలో విభేదాలున్నాయి... అవి తిరుగుబాట్లుగా మారొచ్చు జోధ్‌పూర్: బీజేపీ తనకు టికెట్ ఇవ్వకపోవడంపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తంచేసిన ఆ పార్టీ ప్రముఖుడు జశ్వంత్ సింగ్(76) తన సొంత నియోజకవర్గం బార్మర్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగనున్నట్లు ఆదివారమిక్కడ ప్రకటించారు. ‘‘అవును, నేను రేపు బార్మర్ నుంచి నామినేషన్ వేస్తున్నాను. స్వతంత్ర అభ్యర్థా కాదా అన్నది పార్టీ వైఖరిపై ఆధారపడి ఉంటుంది’’ అని ఆయన అన్నారు. ప్రస్తుతం డార్జిలింగ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న జశ్వంత్.. బార్మర్ సీటు టికెట్‌ను తనకు కాకుండా కాంగ్రెస్ నుంచి వచ్చిన సోనారామ్ చౌదరికి ఇవ్వడంపై శనివారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పార్టీకి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించగా.. ‘‘నేను పార్టీకి 48 గంటల గడువిచ్చాను. అయితే ఇంతవరకు నన్నెవరూ పార్టీ తరఫున సంప్రదించలేదు. నా సహచరులు, సన్నిహితులతో మాట్లాడి పార్టీలో ఉండాలా లేదా అన్నది నిర్ణయించుకుంటాను’’ అని అన్నారు. తన సొంత నియోజకవర్గంపై, తన సొంత ప్రజలపై తాను సెంటిమెంటల్‌గా లేకపోతే, ఇక ఏ విషయంలో ఉండాలని ఆయన ప్రశ్నించారు. మీ సేవలను తదనుగుణంగా వినియోగించుకుంటామని రాజ్‌నాథ్ సింగ్ అంటున్నారని అనగా.. తానేమీ ఫర్నీచర్‌ను కాదన్నారు. పార్టీ గెలిచాక ప్రభుత్వంలో ఏదైనా పదవి ఇస్తారన్న వార్తలపై ప్రశ్నించగా.. అలాంటిదేమీ తనకు అవసరం లేదని, వాళ్ల దగ్గరే ఉంచుకోమని అన్నారు. రాజస్థాన్‌లో జశ్వంత్ మద్దతుదారులు నరేంద్ర మోడీ పోస్టర్లను చించేయడంపై ప్రశ్నించగా.. దీన్ని బట్టి ఏం జరుగుతోందన్నది పార్టీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సర్దుబాటు రాజకీయాలు తనకు పడవన్నారు. అంతర్గత కుమ్ములాటల వల్ల బీజేపీ నష్టపోతుందని చెప్పారు. పార్టీలో విభేదాలు బయటపడుతున్నాయని, ఇవి తిరుగుబాట్లుగా మారే అవకాశముందని, పార్టీ ముందే మేలుకుంటే మంచిదని అన్నారు. తండ్రి వెంటే తనయుడు! జశ్వంత్ సింగ్ కుమారుడు, రాజస్థాన్ ఎమ్మెల్యే మన్వీంద్ర సింగ్.. తన తండ్రి అడుగుజాడల్లోనే నడిచే అవకాశముందని సంకేతాలిచ్చారు. రాజస్థాన్ సీఎం వసుంధర రాజే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తలపెట్టిన సమావేశానికి ఆయన ఉద్దేశపూర్వకంగా గైర్హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అనారోగ్యం రీత్యా ఆయన నెలపాటు సెలవు తీసుకున్నట్లు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అశోక్ పర్ణమి తెలిపారు. జశ్వంత్‌కు మద్దతుగా బీజేపీ కార్యకర్తల ఆందోళన జశ్వంత్‌కు టికెట్ ఇవ్వకపోవడానికి నిరసనగా పలువురు బీజేపీ జిల్లా కమిటీ సభ్యులు ఆదివారం పార్టీ కార్యాలయంలోకి చొచ్చుకొచ్చారు. సమావేశం నిర్వహించి.. జశ్వంత్‌కు బార్మర్ టికెట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కాదు’ అన్న దాన్నీ నవ్వుతూ స్వీకరించాలి: జైట్లీ జశ్వంత్ ఇప్పటికే పార్టీలో పలు పదవులు అనుభవించారని, పార్టీ పట్ల ఆయన విధేయతకు ప్రస్తుత పరిస్థితులు పరీక్షలాంటివని బీజేపీ నాయకుడు అరుణ్ జైట్లీ అన్నారు. పార్టీ ‘కాదు’ అని చెప్పినప్పుడు దాన్ని కూడా ఆయన నవ్వుతూ స్వీకరించాలన్నారు. స్వతంత్ర బరిలో మరో నేత!: రాజస్థాన్‌లోని సికార్ లోక్‌సభ టికెట్‌ను నిరాకరించినందుకు మరో సీనియర్ బీజేపీ నేత సుభాష్ మహారియా సైతం స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు ఆదివారం ప్రకటించారు. 26న ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు.