రంజీ ట్రోఫీ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక జట్టు ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. మహారాష్ట్రతో జరిగిన రెండో సెమీఫైనల్ ‘డ్రా’గా ముగిసినా...
కోల్‌కతా: రంజీ ట్రోఫీ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక జట్టు ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. మహారాష్ట్రతో జరిగిన రెండో సెమీఫైనల్ ‘డ్రా’గా ముగిసినా... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా తమిళనాడు తుది పోరుకు అర్హత సాధించింది. ఈనెల 8 నుంచి ముంబైలో ఫైనల్ జరుగుతుంది.
అటు గతేడాది రన్నరప్ అయిన మహారాష్ట్ర చివరి రోజు ఆదివారం ప్రత్యర్థి బౌలింగ్ ముందు తేలిపోయింది. తమ తొలి ఇన్నింగ్స్‌లో 142 ఓవర్లలో 454 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో తమిళనాడుకు 95 పరుగుల ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన తమిళనాడు ఆట ముగిసే సమయానికి 46.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 119 పరుగులు చేసింది.