'హైదరాబాద్‌లో మరో విమానాశ్రయం'
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మరో విమానాశ్రయాన్ని నిర్మించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. వచ్చే ఏడాది మెట్రోరైలు మొదటి దశ ప్రయాణాలు ప్రారంభం అవుతాయన్నారు.
మెట్రోరైలు మార్గాన్ని మొత్తం 200 కిలోమీటర్ల వరకు విస్తరిస్తామని తెలిపారు. ప్రణాళికా సంఘం స్థానంలో వచ్చిన నీతి ఆయోగ్‌తో రాష్ట్రాలకు భాగస్వామ్యం పెరిగిందని సీఎం కేసీఆర్ చెప్పారు.