Second semifinal
-
భారత్-ఇంగ్లండ్ సెమీస్.. ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్!
టీ20 వరల్డ్‌కప్-2024లో రెండో సెమీఫైనల్‌కు రంగం సిద్దమైంది. గయానా వేదికగా సెకెండ్ సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ఫైనల్లో అడుగుపెట్టాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. అయితే ఈ సెమీస్ పోరుకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ మ్యాచ్ స్ధానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 10:00 గంటలకు( భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు) ప్రారంభం కానుంది. ప్రస్తుతం గయానాలో భారీ వర్షం కురుస్తోంది. బుధవారం రాత్రి కూడా ఉరుముల, మెరుపులతో కూడిన వర్షం కురిసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. దీంతో గ్రౌండ్ స్టాప్ మైదానం మొత్తం కవర్లతో కప్పి ఉంచారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తే మ్యాచ్‌కు వర్షం కచ్చితంగా అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది. కాగా తొలి సెమీఫైనల్‌కు రిజర్వ్ డే ఉంది. కానీ భారత్, ఇంగ్లండ్ రెండో సెమీఫైనల్‌కు రిజర్వ్ డే లేదు. ఈ మ్యాచ్ ఉదయం జరగనుండటంతో నిర్ణీత సమయం కటాఫ్ లేకుండా పొడిగింపు మాత్రం ఉంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దు అయితే సూపర్–8 దశలో టాపర్‌గా నిలిచిన భారత్ ఫైనల్‌కు చేరుతోంది. ఇక ఇప్పటికే దక్షిణాఫ్రికా ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. -
FIFA World Cup Qatar 2022 Semi-Final: అందరి కళ్లు మొరాకో పైనే...
దోహా: అందరి అంచనాలను తారుమారు చేస్తూ... ఊహకందని ప్రదర్శనతో అదరగొడుతున్న ఆఫ్రికా జట్టు మొరాకో మరో సంచలనం సృష్టించాలనే పట్టుదలతో ఉంది. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో భాగంగా నేడు జరిగే రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌తో మొరాకో తలపడనుంది. ప్రపంచకప్ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య ఇదే తొలి ముఖాముఖి మ్యాచ్ కాగా... వేర్వేరు టోర్నీలలో ఈ రెండు జట్లు 11 సార్లు తలపడ్డాయి. 1963లో ఒక్కసారి ఫ్రాన్స్‌ను ఓడించిన మొరాకో ఆ తర్వాత ఏడు మ్యాచ్‌ల్లో ఓడిపోయి, మూడు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. 2007 తర్వాత ఈ రెండు జట్ల మధ్య మరోసారి మ్యాచ్ జరుగుతుండటం విశేషం. ఎంబాపె, జిరూడ్, గ్రీజ్మన్, థియో హెర్నాండెజ్, చువమెని, గోల్‌కీపర్ హుగో లోరిస్లాంటి స్టార్ ఆటగాళ్లతో ఫ్రాన్స్ పటిష్టంగా ఉంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 22వ స్థానంలో ఉన్న మొరాకో ప్రపంచకప్‌లో సెమీఫైనల్ చేరిన తొలి ఆఫ్రికా దేశంగా రికార్డు నెలకొల్పింది. కెనడాతో మ్యాచ్‌లో సెల్ఫ్ గోల్ మినహా ఈ మెగా టోర్నీలో ప్రత్యర్థి జట్టుకు ఒక్క గోల్ కూడా సమర్పించుకొని ఏకైక జట్టుగా మొరాకో నిలిచింది. గ్రూప్ దశలో గత ప్రపంచకప్ రన్నరప్ క్రొయేషియా జట్టును నిలువరించిన మొరాకో ఆ తర్వాత రెండో ర్యాంకర్ బెల్జియంపై... ప్రిక్వార్టర్ ఫైనల్లో 2010 విశ్వవిజేత స్పెయిన్‌పై... క్వార్టర్ ఫైనల్లో 2016 యూరో చాంపియన్ పోర్చుగల్‌ను ఓడించి తమను ఏమాత్రం తక్కువ అంచనా వేయొద్దని ఫ్రాన్స్‌కు హెచ్చరికలు పంపించింది. మొరాకో తరఫున యూసుఫ్ ఎన్ నెసిరి, అచ్రఫ్ హకీమి, హకీమ్ జియెచ్, సఫ్యాన్ అమ్రాబత్, గోల్‌కీపర్ యాసిన్ బోనో ప్రదర్శన మరోసారి కీలకం కానుంది. ఈ టోర్నీలో ప్రత్యర్థి ఆటగాళ్లు గోల్‌పోస్ట్ లక్ష్యంగా కొట్టిన 39 షాట్లను గోల్‌కీపర్ యాసిన్ బోనో నిలువరించడం విశేషం. -
రంజీ ఫైనల్లో తమిళనాడు
కోల్‌కతా: రంజీ ట్రోఫీ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక జట్టు ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. మహారాష్ట్రతో జరిగిన రెండో సెమీఫైనల్ ‘డ్రా’గా ముగిసినా... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా తమిళనాడు తుది పోరుకు అర్హత సాధించింది. ఈనెల 8 నుంచి ముంబైలో ఫైనల్ జరుగుతుంది. అటు గతేడాది రన్నరప్ అయిన మహారాష్ట్ర చివరి రోజు ఆదివారం ప్రత్యర్థి బౌలింగ్ ముందు తేలిపోయింది. తమ తొలి ఇన్నింగ్స్‌లో 142 ఓవర్లలో 454 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో తమిళనాడుకు 95 పరుగుల ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన తమిళనాడు ఆట ముగిసే సమయానికి 46.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 119 పరుగులు చేసింది.