ప్రత్యేక హోదా కోసం సెల్ టవర్ ఎక్కాడు
గుంటూరు : 'రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తేనే కిందకు దిగి వస్తా... ఎవరైనా పైకి వచ్చేందుకు ప్రయత్నిస్తే దూకేస్తా' ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఓ వ్యాపారి డిమాండ్. గుంటూరు నగరంలోని సీతానగరంకు చెందిన రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ శనివారం నగరం సమీపంలోని వాసవీనగర్లో ఓ సెల్ టవర్ ఎక్కాడు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తేనే దిగుతానని పెకైక్కి కూర్చున్నాడు. సమాచారం అందుకున్న పోలీసు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. టవర్పైనున్న వ్యక్తి కిందకు దూకితే కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
(పెదకాకాని)