ఎవరికీ దక్కని మెజారిటీ
తెలంగాణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ కావల్సిన ఓట్లు రాకపోవడంతో.. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తున్నారు. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్నగర్ టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు పూర్తయింది.
ఇందులో కాటేపల్లికి 7636, మాణిక్ రెడ్డికి 3091, ఏవీఎన్ రెడ్డికి 2966, హర్షవర్దన్ రెడ్డికి 2486 ఓట్లు వచ్చాయి. అయితే.. మొత్తం ఓట్లలో 50 శాతం ఓట్లు ఏ అభ్యర్థికీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఆ తర్వాత తుది ఫలితాన్ని వెల్లడిస్తారు.