Second One Day match
-
రెండో వన్డేలో భారత్ ఓటమి
-
సిరేసులో ఉండాలంటే...
పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి. ఇప్పుడు కోహ్లి బృందం కూడా అదే చేయాలి. సిడ్నీలో ఎదురైన ఓటమికి... ఈ సిడ్నీలోనే విజయంతో ఆసీస్‌కు సమాధానం ఇవ్వాలి. అప్పుడే సిరీస్‌లో ఉంటాం. లేదంటే క్లీన్‌స్వీప్ దారిలో పడిపోతాం. సిడ్నీ: తొలి వన్డే ఓటమితో సిరీస్‌లో వెనుకబడిన భారత జట్టు ఇప్పుడు రేసులో నిలిచే పనిలో పడింది. ఇక్కడే జరిగే రెండో వన్డేలో గెలవాలనే పట్టుదలతో ఉంది. ఐపీఎల్ పొట్టి ఫార్మాట్ నుంచి, గత మ్యాచ్‌లో చేసిన పొరపాట్ల నుంచి తొందరగా బయటపడాలని కోహ్లి సేన భావిస్తోంది. మరోవైపు సిరీస్‌లో శుభారంభం చేసిన ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు వరుస విజయంపై కన్నేసింది. బ్యాటింగ్, బౌలింగ్... ఆల్‌రౌండ్ సత్తాతో పర్యాటక జట్టును మళ్లీ కంగారు పట్టించేందుకు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో ఆదివారం రెండో వన్డే జరుగుతుంది. కోహ్లి ఫామ్‌పైనే కలవరం... ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లి చక్కగా రాణించిన సందర్భాలున్నాయి. కానీ ప్రత్యేకించి ఇక్కడి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సీజీ)లో అతని ఆటతీరు పేలవం. ఇక్కడ అతని టాప్ స్కోరు 21 పరుగులే. గత మ్యాచ్‌లో అదేస్కోరును సమం చేశాడంతే! సగటైతే 11.40 పరుగులే. ‘టన్’లకొద్దీ పరుగులు బాదిన ఈ సీనియర్ బ్యాట్స్‌మన్‌కు ఎస్సీజీ అంతుచిక్కడం లేదు. ఆదివారం భారత కెప్టెన్ నిలబడినా, రాణించినా గత విశ్లేషణలన్నీ మారుతాయి. విజయం కూడా దక్కుతుంది. ఓపెనర్ మయాంక్ ఐపీఎల్లో అదరగొట్టాడు. ఇక్కడ అదేపని చేస్తే... మరో ఓపెనర్ ధావన్ ఫామ్‌లో ఉండటంతో చక్కని ఆరంభమే కాదు భారీ భాగస్వామ్యం నమోదు చేయొచ్చు. ఆ తర్వాత కోహ్లితో పాటు మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ బ్యాట్‌కు పనిచెబితే పరుగుల వరద పారుతుంది. హార్దిక్ పాండ్యా చాలా రోజుల తర్వాత వన్డే ఆడినా... తొలి మ్యాచ్‌తోనే ఫామ్ కనబరిచాడు. ఇది జట్టుకు సానుకూలాంశం. ఫిట్‌గానే చహల్... స్పిన్నర్ యజువేంద్ర చహల్ తొలి వన్డే ఆడుతూ స్వల్ప గాయంతో మైదానం వీడినా... తన 10 ఓవర్ల కోటా పూర్తి చేశాడు. దీంతో అతడి ఫిట్‌నెస్‌పై జట్టుకు ఎలాంటి కలవరం లేదు. అయితే గత మ్యాచ్‌లో అతనితో పాటు బుమ్రా, సైనీ ధారాళంగా సమర్పించుకున్న పరుగులతోనే జట్టు మేనేజ్మెంట్ ఆందోళన పడుతోంది. సీమర్లకు అనుకూలమైన పిచ్‌లపై బుమ్రా విఫలమవడమే కాస్త ఇబ్బందికర పరిణామం. అయితే రెండో వన్డేలో అతను కుదుటపడితే ఆ ఇబ్బందులు ప్రత్యర్థి జట్టుకు బదిలీ చెయొచ్చు. కొత్త బౌలర్ నటరాజన్‌కు అవకాశమివ్వాలని భావిస్తే సైనీని పక్కనబెట్టే అవకాశాలున్నాయి. జోరు మీదున్న ఆసీస్... భారత బౌలింగ్‌ను చితగ్గొట్టిన బ్యాట్స్‌మెన్ ఫామ్‌తో, శతక భాగస్వామ్యాలతో ఆస్ట్రేలియా జోరుమీదుంది. ఇది ఇలాగే కొనసాగించి ఇక్కడే సిరీస్ గెలుచుకోవాలనే ఆత్మవిశ్వాసంతో ఫించ్ సేన ఉవ్విళ్లూరుతోంది. ముఖ్యంగా టాపార్డర్ బ్యాట్స్‌మెన్ వార్నర్, ఫించ్, స్మిత్‌ల ప్రదర్శన ఆతిథ్య జట్టు బలాన్ని రెట్టింపు చేసింది. గాయపడిన ఆల్‌రౌండర్ స్టొయినిస్ స్థానంలో మరో ఆల్‌రౌండర్ గ్రీన్ అందుబాటులో ఉన్నాడు. దీంతో అతని అరంగేట్రం దాదాపు ఖాయమైంది. సొంతగడ్డపై పేసర్లు స్టార్క్, కమిన్స్, హాజల్వుడ్లది ఎప్పుడైనా పైచేయే! ఆతిథ్య అనుకూలతలు వారిని ఓ మెట్టుపైనే నిలబెడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక స్పిన్నర్ జంపా గత మ్యాచ్‌లో భారత వెన్నువిరిచాడు. కీలక బ్యాట్స్‌మెన్‌నే కాదు... క్రీజులో పాతుకుపోయిన బ్యాట్స్‌మన్‌ను కూడా తన స్పిన్ ఉచ్చులో ఉక్కిరిబిక్కిరి చేశాడు. పిచ్, వాతావరణం గత మ్యాచ్‌లాగే పరుగుల వరద పారే పిచ్. బ్యాట్స్‌మెన్ నిలబడితే చాలు... భారీస్కోర్లు రిపీట్ అవుతాయి. మ్యాచ్‌కు వర్షం ముప్పయితే లేదు. -
ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
ఆక్లాండ్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించాడు. తొలి వన్డేలో 347 పరుగులు... ఇంత భారీ స్కోరు చేసిన తర్వాత కూడా భారత జట్టు మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. టీమిండియా బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలు ఇక్కడ స్పష్టంగా కనిపించాయి. టి20 సిరీస్‌లో ఘన విజయం తర్వాత జట్టు ఉదాసీనత ప్రదర్శించినట్లు గత మ్యాచ్‌లో అనిపించింది. ఇప్పుడు ఆ పరాజయాన్ని మరచి కొత్త వ్యూహంతో బరిలోకి దిగాల్సిన సమయం వచ్చింది. తుది జట్ల వివరాలు: భారత్: కోహ్లి(కెప్టెన్), పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), జాదవ్, జడేజా, ఠాకూర్, సైని, బుమ్రా, చాహల్ న్యూజిలాండ్: లాథమ్ (కెప్టెన్, వికెట్ కీపర్), నికోలస్, గప్టిల్, చాప్మన్, బ్లండెల్, టేలర్, నీషామ్, డి గ్రాండ్‌హోమ్, సౌతీ, జామిసన్, బెన్నెట్ పిచ్, వాతావరణం ఇలా బ్యాట్‌కు బంతి తగలడమే ఆలస్యం అలా బౌండరీ దాటడం ఈడెన్ పార్క్‌లో సహజం. ప్రపంచంలో అతి చిన్న మైదానాల్లో ఇదొకటి. పరుగుల వరదతో భారీ స్కోర్లు ఖాయం. ఈ పర్యటనలో తొలి రెండు టి20లు ఇక్కడే జరిగాయి. ఛేదన సులువు కాబట్టి టాస్ కీలకం కానుంది. మ్యాచ్ రోజు వర్షం ముప్పు లేదు. -
రెండో వన్డేలో భారత్ ఘనవిజయం
-
నగరానికి క్రికెట్ ఫీవర్
-
మహిళల మూడో వన్డే రద్దు
లండన్:ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత మహిళల జట్టును కూడా వరుణుడు వదిలి పెట్టలేదు. సోమవారం జరగాల్సిన భారత-ఇంగ్లండ్ ల పురుషుల తొలి వన్డేకు వర్షం ఆటంకం కల్గించడంతో ఆ మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే. అయితే మహిళల విభాగంలో జరగాల్సిన మూడో వన్డేను కూడా వర్షం అడ్డుకుంది. లార్డ్స్ లో భారీ వర్షం కురవడంతో మూడో వన్డేను రద్దు చేయకతప్పలేదు. తొలి వన్డేలో స్లాగ్ ఓవర్లలో బ్యాటింగ్‌లో విఫలమైన భారత మహిళల జట్టు... ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలోనూ 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఆతిథ్య జట్టు 2-0తో సిరీస్ ను గెలుచుకుంది. ఈ మ్యాచ్ లోనైనా గెలిచి పరువు నిలుపుకుందామనుకున్న భారత మహిళలకు ఆ ఆశ తీరలేదు. ఇంగ్లండ్ మహిళలతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ లో భారత్ మహిళలు విజయం సాధించినా.. వన్డేల్లో మాత్రం ఘోరంగా విఫలమైయ్యారు. -
భారత మహిళల పరాజయం
►2-0తో సిరీస్ ఇంగ్లండ్ కైవసం ►ఎడ్వర్డ్స్ అజేయ సెంచరీ స్కార్బోరో: స్లాగ్ ఓవర్లలో బ్యాటింగ్‌లో విఫలమైన భారత మహిళల జట్టు... ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలోనూ 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆతిథ్య జట్టు 2-0తో గెలుచుకుంది. నార్త్ మెరైన్ గ్రౌండ్లో జరిగిన ఈ మ్యాచ్‌లో... భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 214 పరుగులు చేసింది. చార్లెటీ ఎడ్వర్డ్స్ (145 బంతుల్లో 108 నాటౌట్; 11 ఫోర్లు) సెంచరీతో చెలరేగింది. టేలర్ (23) మినహా మిగతా వారు విఫలమైనా...ఎడ్వర్డ్స్ ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచింది. టేలర్‌తో కలిసి రెండో వికెట్‌కు 50; విన్ఫీల్డ్ (10)తో కలిసి మూడో వికెట్‌కు 36; స్కివెర్ (17)తో కలిసి ఆరో వికెట్‌కు 44 పరుగులు జోడించి జట్టుకు భారీ స్కోరు అందించింది. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 4, గోస్వామి 3 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 48.4 ఓవర్లలో 201 పరుగులు మాత్రమే చేసి ఓడింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (43) టాప్ స్కోరర్. స్మృతి మందన (32), కెప్టెన్ మిథాలీ రాజ్ (30), వనిత (23) ఫర్వాలేదనిపించారు. హర్మన్‌ప్రీత్ మూడు కీలక భాగస్వామ్యాలు జోడించినా ప్రయోజనం లేకపోయింది. గున్ 4, శ్రుబ్సోలె, నైట్ చెరో 2 వికెట్లు తీశారు. ఎడ్వర్డ్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య మూడో వన్డే సోమవారం లార్డ్స్‌లో జరుగుతుంది.